రేపు మలివిడత మున్సిపల్, తొలివిడత పంచాయతీ ఎన్నికలు | AP Panchayat Elections Political Updates November 25 2026 | Sakshi
Sakshi News home page

రేపు మలివిడత మున్సిపల్, తొలివిడత పంచాయతీ ఎన్నికలు

Nov 25 2026 7:54 AM | Updated on Nov 25 2026 8:02 AM

AP Panchayat Elections Political Updates November 25 2026

రేపు(గురువారం) మలివిడత మున్సిపల్, తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కూటమి నేతల దౌర్జన్యాలు, బెదిరింపులపై, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ల తిరస్కరణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వెఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్‌ పత్రాలను వెన్నుపోటు పార్టీ కూటమి మూకలు చించివేస్తున్నా, అభ్యర్థులపై దాడులు చేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అన్నీ సక్రమంగా ఉన్నా..

  • అన్నీ సక్రమంగా ఉన్నా నామినేషన్లు తిరస్కరిస్తున్నారు
  • సక్రమంగానే ఉన్నాయని అధికారులు మొదట ధ్రువీకరిస్తున్నారు 
  • ఆ తరువాత ఆర్వో సక్రమంగా లేవంటున్నారు 
  • అప్పీల్‌ చేస్తే ఆర్డీవోలు భిన్నమైన కారణాలు చెబుతున్నారు 
  • హైకోర్టులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పిటిషన్‌ 
  • స్పందించిన హైకోర్టు.. ఎన్నికల కమిషన్, ఆర్వో, ఆర్డీవోలకు నోటీసులు 

నామినేషన్‌ పత్రాలు చించేస్తున్నా..

  • నామినేషన్‌ పత్రాలు చించేస్తున్నా పట్టించుకోవడం లేదు 

  • సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికల కమిషన్‌ సూచనలు బేఖాతర్‌ 

  • అన్ని ఆధారాలు, వీడియోలు అందజేసినా ఎస్‌ఈసీ మౌనం

  • పంచాయతీ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి మూకల అరాచకాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు 

  • నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి 

  • ప్రతి అభ్యర్థి నామినేషన్‌ తీసుకోవాలని, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌

రేపు మలివిడత మున్సిపల్, తొలివిడత పంచాయతీ ఎన్నికలు

  • అదే రోజు పోలింగ్‌ అనంతరం పంచాయతీ ఎన్నికల ఫలితాలు 

  • 30న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడి..

  • డిసెంబర్‌ 5న 23 పట్టణ స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు 

ఆ ఎన్నికలను వీడియో తీయించండి

  • మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ 
  • కార్పొరేషన్‌ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన హైకోర్టు 
  • వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి పిటిషన్‌కు స్పందించిన న్యాయస్థానం 
  • అన్ని డివిజన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు..
  • ఎన్నికల ప్రక్రియను ఆద్యంతం వీడియోగ్రఫీ చేయించాలి 
  • సీసీ ఫుటేజీని భద్రపరచాలని ఉత్తర్వులు జారీ 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement