సంక్రాంతికి 30 ప్రత్యేక రైళ్లు | 30 special trains for Sankranti | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి 30 ప్రత్యేక రైళ్లు

Nov 25 2026 5:46 AM | Updated on Nov 25 2026 5:46 AM

30 special trains for Sankranti

సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్‌ నుంచి పార్వతీపురం, శ్రీకాకుళం రోడ్, నర్సాపురం వరకు

సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే శాఖ పలు ప్రాంతాల మధ్య 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి ఏపీలోని పార్వతీపురం, శ్రీకాకుళం రోడ్, నర్సాపూర్‌ మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు అందు బాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. 

ప్రత్యేక రైళ్ల వివరాలు:
»  సికింద్రాబాద్‌ – పార్వతీపురం(07009): డిసెంబర్‌ 23, 30, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో(ప్రతి బుధవారం) రాత్రి 7:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:15 గంటలకు చేరుకుంటుంది.

» పార్వతీపురం – సికింద్రాబాద్‌(07010): డిసెంబర్‌ 24, 31, జనవరి 7, 14, 21, 28 తేదీల్లో(ప్రతి గురువారం) మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు చేరుకుంటుంది. చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో ఆగుతుంది. 

»  చర్లపల్లి–నర్సాపూర్‌(07013): జనవరి 10, 12, 17, 19 తేదీల్లో(ఆది, మంగళవారాల్లో) రాత్రి 7:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు చేరుకుంటుంది.

» నర్సాపూర్‌ – చర్లపల్లి(07014): జనవరి 11, 13, 18, 20 తేదీల్లో (సోమ, బుధవారాల్లో) రాత్రి 10:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:50 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌ స్టేషన్లలో ఆగుతుంది.

» చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్‌(07115): జనవరి 7, 9, 16 తేదీల్లో(గురు, శనివారాల్లో) రాత్రి 7:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకుంటుంది.

»  శ్రీకాకుళం రోడ్‌ – చర్లపల్లి (07116): జనవరి 8, 10, 17 తేదీల్లో (శుక్ర, ఆదివారాల్లో) మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

» హైదరాబాద్‌ – నర్సాపూర్‌ (07117): జనవరి 9, 16 తేదీల్లో (శనివారాల్లో) సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు చేరుకుంటుంది.

» నర్సాపూర్‌ – హైదరాబాద్‌ (07118): జనవరి 10, 17 తేదీల్లో (ఆదివారాల్లో) రాత్రి 8:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:35 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement