కోడి జాతుల్లో రాజసానికి ప్రతీకగా నిలిచే బ్రహ్మ కోడి తన భారీ ఆకృతి, ప్రత్యేకమైన అందంతో ఆకట్టుకుంటుంది. కాళ్ల పాదాల వరకు విస్తరించిన దట్టమైన వెంట్రుకలు, మెడ చుట్టూ జూలుతో ఈ జాతి కోళ్లు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. సాధారణంగా 4.5 నుంచి 5.5 కిలోల బరువు, దాదాపు 30 అంగుళాల ఎత్తు వరకు పెరిగే బ్రహ్మ కోడి చూడగానే రాజసాన్ని తలపిస్తుంది. భారీ ఆకారం ఉన్నప్పటికీ ఇవి అత్యంత సౌమ్య స్వభావం కలిగి ఉండి మనుషులతో కూడా త్వరగా కలిసిపోతాయి. విశాఖలోని వీఐపీ రోడ్డులోని ఓ పెంపుడు పక్షుల దుకాణంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న ఈ అరుదైన బ్రహ్మ కోడి ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది.
– ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


