వారంతా ఒకేచోట పనిచేస్తున్నారు. కార్తీక పౌర్ణమి వేళ శ్రీకాకుళంలోని ముఖలింగేశ్వరుడిని దర్శించుకోవాలని తలచారు. అర్ధరాత్రి తర్వాత వాహనంలో బయలుదేరారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. స | - | Sakshi
Sakshi News home page

వారంతా ఒకేచోట పనిచేస్తున్నారు. కార్తీక పౌర్ణమి వేళ శ్రీకాకుళంలోని ముఖలింగేశ్వరుడిని దర్శించుకోవాలని తలచారు. అర్ధరాత్రి తర్వాత వాహనంలో బయలుదేరారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. స

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

కారులోనే మృతి చెందిన భార్యాభర్తలు

కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీస్తున్న స్థానికులు

పూసపాటిరేగ/తగరపువలస/భీమునిపట్నం:

భోగాపురం సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన వాకచర్ల శ్రీనివాసరావు (45), ఆయన భార్య కుసుమ రంజిని (40), భీమిలికి చెందిన బొర్రా సతీష్‌(47), ఆయన భార్య బొర్రాశృతి (40), కొండపు సూరిబాబు(49) మృతి చెందారు. వీరంతా సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో థార్‌ కారులో మధురవాడ, భీమిలి నుంచి శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వర స్వామి దర్శనానికి బయలు దేరారు. దైవదర్శనం అనంతరం తిరిగి ఇళ్లకు వెళ్తుండగా భోగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ లారీని ఉదయం 7 గంటల సమయంలో వీరి కారు వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అగ్ని మంటలు రేగడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు, కుసుమ రంజిని, సతీష్‌, శృతిలు అక్కడకక్కడే మృతి చెందారు. సూరిబాబుకు తీవ్ర గాయాలు కావడంతో సంగివలసలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు.

భోగాపురం జాతీయ రహదారిపై

ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న ట్యాంకర్‌ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన కారు

ఐదుగురు స్నేహితుల దుర్మరణం

మృతులు విశాఖపట్నం వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement