breaking news
Vizianagaram District News
-
అదుపు తప్పిన ట్రావెల్స్ బస్సు
విజయవాడ: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. విజయవాడ నుంచి రాజాం వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. విజయవాడలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజాం వెళ్తుండగా మార్గమధ్యంలో నిడమానూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పటమట పోలీసులు పేర్కొన్నారు. -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా అందజేయవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలపై పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్‌తో ఫీడ్ బ్యాక్ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను కూడా తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. -
రామతీర్థంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ రామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం, యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం వెండి మంటపం వద్ద వేద పండితుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుక నిర్వహించారు. కల్యాణం అనంతరం శ్రీవారిని పల్లకిలో ఉంచి గ్రామంలో తీరు వీధి ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కకావికలమవుతున్న కాపురాలు..!
పార్వతీపురం రూరల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో పక్కదారి పడుతున్న బంధాలతో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. సెల్ఫోన్ల దుర్వినియోగం, సోషల్ మీడియా మోజులో పడి అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో కట్టుకున్న వారినే కడతేర్చే సంస్కృతి పెరిగిపోతోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలతో కుటుంబాలు వీధిన పడుతుండగా, కన్నవారి అఘాయిత్యాల వల్ల ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. గత ఏడాది (2025)లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 30 హత్యలు జరగ్గా, వాటిలో విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. అడ్డుతొలగించుకునేందుకు దారుణం పాలకొండ మండలం బర్నసీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) జూన్ 2026లో హత్యకు గురైంది. మాజీ వలంటీర్ రెడ్డి భువనేశ్వర్, ఆమెతో ప్రేమాయణం నడుపుతూనే, అదే సమయంలో తీగల కృపారాణి అనే వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతో, ప్రియురాలితో కలిసి పకడ్బందీగా పథకం పన్నాడు. జూన్ 6న కారులో తీసుకెళ్లి, కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహం బయటపడకుండా కాళ్లు, చేతులు కట్టేసి, బరువైన రాయి కట్టి తుమరాడ వద్దనున్న చెరువులో పడేశారు. పరువు పోతుందనే భయంతో.. కురుపాం మండలానికి చెందిన ఇద్దరు పిల్లలున్న వివాహిత (30), సీతంపేట మండలానికి చెందిన మరో వివాహితుడు (34) మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరు గ్రామం విడిచి హైదరాబాద్ పారిపోగా, కుటుంబసభ్యులు పట్టుకుని తిరిగి సొంతూరికి తీసుకొస్తున్నారు. అయితే గ్రామంలో అడుగుపెడితే తమ భాగోతం తెలిసిపోయి బంధువుల ఎదుట పరువు పోతుందనే భయంతో మార్గమధ్యంలో కారు దిగి పురుగు మందు తాగేశారు (జూలై 2024). ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ఉరివేసి..ఆత్మహత్యగా చిత్రీకరించి.. దత్తివలసకు చెందిన వివాహితుడు పెరుమాళ్ల రాంబాబు, నడిమివలసకు చెందిన 19 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె పెళ్లికి ఒత్తిడి చేయడంతో, ఏప్రిల్ 2025లో గొంతు నులిమి చంపేశాడు. స్నేహితుల సాయంతో మృతదేహాన్ని బైక్‌పై దాదాపు 150 కిలోమీటర్లు తీసుకెళ్లి, సాలూరు మండలంలోని గాదెపల్లెవలస వద్ద చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అనుమానపు కాటు..మద్యానికి బలి.. జూలై 8న జామి మండలం అలమండలో ఒడిశాకు చెందిన సంజయ్ బెహరా తన భార్యను అనుమానంతో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీంతో వారి ఏకై క కుమారుడు అనాథ అయ్యాడు. అలాగే, ఆగస్టు 2025లో సాలూరులో తాపీ మేసీ్త్రగా పనిచేసే రామకృష్ణ.. మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్య త్రివేణి మెడకు మిక్సీ వైరు బిగించి దారుణంగా హత్య చేశాడు. జూలై 15న పూసపాటిరేగ మండలం పెద్దనడిపల్లిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వివాహితను హతమార్చడంతో ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమయ్యారు. మాయమాటల మత్తులో.. మంటగలుస్తున్న మానవత్వం ప్రియుల మోజులో పడి..కట్టుకున్న వారినే కడతేర్చి ఆవేశంలో అఘాయిత్యం..అంధకారంలో చిన్నారుల భవిష్యత్తు ఆధునికత ముసుగులో..అంతరిస్తున్న విలువలుక్షణికావేశం వద్దు.. కుటుంబ భవిష్యత్తే ముఖ్యం..వివాహేతర సంబంధాల మోజులో పడి, విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడడం అత్యంత బాధాకరం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల పచ్చని కాపురాలు కూలిపోవడమే కాకుండా, అభంశుభం తెలియని చిన్నారులు అనాథలవుతున్నారు. ఏదైనా దారుణానికి ఒడిగట్టే ముందు ఒక్కసారి కుటుంబం, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ చట్టాలపై కనీస అవగాహన పెంచుకోవాలి. తప్పు చేస్తే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న భయం ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భరోసా నింపుతూ, నేరాల నియంత్రణపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. కుటుంబంలో కలహాలు, అనుమానాలు వస్తే పెద్దల సమక్షంలో లేదా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేకానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. ప్రశాంత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలి. బి.వెంకట్రావు, సీఐ, పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
బాడంగి: తాగుడు వ్యసనానకి బానిసై పూర్తి జీతం ఇంటికి తేలేదని భార్య మందలిచినందుకు మనస్తాపం చెందిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం కూనాయవలస ఎస్సీ కాలనీకి చెందిన అలజంగి గణపతి(41) బాడంగి మండలంలోని డొంకినవలస రైల్వెస్టేషన్కు వెళ్లే రహదారి పక్కనగల పాత ఎఫ్‌సీఐ గిడ్డంగి వెనుక భాగంలో చీమచింతచెట్టుకు దుప్పటి కట్టుకుని ఉని వేసుకున్నాడు. గణపతి రాజాంలోని జీఎంఆర్ హాస్టల్ కుక్‌గా పనిచేస్తున్నాడని, శనివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లకుండా చుట్టుపక్కల తిరుగుతూ ఆదివారం ఉదయానికి విగతజీవిగా కనిపించాడు. ఆ ప్రాంతానికి చెందిన పశువుల కాపరి చూసి విషయాన్ని గ్రామస్తులతో చెప్పగా అందులో ఒకరు సెల్ఫోన్లో ఫొటో తీసీ వాట్సాప్‌లో పెట్టగా వారి బంధువులు గుర్తించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, దీఫు, సమీక్ష అనే 8, 9 ఏళ్లవయస్సు కలిగిన పిల్ల లున్నారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యకుమారి కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీహెచ్‌సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. -
వైఎస్సార్సీపీకి కార్యకర్తలే వెన్నెముక
గజపతినగరం రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, వారే పార్టీకి వెన్నెముక అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. స్థానిక బెల్లాన కన్వెన్షన్‌లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశంలో బొత్స మాట్లాడుతూ, తప్పుడు మార్గాలు వెతికే వారికి రాజకీయాల్లో మనుగడ ఉండదన్నారు. ఆర్థిక లావాదేవీలు కారణంగానే కొంద రు పార్టీని వదిలి వెళ్లారని విమర్శించారు. ఒకరు పార్టీని వదిలి వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్టీని వదిలి వెళ్లిన వారిని ఆలీబాబా 40 దొంగలుగా అభివర్ణించారు. ఒకరు పోతే మరొకరు వస్తారని రాజకీయాల్లో ఇదంతా సర్వ సాధారణం అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, భవిష్యత్తులో కార్యకర్తలే పార్టీకి సమన్వయకర్తలుగా వ్యవహరించి పార్టీని బలోపేతం దిశగా తీసుకువెళ్లాలన్నారు. ఏ ఒక్కరు అధైర్య పడవద్దని.. ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విలువలతో కూడిన రాజకీయాలే శాశ్వతంగా నిలు స్తాయని అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. 2029 సాధారణ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ ప్రభుత్వం రావడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. టీడీపీ రెండున్న ర సంవత్సరాల పాలన అంతా బూటకమని, ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మాయ చేశారని విమర్శించారు. సమావేశంలో యువ నాయకురాలు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ బొత్స అనూష, యువ నాయకులు బొత్స సందీప్, బొత్స సాయిగురు నాయుడు, కిల్లి సత్యనారాయణ, సిరిపురపు జగన్మోహన్ రావు, పీరుబండి జైహింద్‌కుమార్, బూడి వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు, బోద్దల చిన్నమనాయుడు, జాగారపు అప్పారావు, గొర్లె రవికుమార్, కృష్ణార్జున, జెడ్పీటీసీలు గొర్లె సరయు, రౌతు రాజేశ్వరి, ఎంపీపీలు సింహాద్రి అప్పలనాయుడు, చల్ల చల్లమనాయుడు, మాజీ జెడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ కంది తిరుపతి నాయుడు, మండల సురేష్, బెల్లాన త్రినాధ్, కరణం ఆదినారాయణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘బొత్స’ ఓ బ్రాండ్... : కురసాల కన్నబాబు ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొత్స బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్ చెప్పనవసరం లేదని, ఆ నీడలో ఎంతోమంది నాయకులు ఎదిగారని పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఒకరు పార్టీని వదిలి వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని... అలాంటి నాయకులను ఎంతోమందిని బొత్స సత్యనారాయణ తయారు చేసుకోగలరన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ధైర్యం ఉన్న నాయకుడు దేశంలోనే కనిపించరన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పార్టీని వదిలి వెళ్లినప్పుడు కూడా అదే ధైర్యంతో 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మళ్లీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తధ్యమన్నారు. ఉత్తరాంధ్ర భూములను చంద్రబాబు ప్రభుత్వం పప్పు బెల్లాళ్ల పంచి పెడుతుందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి..: బెల్లాన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగిస్తూ వస్తుందన్నారు. మాయ మాటలు, డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. బొత్స సత్యనారాయణ ఓ విశ్వవిద్యాలయం లాంటి వారిని, ఎంతోమంది నాయకులను తయారు చేసుకునే సామర్థ్యం వారిలో ఉందన్నారు. చంద్రబాబు... కరువు అన్నదమ్ములు : అప్పలనరసయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తేనే కరువు విలయతాండం చేస్తుందని, చంద్రబాబు, కరువు అన్నదమ్ములుగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య అభివర్ణించారు. దోచుకోవడం... దాచుకోవడంలో టీడీపీ నాయకులు బిజీ బిజీగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త పింఛన్లు డ్రామా తెరపైకి తీసుకువచ్చారన్నారు. ఈ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే... ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉత్సాహంలో ఉన్నారన్నారు. సైకిల్‌కు బ్రేకులు లేవు.. : ఎమ్మెల్సీ సురేష్‌బాబు చంద్రబాబు సైకిల్‌కి బ్రేకులు లేవని, బెల్లు మాత్రమే పని చేస్తుందని ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు ఎద్దేవా చేశారు. సైకిల్ పూర్తిగా తుప్పు పట్టిందని, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 90 శాతం పూర్తయిందని, ఆఖరిలో ప్రారంభోత్సవం చేసుకుని తన గొప్పగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేయటన్నారు. -
మూడు తులాల బంగారం, రూ.20వేలు చోరీ
లక్కవరపుకోట: మండలంలోని భీమాళి గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన దొంగతనం కలకలం రేపింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న నత్తల రవి బస్ మెకానిక్ పనులు చేస్తుంటాడు. ఆయన తల్లి వ్యవసాయ పనులు చేస్తుంది. ఈ క్రమంలో శనివారం ఎప్పటి మాదిరి ఇంటికి తాళాలు వేసి కిటికీ పక్కన చెప్పులు స్టాండ్ వద్ద తాళాలు దాచిపెట్టి తల్లీకొడుకులు ఎవరి పనులకు వెళ్లిపోయారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు గమనించి తాళాలను తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో గల వివిధ రకాల మూడు తులాల బంగారు వస్తువులు, రూ.20వేల నగదును దోచుకుపోయారు. పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తల్లి, కొడుకు చూసేసరికి ఇంటిలో సామగ్రి చిందరవందరగా పడి ఉండడంగమనించి బీరువాలో చూడగా వస్తువులు కనిపించలేదు. దీంతో ఎల్.కోట పోలీస్‌లకు ఫిర్యాదు చేయుగా ఆదివారం ఉదయం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించారు. పట్టపగలే దొంగతనం జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
వృద్ధురాలిపై దాడిచేసి బంగారు గొలుసు చోరీకి యత్నం
● నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● చికిత్స పొందుతున్న బాధితురాలు గరుగుబిల్లి: మండలంలోని కొట్నాన రామినాయుడువలస గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా వంట చేసుకుంటున్న కోడి గౌరమ్మ (భర్త దివంగత రేగం నాయుడు)పై అదే గ్రామానికి చెందిన బంకురు శ్రీనివాసరావు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. గౌరమ్మ కుమారుడు విజయనగరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసరావు ఆమె ఇంట్లోకి వెళ్లి గౌరమ్మ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో.. ఆగ్రహించిన నిందితుడు సుత్తితో ఆమె తలపై పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. గౌరమ్మ కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె కేకలు విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని అంబులెన్న్స్కు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన గౌరమ్మను పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గరుగుబిల్లి పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు సిద్ధమయ్యాయి. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర శివారుల్లో గల విజ్జి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–14,16,18,20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన ఎంపికల్లో రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 130 మంది క్రీడాకారులకు అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు టీ షర్టులు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు జిల్లా ఆదోనిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్, కోశాధికారి ఆనందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2న సత్యాగ్రహ దీక్ష● కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ విజయనగరం గంటస్తంభం: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైమ్, డైలీవేజ్, కంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమానం వేతనం, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎన్పీఆర్ భవన్లో సత్యాగ్రహ దీక్ష వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగ భద్రత, 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపు, మెడికల్, చైల్డ్‌కేర్ సెలవులు తదితర హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని కోరారు. పిడుగు పడి ఆవు మృతి బొండపల్లి: మండలంలోని గెద్దపేట గ్రామంలో పిడుగు పడి ఆవు మృతి చెందింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇల్లాపు శ్రీనుకు చెందిన ఆవును పొలాల్లోకి తీసుకువెళ్లగా అది మేత మేస్తుండగా పిడుగు పడడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది. ఈ విషయాన్ని బొండపల్లి పశువైద్యాధికారికి బాధిత రైతు కుటుంబసభ్యులు తెలియచేసి వివరాలు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య బొండపల్లి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని కనిమెరక రైల్వే పట్టాల వద్ద వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వర్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మరువాడ గ్రామానికి చెందిన భీమవరపు శ్రీనివాసరావు (50) కొద్ది నెలలుగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో గజపతినగరం నుంచి విజయనగరంవె వెళ్తున్న బొకారో రైలుకు ఎదురుగా నిలబడడంతో వేగంగా వస్తున్న రైలు ధాటికి శ్రీనివాస రావు శరీరం మొత్తం నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలాన్ని బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వర్రావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు,పెళ్లిళ్లు అయిన కూతురు సంధ్య, కుమారుడు ప్రదీప్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి రైల్వే పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
విజయనగరం: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి సర్కారు అండగా ఉంటుందని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వాస్తవాలు వెలుగు తీసి ప్రభుత్వానికి గైడ్ చేయాలని, వాస్తవాలు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత జర్నలిస్టుల దేనన్నారు. ఏపీయూడబ్ల్యూజే 27 వ మహాసభ విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వానికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. మంత్రిని దుశ్శాలువాతో యూనియన్ నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 న నిర్వహించే ఏపీయూడబ్ల్యూజే జాతీయస్థాయి నిరసనలో జర్నలిస్టుల గొంతు ప్రభుత్వానికి, ప్రజలకు వినిపించాలని కోరారు. అమరావతి మార్మోగాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమించే ఏకై క యూనియన్ ఏపీయూడబ్ల్యూజే అన్నారు. ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చడంలో మాట తప్పుతున్నాయని మండిపడ్డారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆర్థిక భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు వై.శివ, సామ్నా అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఐజే యూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ బాబు, సీనియర్ నాయకుడు దిమిలి అచ్యుతరావు, రామచంద్ర రావు తదితరులు జర్నలిస్టుల హక్కులు, పోరాటాలపై ప్రసంగించారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో సభకు స్వాగతం పలికారు. సభలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, ఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా సమాచార పౌర సంబంధాల ఉప సంచాలకుడు గోవిందరాజులు, జర్నలిస్టు నాయకులు టి.రాధాకృష్ణ, ఎం ఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు గురజాడ అప్పారావు విగ్రహానికి, సర్ సీవై చింతామణి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026గజ ఈతగాడు గెడ్డలో పడినట్లు..! ● చిన్న శ్రీను ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం... ● అయిష్టంగానే ఆహ్వానిస్తున్న టీడీపీ నేతలు ● ఎంపీ ఇంట్లో భోజన వేళ ఇదే చర్చ చీపురుపల్లి రూరల్: చీపురుపల్లి డివిజన్ పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్టు డీఎల్డీఓ కె.హేమసుందరరావు తెలిపారు. ఎస్జీఎస్డబ్ల్యూ విభాగం ఆధ్వర్యంలో ఈ నెలలో రెండో విడత సెప్టెంబర్ – 21 నుంచి 25 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారని తెలిపారు. 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమని తెలిపారు. క్యాంపులకు అవసరమైన గది, విద్యుత్, ఇంటర్నెట్, ప్రింటర్ వంటి సౌకర్యాలను పాఠశాల లు, కళాశాలల యాజమాన్యాలు కల్పించాలని ఆయన సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ● ఆరేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఏఏఎస్ పార్వతీపురం రూరల్: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (ఏఏఎస్)ను వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 7 జారీ చేసింది. ఒకే పోస్టు లేదా కేడర్‌లో ఆరేళ్ల అర్హత సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ స్కీమ్ కింద ‘స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్’ మంజూరు చేయనున్నారు. 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై న ఉద్యోగులకు 11వ పీఆర్సీ ఏఏఎస్ నిబంధనలకు లోబడి ఈ స్కేల్ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిశోర్, కార్యదర్శి కె.రంగాచారి స్పందించారు. ఇందుకు సహకరించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీజేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, ఏపీ ఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి డి.వి.రమణలకు వారు ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడిగా శ్రీరామ్మూర్తిపార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సేవల సంఘం (అమరావతి) రాష్ట్ర సహాధ్యక్షుడిగా జి.శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం అమరావతిలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీరామ్మూర్తి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనకు ఏపీ జేఏసీ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులతో పాటు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మరి... నిన్న మొన్నటి వరకూ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎంపీలను తన గుమ్మం ముందు వెయిట్ చేయించిన చిన్న శ్రీను ఇప్పుడు కారు నిండా బొకేలు శాలువాలు పట్టుకుని టీడీపీ నాయకు లు, ఎమ్మెల్యేల గుమ్మానికి బయలు దేరుతున్నా రు. వారి ఇళ్లకు వెళ్లి తనను తాను పరిచయం చేసు కుని కొత్త చుట్టరికానికి చేతులు చాస్తున్నారు. అటువైపు నుంచి ఇష్టం లేకున్నా అయిష్టంగానే ఆహ్వానించక తప్పని పరిస్థితిలో వారు మొహం మీద నవ్వును పులుముకుని రండి.. రండి.. అంటూ ఆ ఎపిసోడ్‌ను ముగిస్తున్నారు. గత 20 ఏళ్లుగా చిన్న శ్రీను అనుభవించిన పొలిటికల్ సెలబ్రిటీ స్టేటస్‌ను కళ్లారా చూసిన వాళ్లంతా ఔరా... పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే ఇదే కదా! అని లోలోన ముక్కున వేలేసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. ఆఖరుకు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కానీ జిల్లాలో చిన్న శ్రీను మాటకు తిరుగుండేది కాదు. పలు సందర్భాల్లో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఆయ నపై కటువైన కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఆయ న్ను రాజ్యాంగేతర శక్తి అని.. అవినీతిపరుడు అని పోరాటాలు.. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎకాఎకిన ఎలా ఆహ్వానించి కౌగిలించుకుంటాం అనే ప్రశ్నలు వేస్తున్నారు. కడుపులో కత్తులు.. కళ్లలో నవ్వులు 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ చిన్న శ్రీనుపై కత్తు లు నూరుతూనే ఉంది. జిల్లాపై ఆయన పెత్తనాన్ని పెద్దరికాన్ని పలు సందర్భాల్లో విమర్శిస్తూ ఆయనపై పోరాటం చేస్తూనే వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు మంత్రులుగా ఉన్నవారు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు, గవర్నర్‌గా ఉన్న వారు సైతం ఆయనను టార్గెట్ చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఒక్కసారిగా చిన్న శ్రీనును తమలో కలుపుకోవాలి అంటే కష్టంగా ఉందని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించడం ఆయన పట్ల వారిలో ఉన్న అయిష్టతను స్పష్టం చేస్తుంది. 20 ఏళ్లుగా ఉన్న వైరం ఒక్కసారిగా ఎలా పోతుంది అంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. పార్టీకి నాయకత్వ లోటు ఏం లేదే ? చిన్న శ్రీనును తమలో చేర్చుకొని ఆయనకు పెద్దరి కం ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు లోలోన గుర్రుమంటున్నారు. తమకు ఏ ఇబ్బంది లేదని, తమవైపు ఎవరూ లేకున్నా జిల్లా మొత్తాన్ని గెలిచామని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన్ను తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే ఎలా సహిస్తాం అని అంటున్నారు. నలభయ్యేళ్లుగా ఉన్న పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని గు ర్తు చేస్తూ ఇప్పటికిప్పుడు చిన్న శ్రీను వచ్చి తమను ఏం ఉద్ధరిస్తారని.. ఆయన రాకతో తమకు ఉన్నఫళంగా ఏం లాభం కలుగుతుందని అంటున్నారు. భోజన భేటీలో అప్పడాలు కరకర.. నాయకులు కొరకొర ప్రతి నెలా ఓ ఎమ్మెల్యే ఇంట్లో భోజనం పెట్టే పేరిట ఎమ్మెల్యేలంతా కలసి కూర్చుని మాట్లాడుకోవడం టీడీపీలో ఈ మధ్య వచ్చిన కొత్త సాంప్రదాయం. ఇందులో భాగంగా తాజాగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంట్లో రణస్థలంలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆయన పెద్దరికాన్ని, తమతమ నియోజకవర్గాల్లో ఆయన జోక్యాన్ని ఏమాత్రం సహించరాదని వారంతా కూడబలుక్కుని తీర్మానించినట్లు తెలిసింది. ఆయనకు ఏ చిన్న అవకాశం ఇచ్చినా తమ ఉనికికి ముప్పు కలుగుతుందని, అందుకే ఆయన్ను దూరం పెట్టాలని వారంతా మౌఖికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన చేరిక తమకు సుతరామూ ఇష్టం లేదని.. కానీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక సైలెంట్‌గా ఉన్నామని చెబుతూ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయన జోక్యం చేసుకుంటే లేనిపోని చిక్కులు.. గ్రూపు తగదాలకు ఆస్కారం కలుగుతుందని, దానికి అవకాశం ఇవ్వొద్దని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం
విజయనగరం గంటస్తంభం: నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఈ మేరకు సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా చందక శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా ఎం.శ్రీను, ఉపాధ్యక్షులుగా కె.సూరిబాబు, గొర్లె అర్జున్, కార్యదర్శిగా ఎం.మంగరాజు, సంయుక్త కార్యదర్శులుగా ఎస్.సుమతి, జి.లీలాకుమారి, కోశాధికారిగా టి.రామారావు, ప్రచార కార్యదర్శిగా కె.ఆనందకుమార్ ఎన్నికయ్యారు. ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో పాటు సంక్షేమం కోసం కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఉద్యోగుల హక్కులు, సేవా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల అధికారులు శ్రీనివాసరావు, చంద్రశేఖర్ రవి యాదవ్, వై.శ్రీనివాసరావు, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జి.రమేష్, పి.మురళీప్రసాద్, శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకే పింఛన్లు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న పింఛన్లను పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులకే మంజూరు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెబెక్స్‌లో అధికారులతో శనివారం మాట్లాడారు. జిల్లాలో పింఛన్ల కోసం 51,722 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయన్నారు. ఒంటరి మహిళల కేటగిరీలో పింఛన్ పొందేందుకు చట్టబద్ధమైన విడాకుల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలన్నారు. 21వ తేదీలోగా దరఖాస్తుల భౌతిక పరిశీలన పూర్తి చేసి 24వ తేదీలోగా తదుపరి పక్రియను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి, తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల ● జెడ్పీ సీఈఓ లవరాజు విజయనగరం రూరల్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించినట్టు జెడ్పీ సీఈఓ లవరాజు శనివారం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం 1586 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తూ తుది జాబితాను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ జాబితాను కలెక్టరేట్, జెడ్పీ, మండల కార్యాలయాల్లో ప్రచురించామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసి ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ లవరాజు తెలిపారు. చెరకు రైతులకు భరోసా ఇవ్వాలి ● 28న చెరకు రైతుల ర్యాలీ రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగార యాజమాన్యం చెరకు రైతులకు భరోసా ఇవ్వాలని సంకిలి సుగర్‌ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి, రైతులు డిమాండ్ చేశారు. రేగిడిలో చెరకు రైతులు శనివారం సమావేశమయ్యారు. కర్మాగారం పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. చక్కెర కర్మాగారాన్ని మూసివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 28న సంకిలి శివాలయం నుంచి చక్కెర కర్మాగారం వరకు చెరకు రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి దశల వారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. కార్యక్రమంలో చెరకు రైతులు కిమిడి సూరపునాయుడు, వీరఘట్టం, పాలకొండ, రేగిడి, బొబ్బిలి, వంగర మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
కులాల లెక్కలు లీక్?
విజయనగరం అర్బన్: నగరపాలకక సంస్థ ఎన్నికల రిజర్వేషన్లకు కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో గోప్యత ప్రశ్నార్ధకంగా మారింది. కులాల వారీగా ఓటర్ల గుర్తింపు, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తయి.. తుది జాబితా విడుదలకు రంగం సిద్ధమైన వేళ, ఆ వివరాలు ముందుగానే అధికార పార్టీకీ చెందిన ఓ కీలక ప్రతినిధికి చేరాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రిజర్వేషన్ల ఖారారుకు ఉపయోగించే కులాల వారీ ఓటర్ల సంఖ్య, వార్డుల వారీ వివరాలు అత్యంత కీలకం. నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సంబంధిత వివరాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగాల్సి ఉంది. హోటల్లోనే ‘డేటా’ వివరించారా? మున్సిపల్ కార్యాలయంలో కులాల వారీ ఓటర్ల జాబితాపై ఈ చర్చ జరిగితే విషయం బహిరంగమయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో... పట్టణంలోని ఓ హోటల్లో అధికార పార్టీ ప్రతినిధితో మున్సిపల్ ప్లానింగ్ విభాగానికి చెందిన కొందరు సిబ్బంది సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా వార్డు వారీగా కులాల ఓటర్ల సంఖ్య, ఏయే వార్డుల్లో ఏ వర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న అంశాలను వివరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ సమావేశం నిజంగా జరిగిందా? జరిగితే అక్కడ ఏ సమాచారం పంచుకున్నారు? అధికారికంగా వెల్లడించాల్సిన వివరాలను ముందుగానే ఎవరికై నా అందించారా? అన్నది తేలాల్సి ఉంది. తుది జాబితా ముందే అభ్యర్థుల కసరత్తా? రిజర్వేషన్‌కు సంబంధించిన తుది జాబితా ఇంకా అధికారికంగా విడుదల కాకముందే శనివారం రాత్రి అధికార పార్టీ, కూటమి వర్గాలకు చెందిన ఆశావాహులు కొన్ని వార్డులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆయా వార్డుల్లో ఏ సామాజిక వర్గానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్న లెక్కల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సాధారణ ప్రజలకు, ఇతర రాజకీయ పార్టీలకు అందుబాటులోకి రాని సమాచారం ఒక వర్గానికి ముందుగానే చేరడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తుది జాబితా రాకముందే అధికార పార్టీ చేతికి లెక్కల జాబితా ఓ ప్రైవేట్ హోటల్లో పార్టీనేతల రహస్య భేటీ రిజర్వేషన్ల మేరకు అభ్యర్థుల ఎంపికపై చర్చ మున్సిపల్ తీరుపై ప్రశ్నలు -
కార్యకర్తలే నాయకులు
–8లోపిడుగు పడి కుప్పకూలిన మహిళలు వరి చేనులో కలుపుతీతకు వెళ్లిన మహిళలను మృత్యువు కాటేసింది. పిడుగు రూపంలో ప్రాణాలు తీసింది. కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది. జిల్లా కమిటీ ఏకగ్రీవం ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయనగరం రూరల్: వైఎస్సార్సీపీ ప్రతీ కార్యకర్త ఒక నాయకుడని, ప్రజల్లో వారి మాటకే విలువని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్‌లో శనివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు సర్కారు అరాచకాలపై ప్రతీ కార్యకర్త ధైర్యంగా పోరాడాలని, ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. 2029లో మన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని, మన ప్రభుత్వంలో ప్రతీ కార్యకర్త భాగస్వాములు అవుతారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని, ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరికీ తోచినంతలో వారు దోచేస్తున్నారని విమర్శించారు. బాధ్యత, పదవులు, అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశామన్నదే ముఖ్యమన్నారు. జిల్లాలో వైద్య కళాశాల, జేఎన్టీయూ జీవీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, విజయనగరంలో డిగ్రీ కళాశాల ఎవరి హయాంలో ఏర్పడ్డాయో ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలలు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయని, భోగాపురం ఎయిర్‌ఫోర్టు శంకుస్థాపన, నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండడం దురదృష్టకరమని, అధికారం వచ్చిందంటే ప్రజలకు మంచి జరగాలేకాని, వారి ఉసురు తీయరాదన్నారు. సమస్యలు గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి హయాంలో పేద ప్రజల సంక్షేమానికి సుమారు వంద పథకాలు అమలు చేశారన్నారు. కరువు పరిస్థితులపై జగన్మోహన్రెడ్డి సమావేశం పెడితేగాని కరువు మండలాలు ప్రకటించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎల్‌నినో కాదని ‘ఎల్లో’నినో వైఫల్యంతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకపోవడమే కారణమన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలుగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అధికార పార్టీ బెదిరింపులు, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు స్థాయి కల్పించే బాధ్యత పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తీసుకుంటారన్నారు. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలు అధైర్యపడొద్దని, మీ వెనుక మేముంటామని అన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడే రోజులు పోయాయన్నారు. ● కండువా కప్పుకుంటే చాలా.. నిన్నటి వరకు దోపిడీదారులు, దొంగలు, దగాకోరులు అన్నవారే పార్టీ కండువా కప్పుకోగానే రుషులైపోయారా అని బొత్స ప్రశ్నించారు. అధికారం లేదని పార్టీని వీడడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశామన్నదే ముఖ్యమన్నారు. ఈ రెండున్నరేళ్లలో జిల్లాలో గాని, విజయనగరం నియోజకవర్గంలో గాని ఏమి అభివృద్ధి చేశారా చెప్పగలరా అని ప్రశ్నించారు. కోలగట్ల వీరభద్రస్వామి హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. విజయనగరం శివారు జమ్ము కోమటిచెరువును ప్రజల ఆరోగ్యార్థం వాకింగ్ ట్రాక్‌గా నాడు అభివృద్ధి చేస్తే నేడు అక్కడ చెత్తలతో నిండిపోయిందని అన్నారు. రోగులు వైద్య సేవల కోసం ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే.. వారిని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని చెప్పే సంఘటనలు ఎల్లో మీడియాలోనే రావడం ఈ ప్రభుత్వ పాలనకు నిదర్శనాలన్నారు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ● యువనాయకుడు బొత్స సందీప్ మాట్లాడుతూ 2.0లో కార్యకర్తలే క్రియాశీలకంగా ఉంటారని పార్టీ అధినేత జగనన్న చెప్పారన్నారు. చంద్రబాబు సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదని, దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ● విజయనగరం కార్పోరేషన్ మాజీ మేయర్ వి.విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా మహిళలకు ఇస్తామన్న హామీలను నెరవేర్చలేదన్నారు. ● పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారును ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం తప్ప, ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన లేదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు సర్కారు గుర్తుంచుకోవాలన్నారు. ఏఒక్క ఆడబిడ్డకు నెలకు ఇస్తామన్న రూ. 1500లు పథకం నేటికి అమలు చేయలేదన్నారు. ఉచిత బస్సు పథకం పెట్టి ఉన్న బస్సులు తగ్గించడంతో మహిళలు ప్రశాంతంగా బస్సులో ప్రయాణించే అవకాశం లేకపోతోందన్నారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీ ఏమైందో టీడీపీ నాయకులే చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ ఉద్యోగులు, పింఛన్‌దారుల విభాగం జిల్లా అధ్యక్షుడు డోల మన్మథకుమార్, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ పట్టణ, మండలాధ్యక్షులు ఆశపు వేణు, కెల్ల త్రినాథ్, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ కార్పోరేటర్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబుది అంతా అబద్ధాల పాలన. ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చారు. మహిళల రుణాలకు సున్నావడ్డీ పథకం తీసేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఉత్త గ్యాసేనని తేలిపోయింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పన కలగానే మిగిలిపోయింది. అక్కా చెల్లెళ్లకు ఆడబిడ్డ నిధికింద ఇస్తామన్న నెలకు రూ.15 వందలు ఇవ్వడంలేదు. వీటిని జనంలోకి తీసుకెళ్లాలి. చంద్రబాబు మోసపూరిత పాలన వివరించి స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలి. – బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముందున్నవన్నీ మంచిరోజులే.. ముందున్నవన్నీ వైఎస్సార్సీపీకి మంచిరోజులే. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలి. కార్యకర్తలందరూ సముచిత స్థానం లభిస్తుంది. కలిసికట్టుగా ముందుకు సాగుదాం. నేడు జిల్లా కేంద్రంలో నీటి కొరత లేదంటే కోలగట్ల వీరభద్రస్వామి ముందుచూపుతో చేసిన పనులే కారణం. పక్కనున్న విశాఖలో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. – పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికల్లో సంఘటితంగా పనిచేయాలి చంద్రబాబు సర్కారు అరాచకాలకు ఎదురొడ్డి పోరాడుదాం మీ వెనుక మేముంటాం టీడీపీ వెన్నపోటు పార్టీ దోపిడీదారులు, దగాకోరులు పార్టీలో చేరగానే రుషులైపోయారా? శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట వెన్నుపోటు పార్టీకి నాయకుడు చంద్రబాబు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన నేర్పరి.. ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో ఆశ్చర్యంలేదు. సూపర్ సిక్స్ అంటూ నమ్మించి జనాన్ని ముంచేశారు. నిత్యావసర ధరలు భగ్గుమంటున్నా పట్టించుకోవడంలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గంలో సువిశాలౖమైన రోడ్లు, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు ప్రత్యేక పార్కు, స్విమ్మింగ్ పూల్, ఇది మన విజయనగరం అని చెప్పుకునేలా ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో అందరికీ తెలిసిందే. – కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ డిప్యూటీ స్పీకర్ -
కొత్త కనెక్షన్ లేనట్టేనా?
రామభద్రపురం: గ్యాస్ కనెక్షన్ కొత్తది కావాలంటే చుక్కలు లెక్కపెట్టాల్సిందే. కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిందే. అప్పటికీ కొత్త కనెక్షన్ మంజూరు కాదు. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో నిలిపివేసిన కనెక్షన్ల మంజూరు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పరిస్థితులు చక్కబడినా గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. ఇది వేలాది మంది వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం చాలా మంది అర్హులకు ఉత్తుత్తిదిగానే మార్చేసింది. కనీసం కొత్త కనెక్షన్లు, అదనపు సిలిండర్లు ఇవ్వకపోవడం వినియోగదారుల్లో ఆవేదన నింపుతోంది. ప్రభుత్వం కొత్త కనెక్షన్ల మంజూరుకు ఇక మంగళం పాడినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ● ఇదీ పరిస్థితి... జిల్లాలో వివిధ గ్యాస్ ఏజెన్సీలు 36 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో దీపం కనెక్షన్లు 1,85,254, సీఎస్ఆర్ కనెక్షన్లు 43,287, ఉజ్వల కనెక్షన్లు 1,29,277, జనరల్ కనెక్షన్లు 3,46,455 కలిసి 7,04,273 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి గ్యాస్ సరఫరా అవుతుంది. ఇందులో 5,02,634 కనెక్షన్లకు ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున ఉచితంగా ఇస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, వేలాది మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందని ద్రాక్షగానే మారింది. మరోవైపు కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం, రెండో సిలిండర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ ఏజెన్సీలకు సైతం ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కొత్త కనెక్షన్ల కోసం వచ్చేవారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. రామభద్రపురంలో వ్యాన్‌తో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం కొత్తగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో కొత్త కనెక్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యాపారాలకు అవసరమైన వారికి కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తున్నాం. అత్యవసరమైన వారికి రాయితీ లేకుండా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నాం. – మురళీనాథ్, డీఎస్ఓ, విజయనగరం మంజూరు కాని గ్యాస్ కనెక్షన్లు కొత్త కనెక్షన్ల కోసం వేలాది మంది ఎదురుచూపు పట్టించుకోని ప్రభుత్వం ఉచితగ్యాస్ను ఉత్తుత్తిగా మార్చేసిన వైనం -
హత్య కేసులో నిందితురాలి అరెస్ట్
● మెజిస్ట్రేట్ ఎదుట హాజరు చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కందిపేట గ్రామంలో తాను కలిసి ఉంటున్న ధనాల శ్రీనును హత్య చేసిన కేసుకు సంబంధించి నిందితురాలు రాములమ్మను పోలీసులు అరెస్టు చేశారు. కందిపేట గ్రామంలో కలిసి జీవనం సాగిస్తున్న ధనాల శ్రీనుపై ఈనెల 16న రాములమ్మ దాడి చేసి సిమెంట్ దిమ్మెతో తలపై కొటి హత్య చేసిన సంఘటన విదితమే. మృతుడు శ్రీను తండ్రి చిన్న అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ జి.శంకరరావు కేసు దర్యాప్తు చేసి నిందితురాలు రాములమ్మను శనివారం అరెస్టు చేసి చీపురుపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు. సుందరాకాండ లోకకల్యాణానికి శుభప్రదంరేగిడి: సుందరాకాండ చదివినా విన్నా లోకకల్యాణానికి ఎంతో మంచిదని గుంటూరు జిల్లా నంబూరు శ్రీకాళీ వనాశ్రమ పీఠాధిపతి శ్రీనివాస రామానుజదాస్ అన్నారు. ఈ మేరకు రేగిడి దత్తపీఠంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సుందరకాండ ప్రవచనాలను శనివారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరామానుజదాస్ మాట్లాడుతూ హనుమాన్‌చాలీసా, సుందరాకాండ వంటి ప్రవచనాలను ప్రతిరోజూ రామమందిరాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రవచనం చేస్తే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. -
పైడితల్లికి పూజలు
విజయనగరం క్రైమ్: మూలా నక్షత్రం సందర్భంగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయాల్లో శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అటు మూడులాంతర్లు దగ్గరున్న చదురగుడిలోను రైల్వే స్టేషన్ దగ్గరున్న వనంగుడిలో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు పూజలు చేశారు. వనంగుడిలో మూలా నక్షత్రం సందర్భంగా చండీ హోమం జరిగింది. ఆలయ అర్చకులు కృష్ణస్వామి, తాతారావులు భక్తులతో చండీహోమం నిర్వహించారు. కుక్కకాటుతో ముగ్గురికి గాయాలుభామిని: మండలంలో కుక్కల స్వైర విహారం పెరుగుతూ దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం భామిని మండలం బిల్లుమడ కాలనీలో ముగ్గురిని కుక్క కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. కుప్పిలి యశోద. పిలకా సీతమ్మ, విద్యార్థి అర్లి జగన్‌లు గాయపడడంతో తీవ్ర గాయాల పాలైన కుప్పిలి యశోదను భామిని పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవల అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.మిగతా ఇద్దరు భామిని సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్నారు. పశువులు తరలిస్తున్న రెండు బొలెరోలు సీజ్● ఎనిమిది పశువులు స్వాధీనం కురుపాం: మండలంలోని నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న చర్చి ఎదురుగా పశువులు అక్రమంగా తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలు సీజ్ చేసినట్లు నీలకంఠాపురం ఎస్సై పి.రమేష్‌నాయుడు తెలిపారు. శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బొలెరో వాహనాల్లో 8 పశువులను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారి వద్ద ఎటువంటి అనుమతులు లేనందున వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసంగుమ్మలక్ష్మీపురం: మండలంలోని జాబుగూడ గ్రామ శివారులో సారా తయారీ కోసం డ్రమ్ముల్లో పులియబెట్టిన సుమారు 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎల్విన్‌పేట ఎస్సై బి.శివప్రసాద్ శనివారం తెలిపారు. జాబుగూడ పరిసరాల్లో సారా తయారు చేస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా బెల్లపు ఊటను గుర్తించి ఆ ప్రదేశం వద్ద సారా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే 20 లీటర్ల సారాను గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. యువకుడిపై పొక్సో కేసు నమోదుసంతకవిటి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు ఎస్పై ఆర్.గోపాలరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధిత బాలిక వంగర మండలంలోని మడ్డువలస గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఇటీవల రాఖీ పండగకు ఇంటికి వచ్చిన బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతం చేసినట్లు అమ్మాయి తల్లి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వ్యాన్ ఢీకొని ఇద్దరికి గాయాలు
గండేపల్లి: ఎద్దులను తరలిస్తున్న ఓ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు విజయనగరం జిల్లా అలమండ సంత నుంచి ఏలూరుకు 8 ఎద్దులను తరలిస్తున్న మినీ బొలెరో వ్యాన్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని జెడ్ రాగంపేట సీహెచ్‌సీకి వెళ్లే మార్గంలోకి వచ్చే సరికి మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న తాళ్లూరుకు చెందిన సాయి తీవ్రంగా గాయపడగా, మర్రిపాక నుంచి మిరప కోతకు యల్లమిల్లి వెళ్తున్న లక్ష్మి గాయపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలించగా తీవ్రంగా గాయపడిన సాయిని జగ్గంపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఎద్దులను తరలిస్తున్న వ్యాన్‌ను గండేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వ్యాన్‌లో తరలిస్తున్న ఎద్దులకు ఎటువంటి ఆహార పానీయాలు లేకపోగా కనీసం కాలు కదపలేని స్థితిలో కిక్కిరిసిన ప్రయాణంతో వేదన పడుతున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనంలో కిక్కిరిసి ఎద్దుల తరలింపు -
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం క్రైమ్: శ్రీపైడితల్లి వనంగుడి అమ్మవారి దేవాయలంలో భక్తులు హుండీలో వేసిన కానుకల లెక్కింపు శనివారం జరి గింది. రామతీర్థం శ్రీ సీతారా మ దేవస్థానం సహాయ కమిషనర్,ఈఓ వై.శ్రీని వాసరావు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది.మొత్తం రూ.ఏడు లక్షల,68 వేల 379 భక్తులు కానుకలుగా హుండీలో సమర్పించారని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.ఈ లెక్కింపు ధర్మకర్త మండలి సభ్యులు కామేశ్వరరావు,లలిత కుమారి, ఆనందరావులు దేవస్థానం సిబ్బంది సమక్షంలో జరిగిందన్నారు. సమకూరిన ఆదాయం రూ.7 లక్షలు -
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
వీరఘట్టం: అప్పటివరకు ఇంట్లో అందరితో కబుర్లు చెప్పిన యువకుడు మిత్రులతో కలిసి వీధిలోకి వెళ్లాడు. అంతలో కరెంట్ తీగ రూపంలో ఆ యువకుడిని మృత్యువు కబంళించింది. వీరఘట్టం మండలంలోని చిదిమి గ్రామంలో శనివారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుర్రు సాయి(24), చంద్రయ్య, ముచ్చు కామేష్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా వీధి గుండా వెళ్తున్న 11కెవీ విద్యుత్ లైన్లో ఒక వైరు తెగిపడింది. ఆ ముగ్గురిలో చంద్రయ్య,కామేష్‌లు షాక్ తగిలి దూరంగా పడిపోయారు. అయితే సాయి మాత్రం అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంటి నుంచి వెళ్లిన కొడుకు అంతలోనే చనిపోయాడని తెలియడంతో తల్లిదండ్రులు గంగులు, గంగమ్మలు భోరున విలపించారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కుమారుడిని ఆ దేవుడు పగబట్టి చంపేశాడంటూ రోదించారు. గొర్రెలు కాస్తూ ఇంటిని పోషిస్తున్న సాయి మృతి చెందడంతో ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా పోయిందని ఎంపీపీ దమలపాటి వెంకటరమణ అన్నారు.ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం ఏఈ సోమేశ్వరరావు, ఎస్ఈ షణ్ముఖరావులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. చికిత్స పొందుతూ మహిళ.. నెల్లిమర్ల: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన బందపు లక్ష్మి(51) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 14న వినాయకచవితిరోజున వినాయక పూజ చేసి సాయంత్రం వినాయకప్రతిమను స్థానిక చంపావతి నదిలో నిమజ్జనం చేసి తిరిగి కొత్తపేట వస్తుండగా నెల్లిమర్ల నుంచి అలుగోలు వెళ్తున్న పొందూరు హరిబాబు స్థానిక సువ్వాని పేట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని వెంటనే విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి శనివారం మృతిచెందింది. ఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
ప్రైవేట్ వృత్తి విద్య జూనియర్ కళాశాలల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ద్వారపూడిలోని సెయింట్ థామస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.ప్రకాశరావు (ఎస్ఎస్పీ, విజయనగరం), ఉపాధ్యక్షుడిగా పి.శ్రీను (సాయిరాం–బొబ్బిలి), కార్యదర్శిగా జె.కృష్ణ (ఎస్వీఎన్, ఎస్.కోట), సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాసరావు (న్యూటన్, పెద్దమానాపురం), కోశాధికారిగా ఎం.గోవింద్ (శ్రీసూర్య, భీమసింగి) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జగన్నాథం (గోస్తనీ, జామి), ఎ.రమేష్ (ఏవీఎన్, ఎస్.కోట), బి.తిరుపతి (గణేష్, బొబ్బిలి)లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు వి.జగదీశ్వరరావు (వెంకటేశ్వర, సాలూరు) ప్రొసీడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. సంఘం చీఫ్ ప్యాట్రన్లుగా వి.జగదీశ్వరరావు, పి.జాన్ (సెయింట్ థామస్, ద్వారపూడి)లను నియమించారు. అనంతరం నూతన కమిటీ బాధ్యతలు తీసుకుని ప్రమాణ స్వీకారం చేపట్టారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎం.స్వాత్విక్ (వేదశ్రీ, పార్వతీపురం), డి.చిన్నంనాయుడు (శారద, గుమ్మలక్ష్మీపురం)తోపాటు పలువురు కళాశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహనతోనే హక్కుల పరిరక్షణ
బొబ్బిలిరూరల్: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా వారి హక్కుల పరిరక్షణ జరుగుతుందని జిల్లా జడ్జి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు శనివారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణ అవసరమన్నారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహ కల్పించాలన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను పాందడం పౌరుల ప్రాథమిక హక్కని అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలు, వారి హక్కుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జిలు కృష్ణ ప్రసాద్, రాధాకృష్ణ మూర్తి, స్థానిక న్యాయ మూర్తులతో పాటు బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బి.రవి, ఎంపీడీఓ రవికుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా జడ్జి ఎం బబిత -
వైఎస్సార్సీపీలో 25 కుటుంబాల చేరిక
లక్కవరపుకోట (శృంగవరపుకోట): శృంగవరపుకోట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మండ త్రినాథ్, మండ సుగుణ, నాగులపల్లి జగన్నాథం తదితర 25 కుటుంబాల వారు శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుల సమక్షంలో వైఎస్సార్సీపీలో శనివారం చేరారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ, కడుబండి శ్రీనివాసరావులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు.వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని చూచించారు. పార్టీ ఎప్పడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సీహెచ్. రమణ, పార్టీ నాయుకుడు కిలారి రవి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పార్టీ సీనియర్ నాయకుడు రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక పింఛన్ల కోసం 51,644 దరఖాస్తులు
బొండపల్లి: జిల్లావ్యాప్తంగా 51,644 మంది సామాజిక పింఛన్ల కోసం సచివాలయాల్లో అన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ పాణి తెలిపారు. ఈ మేరకు బొండపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం సందర్శించిన అయన విలేకరులతో సామాజిక భద్రత పింఛన్లపై మాట్లాడుతూ సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తుల న్నింటిని ఈనెల 21 వ తేదీలోగా పరిశీలించి అర్హత గల వారిని ఎంపిక చేసి పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రకియ అంతా ఈ నెలలోనే పూర్తి చేసి అక్టోబరు 1న కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సచివాలయం వెల్పేర్ సహయకులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖలకు చెందిన అయా అధికారులు పరిశీలించి అర్హత ఉన్న వారిని గుర్తించి ఎంపీడీఓ లాగిన్లోకి వివరాలు పంపించనున్నట్లు చెప్పారు. అన్ని అర్హతలు ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేసే పక్రియను డీఆర్డీఏ ద్వారా చేపడుతూ అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరసాడ రఘుపతిరావు, డిప్యూటీ ఎంపీడీఓ జి.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి -
పాముకాటుతో రైతు..
భామిని: పత్తి పంటలో పురుగు మందు కొట్టడానికి శనివారం వెళ్లిన రైతు పాముకాటుకు గురై పొలంలోనే మృతి చెందడంతో నేరడి–బి గ్రామంలో విషాదం అలుముకుంది. భామిని మండలం నేరడి–బికి చెందిన రైతు సరిసాభద్ర మిన్నారావు(60) పత్తి పొలంలో పొడ పాము కాటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సమీప రైతులు పరుగున వెళ్లి గాయ పడిన రైతు మిన్నారావు(60)ను భామిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య పగడాలు, కొడుకు ఖగేశ్వరరావు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.రైతు మృతితో నేరడి, గురండి, బిల్లుమడ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి విషాదానికి గురై సంతాపం తెలిపారు. -
పిడుగు పడి కుప్పకూలిన మహిళలు
● పొలం పనికి వెళ్లివస్తుండగా పిడుగుల వాన ● మడిగట్లపైనే ప్రాణం విడిచిన మహిళా రైతు కూలీలు ● జి.వెంకటాపురంలో విషాదంపాలకొండ రూరల్: పుట్టినప్పటి నుంచి వ్యవసాయ పనులు తప్ప మరో పని తెలియని ఆ మహిళలు పొట్ట చేతబట్టుకుని కూలి పనికి వెళ్లి పిడుగుపడి కుప్పకూలి మృతిచెందారు. వ్యవసాయమే ఆధారంగా జీవనం గడుపుతున్న ఆ ఇద్దరి కుటుంబాలపై విధి చిన్నచూపు చూసింది. వ్యవసాయ పనులకు వెళ్లివస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే..పాలకొండ మండలం డోలమడ పంచాయతీ జి.వెంకటాపురం గ్రామానికి చెందిన గొర్ల లక్ష్మి (65), వారాడ రామలక్ష్మి (50) వ్యవసాయ కూలీలు. కుటుంబ పోషణలో భాగంగా వారు గ్రామ సమీపంలోగల వరిపొలాల్లో కలుపు మొక్కలు తీసేందుకు శనివారం వెళ్లారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావతంతో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిరుజల్లులు కురవడంతో సహచర కూలీలు వర్షం పడుతుందని భావించి ముందుగా ఇళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో గొర్ల లక్ష్మి, వారాడ రామలక్ష్మి వారు పనిచేస్తున్న పొలాల నుంచి బయటకు వచ్చి గట్లపై నడుస్తుండగా భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో వారిద్దరు ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. ఈ విషయం గమనించిన సహచర కూలీలు భయాందోళకు గురై ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. అప్పటికే గ్రామంలో కొలువుదీర్చిన గణనాఽథుని నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతున్న ప్రజలంతా ఒక్కసారిగా ఘటనా స్థలానికి పరుగులు తీశారు. అప్పటికే ఆ మహిళలు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా.. వ్యవసాయ నేపథ్యం కలిగిన గొర్ల లక్ష్మిది మధ్యతరగతి కుటుంబం కావడంతో జీవనోపాధిలో భాగంగా పొలాల్లో భర్త జోగినాయుడితో కలిసి వ్యవసాయం చేస్తూ నెట్టుకొస్తున్నారు. వారికి పిల్లలు లేకపోవడం, తోడునీడగా ఉన్న భార్య పిడుగుపాటుకు గురై మరణించడంతో జోగినాయుడు గుండెలవిసేలా రోదించాడు. అందరితో కలివిడిగా ఉంటూ గ్రామస్తులకు తలలో నాలులా ఉన్న లక్ష్మి మరణంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులకు ఒంటరి అయిన జోగినాయుడిని ఓదార్చడం వారితరం కాలేదు. నన్ను వదిలి వెళ్లిపోయావా.. పిడుగు పడి తన భార్య మరణించడంతో వారాడ రామలక్ష్మి భర్త అప్పలనాయుడు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. కలుపు తీసేందుకు వెళ్లిన భార్యపై విధి చిన్నచూపు చూపిందని తనకు దిక్కెవరని రోందించిన తీరు అందరినీ కలిచివేసింది. తన ఇద్దరు పిల్లలు జీవనోపాధికి వలస వెళ్లగా నువ్వుకూడా నన్ను వదివెళ్లావా అంటూ భార్య మృతదేహంపై పడి రోదించాడు. ఈ విషయం తెలుసుకున్న పాలకొండ డిప్యూటీ తహసీల్థార్ సీహెచ్ రమేష్, ఆర్ఐ మహేష్ మృతుల గ్రామానికి చేరుకుని వారి కుటుంబాలను ఓదార్చారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తమ ప్రగాఢ సంతాపాన్ని మీడియా ముఖంగా తెలిపారు. -
కార్యకర్తలే పార్టీకి సమన్వయకర్తలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): వైఎస్సార్సీపీకి కార్యకర్తలే సమన్వయకర్తలని, కలిసికట్టుగా ముందుకు సాగి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజేతలుగా నిలుపుదామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీ పట్ల అంకితభావంతో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో పార్టీ సంధానకర్తగా బాధ్యతలు అప్పగించిన వ్యక్తి ఆర్థిక లావాదేవీలు, భూ వ్యాపారాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. అలాంటి వారు పార్టీని వీడినా ఎలాంటి నష్టంలేదన్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల ఆదరాభిమానాలతో విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. పార్టీలో ఎవరో ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అనూష, సందీప్‌తో పాటుగా నాయకులంతా అండగా ఉంటారన్నారు. గతంలో ఒక్కరే సమన్వయకర్తగా వ్యవహరించేవారని, ఇకపై పార్టీలో ఉన్న ప్రతీ ఒక్కరూ సమన్వయకర్తలేనని స్పష్టంచేశారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో పర్యటించి ప్రజలను, కార్యకర్తలను కలుస్తానని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని 11వేల మంది క్రియాశీలక కార్యకర్తలకు ఐడీ కార్డులు అందించారని, రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీరందరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమాలు, దౌర్జాన్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం అక్రమాలకు సహకరిస్తున్న కొందరు అధికారులు గుర్తించుకోవాలన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చట్టం తనపని తాను చేస్తుందన్నారు. ● మాజీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పింఛన్ కూడా మంజూరుచేయలేదని ఆరోపించారు. రైతులను ఆదుకునే పరిస్థితి లేదన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్నా కనీసం స్పందించడం లేదన్నారు. ● ఎమ్మెల్సీ సురేష్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేరని, వ్యవసాయ రంగం నుంచి అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బలంగా నిలబడాలన్నారు. ● యువ నాయకురాలు బొత్స అనూష మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జాన్యాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలన్నారు. యువ నాయకుడు బొత్స సందీప్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అండగా ఉందామన్నారు. కష్టాల్లో ఎప్పుడూ మేం ఉంటాం... సమస్యలు ఏమున్నా ధైర్యంగా చెప్పొచ్చు.. అందరం కలిసి ఐక్యతగా ముందుకు సాగదామన్నారు. ● పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసం అని, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో బొత్స నాయకత్వాని గెలిపించాలన్నారు. ● నియోజకవర్గ పరిశీలకురాలు శోభా స్వాతిరాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ క్యాడర్ అంతా రెట్టింపు ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా స్థానిక ఎన్నికల్లో ఐక్యతతో పార్టీ అభ్యర్థులను గెలిపిద్దాం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీలక్ష్మీతో పాటు ఎంపీపీలు మీసాల విజయలక్ష్మి, ఇప్పిలి వెంకటనరసమ్మ, పొట్నూరు ప్రమీల, జెడ్పీటీసీలు వాకాడ శ్రీనివాసరావు, సీర అప్పలనాయుడు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు, మీసాల వరహాలనాయుడు, తాడ్డి వేణు, పొట్నూరు సన్యాసినాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, నాలుగు మండలాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం
● ఎస్పీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందితో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి వినతులను సావధానంగా ఆలకించిన ఆయన, వాటి పూర్వాపరాలు పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో నిమగ్నమయ్యే సిబ్బంది ఆరోగ్య, శాఖాపరమైన ఇబ్బందులను తీర్చేందుకు వేగంగా చర్యలు చేపడతామన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలలో ప్రధానంగా అనారోగ్య సమస్యలు, బదిలీలు కోరుతూ వచ్చినవే ఎక్కువగా ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే సిబ్బందికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ముగ్గురిపై కేసు నమోదువంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ శంకర్ శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన కోడూరు సూర్యనారాయణ కళ్లం నుంచి ఇంటికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన రెడ్డి రథాలు, రెడ్డి సాంబమూర్తి, కొత్తపల్లి స్వామినాయుడులు కొట్టడంతో సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
● డీఎల్ఎస్ఏ కార్యదర్శి డాక్టర్ కృష్ణప్రసాద్విజయనగరం లీగల్: విద్యా సంస్థల్లో విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించడంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు అత్యంత కీలకపాత్ర పోషించాలని, బాలల హక్కులను పరిరక్షించడం సమాజంలో ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర ఏఐఏటీ జూనియర్ కళాశాలలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘బాలల రక్షణ అంశాల’పై అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాలలపై జరిగే హింస, లైంగిక వేధింపులు, దాడులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ’పోక్సో చట్టం’తో పాటు బాలల రక్షణకు సంబంధించిన వివిధ చట్టాలపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులలో ఆకస్మికంగా కనిపించే ప్రవర్తనా మార్పులు, భయం, మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలను అధ్యాపకులు సున్నితంగా పరిశీలించాలని కోరారు. ఏవైనా సంక్షోభ పరిస్థితులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, బాధిత బాలలకు అవసరమైన న్యాయసాయం, రక్షణ అందేలా సహకరించాలని పిలుపునిచ్చారు. బాలల హక్కుల రక్షణలో పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. చట్టపరమైన లేదా ఉచిత న్యాయ సహాయం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ప్యానెల్ అడ్వకేట్ పైలా సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ తవిటినాయుడు, డిప్యూటీ డీఈవో రమణమ్మ, కాలేజ్ ప్రిన్సిపాల్ గుప్తా, వివిధ కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాల్గొన్నారు. -
ఆక్రమణలు తొలగిస్తాం
● వేణుగోపాలస్వామి దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు కొత్తవలస: తుమ్మికాపల్లి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం భూముల పరిరక్షణలో భాగంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, కొద్దిరోజుల్లో ఆక్రమణలను తొలగిస్తామని ఈఓ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సంబంధిత భూములను తమ సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. తుమ్మికాపల్లి గ్రామ సర్వే నంబర్ 6–2లో 14 ఎకరాల96 సెంట్లు, 6–1లో 0.21సెంట్లు, 6–4లో 0.15 సెంట్లు భూమికి సంబంధించి 80వ దశకం నుంచి ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు, హైకోర్టు, నేడు సుప్రీంకోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయన్నారు. ఆలయ భూముల్లో రెండు సామిల్లులతో పాటు పలు శాశ్వత కట్టడాలు ఉన్నాయని, వీరందరికీ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తామన్నారు. దేవస్థానానికి చెందిన సుమారు 3 ఎకరాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించారని, ఈ విషయాన్ని దేవదాయకశాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్ సిబ్బంది అచ్చిబాబు ఉన్నారు. గురజాడ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం ● డీఆర్వో సత్తిబాబు విజయనగరం క్రైమ్: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతిని ఈ నెల 21న ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సీహెచ్ సత్తిబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు ఉదయం 8:45 గంటలకు గురజాడ స్వగృహం వద్ద మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. అనంతరం స్వగృహం నుంచి సత్య లాడ్జి సమీపంలోని కాంస్య విగ్రహం వరకు శోభాయాత్రగా ఊరేగింపు సాగుతుందని, విగ్రహానికి పూలమాలలు వేసి ‘దేశమంటే మట్టి కాదోయ్’ను సామూహికంగా ఆలపిస్తామన్నారు. జయంతి వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ ప్రసాదరావు, ఎస్ఐ దుర్గాప్రసాద్, తహసీల్దార్ ఎస్.శ్రీనివాసరావు, మున్సిపల్ ఇంజినీర్ ప్రసాద్, విద్యాశాఖ ఏడీ జ్యోతి, డీపీఆర్వో గోవిందరాజులు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, సెట్విజ్ సీఈఓ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
బుకింగ్ మోసాలపై అప్రమత్తం అవసరం
పట్టణంలో జరుగుతున్న మోసాలపై చిరు, వ్యాపారులు, టెంట్‌హౌస్ నిర్వాహకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల అన్నదానం పేరుతో నకిలీ ఆర్డర్లు ఇచ్చి వ్యాపారులను ముంచేస్తున్న ఘరానా మోసగాళ్ల పట్ల వ్యాపారులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ప్రతి వ్యాపారి తమ షాపు వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల అనుమానాస్పద వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయి. ఆర్డర్ ఇచ్చే గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. అక్కడికక్కడే కాల్ రింగ్ చేసి కన్ఫామ్ చేసుకోవాలి. ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 100/112కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలి. – టి.శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ, విజయనగరం -
పింఛన్ల కోసం దరఖాస్తుల వెల్లువ
● జిల్లాలో 49,572 మంది దరఖాస్తు ● ఎంపీడీఓ వద్ద అధికంగా పెండింగ్‌లో దరఖాస్తులు ● తిరస్కరించినవి–140 విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవరకు కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదు. కొత్తగా దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈ నెల 7వ తేదీ నుంచి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, గీతకార్మిక, మత్స్యకార, దివ్యాంగ, చర్మ, డప్పు కళాకారులు మొత్తం 49,572 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో నమోదుకాని దరఖాస్తులు ఎంపీడీఓల వద్ద వేలాదిగా ఉన్నాయి. వేల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (డబ్ల్యూఈఏ)ల వద్ద 33,199, ఎంపీడీఓల వద్ద 13,360, అసిస్టెంట్ సోషల్ వేల్పేర్ అధికారి ( ఏఎస్డబ్ల్యూఓ)ల వద్ద 353, మత్య్సశాఖ అధికారి వద్ద 52 , చేనేత, జౌళిశాఖ డీడీ వద్ద 23, తహసీల్దార్ల వద్ద 56, జిల్లా అధికారుల వద్ద 392 పెండింగ్‌లో ఉన్నాయి. 140 దరఖాస్తులు తిరస్కరించారు. 1597 దరఖాస్తులను మాత్రమే ఎంపీడీఓలు ఆమోదించారు. -
ఇండెంట్ 4,426 క్వింటాళ్లు... వచ్చినవి 11 క్వింటాళ్లు..!
ఇండెంట్ పెట్టాం.. జిల్లాలో 19,690 హెక్టార్లలో వరి పంట సాగుకాలేదు. ఈ భూముల్లో పెసర, మినుము వంటి పంటలు ప్రత్యామ్నాయంగా సాగు చేసేందుకు 4,426 క్వింటాళ్లు అవసరమని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. జిల్లాలోని నాలుగు మండలాలకు సంబంధించి ప్రస్తుతం 11 క్వింటాళ్లు పెసర, మినుము విత్తనాలు మాత్రమే వచ్చాయి. మిగిలిన మండలాలకు త్వరలో వస్తాయి. – ఎం.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారివిజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ వరి సాగు కాలం గడిచిపోయింది. పుబ్బ కార్తె పోయి ఉత్తర కార్తె వచ్చింది. ఖరీఫ్ సాగుకాలం సగం గడిచిపోయింది. వాతావరణం అనుకూలించక వేలాది రూపాయల పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. రైతులకు గడ్డుపరిస్థితి. జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. ఓ వైపు పంటలు సాగుకాక, ప్రత్యామ్నాయ పంటల సాగుకు చేతిలో డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. విపత్తుల సమయంలో ఆపన్నహస్తం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం అసలత్వం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. వేలాది ఎకరాల్లో భూములు సాగుకు నోచుకోక బీడుభూములుగా దర్శినమిస్తున్నా... పంటలు సాగైన ప్రాంతాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకునేవారు లేకపోవడం కన్నీరుపెట్టిస్తోంది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో పంటల బీమా ప్రీమియం చెల్లించనివారికి బీమా అందే పరిస్థితి లేదు. కరువు పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రైతులను పట్టించుకోనివారిని అందలం ఎక్కించి తప్పుచేశామని మదనపడుతున్నారు. రైతులకు విత్తనాలు అందిస్తామని చంద్రబాబు సర్కార్ గత నెలరోజులుగా చెప్పుకొస్తుంది. ఖరీఫ్ సీజన్ మరో 10 రోజుల్లో పూర్తి కావస్తోంది. కాని ఇంతవరకు ప్రత్యామ్నాయ విత్తనాలకు రైతులకు అందించిన దాఖలాలు లేవు. ఖరీఫ్ సీజన్లో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,251హెక్టార్లుకాగా, ఇప్పటివరకు 80,561హెక్టార్లలో సాగైంది. 19,690 హెక్టార్లలో వరి పంట సాగుకు నోచుకోలేదు. సాగుచేసిన చోట కూడా ఎండిపోతోంది. మొక్కజొన్న పంట సాధారణ విస్తీర్ణం 11,318 హెక్టార్లకు 8,799 హెక్టార్లు. చోడి పంట 43కు 28, వేరుశనగ 284కు 89, నువ్వులు 5,252కు 2,557, పత్తి 2,204కు 2,295, గోగు 254కు 121, చెరకు 3,813 హెక్టార్లకు 1721హెక్టార్లలో సాగైంది. వరి పంట సాగుకాని భూముల్లో సాగుచేసేందుకు ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుము, శనగ, నువ్వులు విత్తనాలు 4,426 క్వింటాళ్లు కావాలని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి పంపిస్తే వచ్చింది కేవలం 11 క్వింటాళ్లే. అదికూడ నాలుగు మండలాలకే పంపించారు. జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. విజయనగరం, డెంకాడ, రామభద్రపురం, బొబ్బిలి మండలాలకు పెసర, మినుము విత్తనాలు 11 క్వింటాళ్లు సరఫరా అయ్యాయి. విత్తనాలు కూడా ఉచితంగా కాకుండా 80 శాతం రాయితీపై ఇస్తామని ప్రకటించడంపై రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పంటలు పోయి ఏడుస్తుంటే... విత్తనాలు కూడా కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ‘ప్రత్యామ్నాయ’ సాయం ఏదీ? రైతులపై చంద్రబాబు సర్కారు చిన్నచూపు ఇప్పటికే జిల్లాలో కరువుఛాయలు విత్తనాలు కూడా పూర్తిస్థాయిలో సరఫరా చేయని వైనం అవి కూడా ఉచితం కాదు.. రాయితీపై కొనుగోలు చేయాలి ఆవేదనలో జిల్లా రైతాంగం -
సంతోష్‌ది హత్యే
బొబ్బిలి: ఈనెల 9 న అర్ధరాత్రి మండలంలోని పారాది వంతెన వద్ద అదే గ్రామానికి చెందిన ఉత్తరావిల్లి సంతోష్ కుమార్(30)ను అతని స్నేహితుడే హత్య చేసినట్లు డీఎస్పీ ఆర్ గోవిందరావు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 9న సంతోష్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, బంధువులు తమకు సమాచారం ఇచ్చారని, ఈ సంఘటనను అప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేసినట్లు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో చేపట్టిన దర్యాప్తులో సంతోష్‌ను అతని స్నేహితుడు అల్లాడ పైడిరాజు హత్య చేసినట్లు తెలిపారు. నిత్యం వారిద్దరూ వంతెన సమీపంలో మద్యం తాగుతుంటారని ఈ క్రమంలో ఈనెల 9న మద్యం తాగుతూ వివాహేతర సంబంధాల నేపథ్యంలో వారి మధ్య ఘర్షణ జరిగిందన్నారు. తనను అవమానపర్చాడన్న కోపంతో ఉన్న పైడిరాజు అప్పటికే మద్యం మత్తులో పడి ఉన్న సంతోష్‌ను అక్కడున్న కర్రతో తలపై గట్టిగా కొట్టి వెళ్లిపోయాడన్నారు. దీంతో సంతోష్ మృతి చెందాడన్నారు. పైడిరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. దర్యాప్తులో సీఐ కె.నారాయణ రావు, ఎస్సై డి.కొండల రావు, సిబ్బంది చూపిన చొరవను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. డీఎస్పీ గోవిందరావు వెల్లడి -
ఐటీడీఏ వద్ద గిరిజనుల ధర్నా
● ఆర్డీవో, తహసీల్దార్‌పై చర్యలకు డిమాండ్పార్వతీపురం రూరల్: ముందస్తు నోటీసులు లేకుండా సాగులో ఉన్న భూములను ఆక్రమించి, జీడిమామిడి తోటలను ధ్వంసం చేసిన బొబ్బిలి ఆర్డీవో, రామభద్రపురం తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజనులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.రామస్వామి మాట్లాడుతూ..ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని పుల్లేరు గుడ్డువలస, వంగర గుడ్డువలస, జాకరమ్మ కొత్తవలస గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ పరిధిలో సుమారు 100 ఎకరాల్లో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాయన్నారు. 2009లో 17 కుటుంబాలకు అటవీ పట్టాలు కూడా ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ నెల 9న రెవెన్యూ, పోలీసు అధికారులు యంత్రాలతో వచ్చి పంటలను ధ్వంసం చేసి, అడ్డుకున్న రైతులను అరెస్టు చేశారని ఆరోపించారు. 2017లో ఏపీఐఐసీకి ఇచ్చిన ఈ భూమిని ప్రస్తుతం ‘రాధిక ఆయిల్స్ అండ్ మినరల్స్’కు విక్రయించామని చెబుతూ, దౌర్జన్యంగా పంటలను నాశనం చేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అది రెవెన్యూ భూమి అయితే 2009లో అటవీ పట్టాలు ఎలా ఇచ్చారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు ప్రశ్నించారు. సాగుదారులకు భూసేకరణ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి, జిరాయితీతో సమానంగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు ఆక్షేపించారు. గిరిజనులకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు జాంబ్రి, రంజు, వెంకట్, మోహన్, కస్తూరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్లు ఓకే.. బోధకులు ఉన్నారా..?
● పోర్టల్‌లో ఉన్నా..కళాశాలకు వెళ్తున్నారా? ● ప్రైవేట్ ఐటీఐలపై అనుమానాలు ● ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, పరికరాల పరిస్థితిపై.. ● విద్యార్థి సంఘాల ఆందోళన విజయనగరం అర్బన్: బోధకుడు ఉంటేనే అడ్మిషన్.. పరికరాలుంటేనే ప్రాక్టికల్ శిక్షణ. అంటూ కేంద్రప్రభుత్వం కొత్త నిబంధనలు ఈ ఏడాది తీసుకొచ్చినా..జిల్లాలోని ప్రైవేట్ ఐటీఐల్లో పరిస్థితి ఎంతవరకు మారిందన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల ప్రక్రియ తాజాగా ముగిసింది. తరగతులు ప్రారంభమయ్యాయి. అడ్మిషన్లకు ముందు ఇన్‌స్ట్రక్టర్ల వివరాలు, వారి అర్హత ధ్రువీకరణ పత్రాలను పోర్టల్‌లో అప్లోడ్ చేయించి పరిశీలించినప్పటికీ..క్షేత్రస్థాయిలో అదే స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 26 ప్రైవేట్ ఐటీఐల్లో సుమారు 4,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ వంటి ప్రధాన ట్రేడుల్లోనే వేలాది సీట్లు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరిన నేపథ్యంలో వారికి అవసరమైన ఇన్స్ట్రక్టర్లు, ల్యాబ్‌లు, యంత్ర పరికరాలు, వర్క్‌షాప్‌లు అందుబాటులో ఉన్నాయా? అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. సీట్ల సంఖ్యను బట్టి చూస్తే శిక్షణ వసతులు కూడా అదే స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్ వంటి ట్రేడుల్లో పుస్తకాలతో మాత్రమే శిక్షణ పూర్తయ్యే పరిస్థితి ఉండదు. యంత్రాలు, పరికరాలను వినియోగిస్తూ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రతి సంస్థలో అనుమతించిన సీట్లకు అనుగుణంగా పరికరాలు, ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు ఉన్నాయా? అన్నది కీలకంగా మారింది. అడ్మిషన్ తర్వాత అసలు పరీక్ష అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇప్పుడు అసలు పరీక్ష ప్రారంభమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు చేరారు. ఇక వారికి నాణ్యమైన శిక్షణ అందుతోందా? అన్నది అధికారులు పరిశీలించాల్సిన అంశంగా మారింది. ఇన్స్ట్రక్టర్లు పాఠ్యాంశాల ప్రణాళికను పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉండగా.. భవిష్యత్తులో బోధన ప్రక్రియను సంబంధించిన వీడియోలను కూడా అప్లోడ్ చేసే విధానం తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే తరగతుల నిర్వహణపై కొంత మేర పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది. బోగస్‌కు బ్రేక్ పడిందా? ఇన్స్ట్రక్టర్లు, సౌకర్యాల విషయంలో కొన్ని ప్రైవేట్ ఐటీఐలపై విద్యార్థి సంఘాలు గతంలో ఫిర్యాదులు చేశాయి. ఇన్స్ట్రక్టర్లు లేకపోయినా ఉన్నట్లు చూపించడం, అవసరమైన పరికరాలు లేకుండానే ట్రేడులు నిర్వహించడం వంటి ఆరోపణ లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘాల ప్రతి నిధులు చెబుతున్నారు. కొత్త నిబంధనలతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ.. అడ్మిషన్లు పూర్తయిన తర్వాత కూడా తనిఖీలు కొనసాగించాల్సి అవసరం ఉందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.పర్యవేక్షణ బాధ్యతపై ఆదేశాలు రావాలి కేంద్రప్రభుత్వం కొత్త నిబంధనల మేరకు ఈ ఏడాది ప్రైవేటు ఐటీఐల ప్రవేశాలకు ముందు బోధన అందించబోతున్న ఇన్స్ట్రక్టర్ వివరాలను ఎస్ఐడీహెచ్ అనే ప్రత్యేక పోర్టర్లో నమోదు చేశాం. ఇన్స్ట్రక్టర్లు నమోదైన కోర్సులలో మాత్రమే ప్రవేశాలకు అనుమతి ఇచ్చాం. పోర్టల్‌లో నమోదైన ఇన్‌స్ట్రక్టర్ల హాజరు, విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్, ల్యాబ్ వినియోగం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యతకు సంబంధించిన ఆదేశాలు ఇంకా రావాల్సి ఉంది. టీ.వీ.గిరి, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్, విజయనగరం పోర్టల్‌లో ఉన్నా..కాలేజీకి వెళ్తున్నారా? కొత్త నిబంధనల ప్రకారం సంబంధిత ట్రేడుల్లో పనిచేసే ఇన్‌స్ట్రక్టర్ల వివరాలు, ధ్రువీకరణ పత్రాలు ఎస్ఐడీహెచ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. నోడల్ కళాశాల కన్వీనర్ వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాతే ప్రవేశాలకు అనుమతి లభించింది. అయితే పోర్టల్‌లో ఇన్స్ట్రక్టర్ పేరు ఉండడం..వాస్తవంగా ప్రతిరోజూ తరగతిలో బోధించడం రెండూ ఒకటేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్‌స్ట్రక్టర్ల హాజరు, విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్, ల్యాబ్ విని యోగం తదితర అంశాలపై కూడా పర్యవేక్షణ ఉండాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. -
26న జేఎన్టీయూ జీవీలో మెగా జాబ్ డ్రైవ్
విజయనగరం రూరల్: జేఎన్టీయూ–జీవీలో ఈ నెల 26న నిర్వహించనున్న మెగా జాబ్ డ్రైవ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జేఎన్టీయూ–జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు శుక్రవారం తెలిపారు. జేఎన్టీయూ–జీవీ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ డ్రైవ్ ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 2023 నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అనుబంధ కోర్ బ్రాంచిలకు చెందిన బీటెక్, డిప్లమో, ఐటీఐ అభ్యర్థులతో పాటు బి.ఫార్మశీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇతర గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లబిస్తాయన్నారు. ఈ జాబ్ డ్రైవ్‌కు విప్రో ఇన్ఫ్రాస్టక్చర్, మేథా సర్వో, టీవీఎస్ సుందరం, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, ఎంఆర్ఎఫ్ టైర్స్, టెక్ మహీంద్రా, సదర్లాండ్, కాన్సన్ట్రిక్స్, డిల్పి టీవీఎస్, కియా, రాయల్ ఎన్ఫీల్డ్, ఇసుజు, హూందై, సీఐఈ ఆటోమోటివ్, కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ సంస్థలు హాజరవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా జాబ్ డ్రైవ్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాబ్ డ్రైవ్‌కు హాజరయ్యే అభ్యర్థులు పాస్‌పోర్టు సైజు ఫొటో, రెజ్యూమె, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9985219897 (రవివర్మ), 9642193019 (ప్రవీణ్), 9866894969 (మహేష్)నంబర్లను సంప్రదించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ రిజిస్ట్రార్ కేసీబీ రావు, పరిశ్రమల, ప్లేస్మెంట్ డైరెక్టర్ కె.శ్రీకుమార్, టీపీవో డాక్టర్ పి.శ్రీదేవి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పూర్వవైభవానికి కృషి
● 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యం ● స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం: వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యత మేరకు విజయనగరం జిల్లాలో పార్టీ పూర్వ వైభవానికి అందరి సహకారంతో కృషి చేస్తానని నూతనంగా నియామకమైన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్పష్టంచేశారు. 2029 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయ డమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షునిగా రెండవ సారి ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని రింగ్‌రోడ్‌లో పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బెల్లాన మాట్లాడుతూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేల సహకారంతో రెండవ సారి పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులతో కలిసి పనిచేస్తానన్నారు. ● చంద్రబాబుది వెన్నుపోటు పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్నది వెన్నుపోటు పాలన అని బెల్లాన విమర్శించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు అధికారం కోసం ఆంఽధ్రప్రదేశ్ ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు మోసపూరిత హమీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయకుండా మాయమాటలతో మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20వేల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ ఇస్తామన్న చంద్రబాబు హమీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళలకు ముందుస్తుగా ప్రకటించిన విధంగా రుణమాపీ చేస్తే కూటమి ప్రభుత్వం మాఫీ మాట మరిచి సున్నా వడ్డీ రుణాలను నిలిపివేయడం సరికాదాన్నరు. 18 సంవత్సరాల నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.1500 ఇస్తామని నమ్మబలికి మోసగించారని, ఉచిత గ్యాస్ ఉత్తుత్తి గ్యాస్‌గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ● దగా డీఎస్సీలో చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లే ముద్దాయిలని బెల్లాన ఆరోపించారు. యువగళంలో పాల్గొన్న యువత నుంచి రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసి స్పోర్ట్స్‌కోటా పేరిట ప్రత్యేక జీఓలు తెచ్చి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. నిత్యావసరాలు ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ● నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు వెల్లువ బెల్లానకు ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, జిల్లా మహిళా నాయకురాలు బొత్స అనూష, రాష్ట్ర మహిళా విభాగం ప్రదాన కార్యదర్శిఽ కోలగట్ల శ్రావణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇప్పిలి అనంత్, గొర్లె రవికుమార్, ఎస్.బంగారునాయుడు, ఎస్.వేణుగోపాలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంజీవరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా పింఛనర్లు విభాగం అధ్యక్షుడు డోల మన్మథకుమార్, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, ఎస్.వి.రమణరాజు, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ శెట్టి వీరవెంకటరాజేష్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు. -
ఆటో ప్రమాదంలో పలువురికి గాయాలు
కురుపాం:/జియ్యమ్మ వలస రూరల్: జియ్యమ్మవలస మండలంలోని జోగిరాజుపేట సమీపంలో శుక్రవారం ఆటో, స్కూటీ ఢీ కొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. పార్వతీపురం నుంచి కురుపాం వస్తున్న ఆటో, కురుపాం నుంచి పార్వతీపురం వెళ్తున్న స్కూటీ ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టుకొని బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జియ్యమ్మవలస మండలం నిమ్మలపాడుగ్రామానికి చెందిన మండంగి పొట్ట య్య, కురుపాం మండలం పట్టాయిదొరవలస గ్రామానికి చెందిన ఇ.కామేశ్వరరావులను కురుపాం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించా రు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అలాగే ఈ ప్రమాదంలో స్వల్పగాయలైన గంట అప్పలనాయుడు, డి.సోమినాయుడు లను ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యరామభద్రపురం: మండలంలోని బూసాయవలసలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉమ్మిరెడ్డి రామారావు(60)కు మద్యం తాగే అలవాటు ఉంది.రోజూ విపరీతంగా మద్యం తాగుతూ ఉండేవాడు. మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవడమెందుకని భార్య భారతి మందలించింది.ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రామారావు గడ్డిమందు తాగేశాడు. అనంతరం ఓ తోటలో వాంతులు చేసుకుంటూ సొంగలు కక్కుతుండగా స్థానికులు చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే కుటుంబసభ్యులు ప్రథమ చికిత్ప నిమిత్తం 108లో బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.భార్య భారతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు బాలిక అప్పగింతతుని: ఇంటిలో ఎవరికీ చెప్పకుండా రైలులో వచ్చిన విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన ఏడిబిల్లి భానును తుని జీఆర్పీ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు భాను విజయనగరం నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కి జనరల్ బోగీలో కూర్చుంది. బెదురు చూపులు చూస్తున్న ఆమె గురించి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆమెను కాకినాడ జిల్లా తునిలో దించి రైల్వే పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి సమాచారం సేకరించారు. బాలిక తల్లి జానకి ఏఎన్ఎంగా పని చేస్తున్నట్లు గుర్తించి ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి తుని వచ్చిన తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో బాలికను అప్పగించారు. -
జాతీయ స్థాయి పారా వాలీబాల్ పోటీలకు సచివాలయం ఉద్యోగి
కొత్తవలస: ఈ నెల 25వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఈ రోడ్లో జరగనున్న 3వ నేషనల్ ఫెడరేషన్ కప్–2026 (జాతీయ స్థాయి పారా సిటింగ్ వాలీబాల్ పోటీలు)కు మండలంలోని గనిశెట్టిపాలెం సచివాయంలో డిజిటల్ సహాయకుడిగా పని చేస్తున్న పొలిపిరెడ్డి శ్రీను ఎంపికై నట్లు ఎంపీడీఓ ఎస్.రమణయ్య శుక్రవారం తెలిపారు.ఈ నెల 6వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన ఎంపికల్లో శ్రీను ఎంపికై నట్లు ఆయన తెలిపారు. 25వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్–2026 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కేరళ, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు శ్రీను కెఫ్టెన్‌గా వ్యవహరించనునట్లు ఆయన తెలిపారు.ఈ మేరకు శ్రీనుకు ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు అధికారిక సెలవులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా శ్రీనుకు పలువురు తోటి ఉద్యోగులు అభినందనలు తెలపారు. రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక -
ప్రతిపాదనలు కను‘మరుగు?
రామభద్రపురం: స్వచ్ఛతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగా పశువైద్యశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వ పాలకులు ప్రచార ఆర్బాటాలు చేశారు. అలాగే ఏఏ పశువైద్యశాలల్లో మరుగుదొడ్లు అవసరమో,ఎంత నిధులు అవసరమో నివేదికల రూపంలో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దాంతో హమ్మయ్యా ఏళ్లుగా ఉన్న సమస్య తీరిపోతుందని సంబరపడి పశువైద్యశాఖాదికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు.అయితే ఆ ప్రతిపాదనలు చెత్తబుట్టలోకి వెళ్లాయో ఏమో గాని ప్రతిపాదనలు పంపించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణాలకు చర్యలు కానరావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 85 పశువైద్యశాలలకు రూ.1.40 కోట్లతో ప్రతిపాదనలువ్యవసాయం తర్వాత పాడిపోషణే ఎక్కువ మందికి జీవనాధారం.వ్యాధుల బారిన పడే పశువులకు వైద్యం అందించేందుకు ఆస్పత్రులలో చాలా చోట్ల మరుగుదొడ్లు లేవు. మరికొన్ని చోట్ల ఉన్న అవి దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో వినియోగానికి వీలు లేని విధంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛభారత్ నిధులతో 85 పశువైద్యశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి సుమారు రూ.1,65 లక్షలు చొప్పున రూ.1,40,25,000 నిధులు అవసరమని అంచనా వేసి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. ఆ ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శలు ఉన్నాయి. పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక సిబ్బంది,ఆస్పత్రులకు పశువులు తీసుకొచ్చిన పాడిరైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పుకోలేక సిబ్బంది అవస్థలు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామంటూ ప్రచారాలు తప్ప వాటి ఆచరణకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం దృష్టిపెట్టడంలేదు. పశువైద్యశాలల్లో మూత్రశాలలు,మరుగుదొడ్లు లేక సిబ్బంది,ఆస్పత్రులకు పశువులు తీసుకొచ్చిన పాడిరైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఇందులో మహిళల పరిస్థితి చెప్పుకోలేని స్థితిలో ఉంటోంది. కొన్ని చోట్ల ఉన్నా శిథిలావస్థకు చేరడంతో పాటు వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అత్యవసర సమయంలో మూత్రానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మధుమేహం ఉన్న వారు తరుచూ మూత్రశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పురుషులు మహిళలు సిగ్గుపడుతూ ఒంటికీ, రెంటికీ తుప్పల చాటుకు వెళ్లాల్సిన దుస్థితి. లేందటే ఉగ్గబట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. గంటల తరబడి మూత్రం ఉగ్గబట్టుకున్నా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా నిధులు విడుదల చేసి పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సిబ్బంది, పాడిరైతులు కోరుతున్నారు.కొట్టక్కి పశువైద్యశాలలో పాడిపశువుకు వైద్య పరీక్షలు చేస్తున్న మహిళా సిబ్బంది జిల్లాలో అవసరమైన 85 పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉంది.నిధులు విడుదలైన వెంటనే నిర్మాణాలకు చర్యలు చేపడతాం. ఎస్.మన్మథరావు, జేడీ, జిల్లా పశువైద్యశాఖ, విజయనగరం -
కళ్లముందే కష్టమంతా బూడిద
సంతకవిటి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి కోట్లలో నష్టం వాటిల్లింది. సంతకవిటి మండలంలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మద్దూరు రామయ్య అగ్రహారంలో సుగంధం చందు అనే వ్యక్తి ఎస్సీఎస్ఆర్ ఫర్నిచర్, ఎలక్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, బీరువాలు మాన్యుఫ్యాక్చరింగ్ షాప్ నడుపుతున్నారు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యుత్ మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గమనించి విషయం తెలియజేయడంతో కుటుంబసభ్యులు వచ్చి షట్టర్లు తెరిచి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించి అందులో ఉన్న ఒక దివాన్కాట్ను బయటకు తీశారు. మిగతా వస్తువులు తీద్దామనుకునే లోపే మంటలు షాప్ మొత్తం వ్యాపించాయి. కనీసం దగ్గరకు కూడా వెళ్లలేనంతగా మంటలు వ్యాపించాయి. షాపులో ఉన్న ఏసీలు, టీవీలు, మంచాలు, పరుపులు, ప్లాస్టిక్ కుర్చీలు, కుక్కర్లు, ఇన్వర్టర్లు, కంప్యూటర్, వాషింగ్ మెషీన్లు, కూలర్లు అన్నింటికీ మంటలు వ్యాపించాయి. ఇంతలో గ్రామస్తులు తేరుకుని డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి షాప్‌లోకి పైపుల సహాయంతో నీటిని తీసుకు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతలో రాజాంలో నివసిస్తున్న యజమాని చందు వచ్చి పరిస్థితి చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. సమయానికి రాని ఫైర్ ఇంజిన్ మండలంలోని చాలా గ్రామాలు పొందూరు ఫైర్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. ప్రమాదం జరిగిన మద్దూరు రామయ్య అగ్రహారం కూడా పొందూరు ఫైర్ స్టేషన్ పరిధిలోనిదే. రోడ్డు బాగోలేదనే కారణంతో గ్రామానికి రాలేమని ఫైర్ సిబ్బంది చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం రాజాం నుంచి ఫైర్ ఇంజిన్ రాగా ఇప్పుడెందుకు వచ్చారని గ్రామ మహిళలు ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి ఏం లాభమని నిలదీశారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేశారు. దాదాపు రూ 1.20 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ వై.గోవిందరావు తెలిపారు. 25 లక్షల యూవీ ప్రింటింగ్ మెషీన్ అగ్గిపాలు 15 రోజుల క్రితం బీరువాలపై ప్రింటింగ్ వేసేందుకు రూ.25 లక్షలు ఖర్చు చేసి యూవీ ప్రింటింగ్ మెషీన్‌ను బెంగళూరు నుంచి యజమాని చందు తీసుకు వచ్చారు. కనీసం గంట ముందు ఫైర్ ఇంజిన్ వచ్చినా ఈ మెషీన్ అయినా మిగిలి ఉండేదని యజమాని భోరున విలపించాడు. -
కౌశల్యం..కొలువుల మేళా
విజయనగరం గంటస్తంభం: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కౌశల్యం ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ మేళాలో మొత్తం 700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తొలిరోజు గురువారం మధ్యాహ్ననికి 136 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి ఎం. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, అర్హత కలిగిన యువత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ విద్యార్హతలు కలిగిన 18–32 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.15,500 నుంచి రూ.16,500 వరకు వేతనంతో పాటు వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ మేళా శుక్రవారం కూడా కొనసాగుతుందని తెలిపారు. -
పూరిల్లు దగ్ధం
వేపాడ: మండలంలోని శింగరాయి గ్రామంలో గురువారం ఉదయం 10గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వనమోజు అప్పలనరసమ్మ నివాసం ఉంటున్న పూరిల్లు కాలిపోగా, ఇంట్లో ఉన్న వంట సరుకులు పాత్రలు, దుస్తులు రెండు ఫ్యాన్లు, విద్యుత్ మీటరు, దాచుకున్న 20,000 వేల నగదు అగ్నికి ఆహుతైనట్లు ఆమె చెప్పింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామ రెవెన్యూ అధికారి గనివాడ సోమరాజు దర్యాప్తు జరిపి ఆస్తి నష్టం రూ.20 వేల వరకు ఉంటుందని నివేదికను సమర్పించినట్లు మండల రెవెన్యూ అధికారిణి జె.రాములమ్మ తెలిపారు. పూసపాటిరేగ : భోగాపురం మండలం రెడ్డికంచేరులో రెండు పూరిళ్లు దగ్ధ మయ్యాయి. గ్రామానికి చెందిన వనం అప్పయ్యమ్మ, ముడసల అచ్చియ్యమ్మలకు చెందిన గృహాలు కాలిపోయాయి. పూరిళ్ల ఉన్న గృహోప కరణాలు కొంత మేర దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన యువత వచ్చి కొంత మేర మంటలను అదుపుచేయడంతో ఆస్తి, ప్రాణనష్టం తప్పింది. జేఎన్టీయూ జీవీలో ‘సాహిత్యం సామాజిక ప్రయోజనం’విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం శివారు జేఎన్టీయూ–జీవీలో ‘సాహిత్యం–సామాజిక ప్రయోజనం’ అంశంపై ప్రత్యేక సాహిత్య కార్యక్రమం గురువారం నిర్వహించారు. జేఎన్టీయూ జీవీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రాథమిక శాస్త్రాలు–హ్యుమానిటీస్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేఎన్టీయూ – జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్.వకుళ మాట్లాడుతూ విద్యార్థులు సాహిత్యాన్ని కేవలం పఠనానికే పరిమితం చేయకుండా, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, మానవీయ విలువలను పెంపొందించుకోవడానికి ఒక సాధనంగా భావించాలని సూచించారు. తెలుగు సాహితీ సమితికి చెందిన సాహితీవేత్తలు, కవులు చీకటి దివాకర్, డాక్టర్ జీవీఎస్. జయపాలరావు, రత్నాల బాలకృష్ణ, వి.వెంకటరావు, పప్పు భోగారావులు మాట్లాడుతూ సాహిత్యం వ్యక్తిలో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను, సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందన్నారు. సమాజంలోని సమస్యలను ప్రతిబింబిస్తూ సానుకూల మార్పునకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో పఠనాశక్తిని పెంపొందించడం, మాతృభాషపై అభిమానం పెంచడం, సాహిత్యాన్ని సామాజిక చైతన్యానికి అనుసంధానం చేయడం అవసరమని అన్నారు. అనంతరం వచ్చేనెల 10 నుంచి విశాఖలో జరగనున్న సాహిత సమ్మేళనం –2026 కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఎస్ఈ విభాగానికి చెందిన అధ్యాపకులు డిడివి. ఆర్.శివరాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా వాణిశ్రీ, శ్రీనువిజయనగరం: విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా ఎంఆర్ సంస్కృత హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ పీడీ రావాడ వాణిశ్రీ, జామి మండలం భీమసింగి జెడ్పీహెచ్ఎస్ పీఈటీ బైరెడ్డి శ్రీనులు ఎంపికయ్యారు. అండర్ 14, 17, 19 అడ్మిన్‌గా వీరు వ్యవహరించనున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. స్కూల్‌గేమ్స్ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. -
క్రీడాకారుల భవితతో.. ఆటలు!
కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు విజయనగరం: తమ పిల్లలు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. దీనికోసం చిన్నప్పటి నుంచే శిక్షణ ఇప్పిస్తారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తారు. పతకాలు సాధిస్తే ఆనంద పడతారు. ఉజ్వల భవిత లభిస్తుందని ఆశ పడతారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో చేపట్టిన మెగా డీఎస్సీలో స్పోర్ట్ కోటాలో చేపట్టిన ఉపాధ్యాయుల నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం క్రీడల్లో పతకాలు సాధించిన, ప్రతిభ చూపిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. అసోసియేషన్ల పేరుతో కొన్నాళ్లుగా సాగుతున్న దందా చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ చూపే క్రీడాకారులను పక్కనపెట్టి క్రీడా అసోసియేషన్ల పేరుతో పలువురు సాగిస్తున్న వ్యాపారం క్రీడాలోకాన్ని విస్మయపరుస్తోంది. ప్రభుత్వ పెద్దల సాక్షిగా సాగుతున్న క్రీడాకోటాలో ఉద్యోగవ్యాపారం ఆవేదనకు గురిచేస్తోంది. పోటీలో పాల్గొని గెలవకపోయినా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించినట్టు సర్టిఫికెట్లు ఇవ్వడం విస్తుపరుస్తోంది. ఎంత మొత్తంలో చేతులు మారకుంటే ఈ తరహా దందాకు దిగుతారన్న వాదన బలంగా వినిపిస్తోంది. గుర్తింపు లేని అసోసియేషన్లే ఎక్కువ..! స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారిక లెక్కల ప్రకారం మొత్తంగా 37 క్రీడా అసోసియేషన్లు ఉన్నాయి. ప్రతి క్రీడకు ఒక అసోసియేషన్ ఉంటుంది. ఒలింపిక్ సంఘం అనుసంధానంగా క్రీడా సంఘాలు ఉంటాయి. ఇవి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న అసోసియేషన్లకు అనుసంధానమై ఉంటాయి. ఏటా అండర్–12, 14, 17, 19 పాఠశాల, కళాశాల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇవి కాకుండా వివిధ క్రీడా అసోసియేషన్ల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని మండలాల వారీగా ఎంపిక చేసుకుని జిల్లాస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం కల్పిస్తారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి, అక్కడ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి అవకాశం వస్తుంది. ఇక్కడ జారీ చేసే నిబంధనలు పాటించే అసోసియేషన్లు ఎన్ని....? రాష్ట్ర క్రీడా సంఘాల గుర్తింపు క్రమబద్ధీకరించకపోవడంతో వందలాదిమంది సీనియర్ జాతీయస్థాయి క్రీడాకారులు ఆటలో శ్రమించి సాధించిన ధ్రువపత్రాలు పనికి రావడం లేదు. ఒకవైపు అసోసియేషన్ ప్రతినిధుల నిర్లక్ష్యం, మరోవైపు ఆధిపత్య పోరుతో క్రీడాకారుల జీవితాలు అంధకారమయమవుతున్నాయి. వాస్తవానికి ప్రతి పోటీకి ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ప్రతినిధి, అలాగే క్రీడా అధికారులు రావాల్సి ఉంటుందన్నది నిబంధన. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒక్కో క్రీడకు మూడు, నాలుగు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని నామ మాత్రపు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సాధారణ విషయం కాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు హాజరవుతారు. రెండు, మూడు రోజుల వరకు పోటీలు జరుగుతాయి. హాజరైన క్రీడాకారులతో పాటు శిక్షకులకు భోజన వసతితో పాటు బాల బాలికలకు వేర్వేరుగా వసతి కల్పించాల్సి ఉంది. నామమాత్రంగా పోటీలు నిర్వహించి మిన్నకుండి పోతున్నారు. గుర్తింపు పొందాల్సిందే.. ప్రతి క్రీడా సంఘం తప్పనిసరిగా గుర్తింపు పొందాల్సిందేనని శాప్ నుంచి ఆదేశాలు వచ్చాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సంఘాల వివరాలు క్రీడా యాప్‌లో నమెదు చేసుకోవాలి. అలా గుర్తింపు పొందిన సంఘాలకు మాత్రమే జిల్లా స్థాయి గుర్తింపు వస్తుంది. రెండు, మూడు సంఘాలు ఉండటానికి వీలులేకుండా చర్యలు చేపడుతున్నాం. క్రీడాకారులు గుర్తింపు సంఘాల నిర్వహించే పోటీల్లో పాల్గొంటేనే వారి ధ్రువపత్రాలకు విలువ ఉంటుంది. లేనిపక్షంలో నష్టపోతారు. – ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, విజయనగరం గుర్తింపు లేని సంఘాలతో క్రీడాకారులకు అన్యాయం రాష్ట్ర, జిల్లా స్థాయిలో రెన్యువల్ చేయించడంలో నిర్లక్ష్యం ఈ సంగతి తెలియక మోసపోతున్న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అర్హత కల్పిస్తామంటూ వసూళ్ల దందా మెగా డీఎస్సీలో వెలుగులోకి వచ్చిన నకిలీ సర్టిఫికెట్లతో సర్వత్రా ఆందోళన ఇకపై గుర్తింపు తప్పనిసరి అంటున్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారులు -
కలిసికట్టుగా విజయపతాకం ఎగురవేద్దాం
● వైఎస్సార్సీపీ శ్రేణులకు బొత్స పిలుపు ● కోలాహలంగా సాగిన పార్టీ బొబ్బిలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బొబ్బిలి: కలికట్టుగా నడుద్దాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేద్దామని పార్టీ శ్రేణులకు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. బొబ్బిలిలోని ఓ ప్రైవేటు రెసిడెన్సీలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. ఆర్థిక లావాదేవీలతో రాజకీయాలు చేస్తున్న వారు, దోచుకోవడానికి, దోపిడీకి అలవాటు పడ్డవారు ఒక్కటయ్యారని విమర్శించారు. మొన్నటి వరకూ అరాచకాలు, ఆర్థిక నేరగాళ్లు అంటూ విమర్శించిన వారిని ‘కోట’లోకి ఎలా రానిచ్చారంటూ ప్రశ్నించారు. ఆర్థిక నేరగాళ్లు ఇప్పుడు మంచోళ్లయిపోయారా? ఇదేనా మీ రాజకీయం? సిగ్గనిపించలేదా అంటూ రాజులను పరోక్షంగా విమర్శించారు. రాజకీయం అంటే సంపాదనకో, ఆస్తులు కాపాడుకోవడానికో కాదని, పేద, మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇవ్వడం. మేమున్నామని వారికి జీవనోపాధి కల్పించడం అని హితవు పలికారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిలా మాట ఇస్తే మడమ తిప్పకూడదన్నారు. వైఎస్సార్సీపీ విధానం ఇదేనన్నారు. నాడు రాజన్న, నేడు జగనన్న దానికి నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని బీజేపీ నిరసనలు చేపడుతోందని, ఏపీలో వెన్నుపోటు పార్టీతో కూటమి కట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కిమ్మనడం లేదని, రాజకీయాలంటే ఇలాంటివా అంటూ కూటమి తీరుపై బొత్స మండిపడ్డారు. బొబ్బిలిలో ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. ● కార్డు ఒక భరోసా.. వైఎస్సార్సీపీ గ్రామీణ, అర్బన్ కమిటీల సభ్యులకు కార్డులిస్తోందని, ఇది సాధారణ కార్డు కాదని, పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా కార్డు అని బొత్స స్పష్టం చేశారు. ఏ సమస్య ఎదురైనా ఫోన్ చేస్తే స్పందిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కింది స్థాయి నుంచి పై వరకూ అంతా దోపిడీపాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కరువులో రైతులు చిక్కుకున్నా ప్రభుత్వం ఆదుకునే చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఇక్కడ దొరకని ఎరువులు ఒడిశా, తమిళనాడు, కర్ణాటకలో ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నించారు. ● ఎమ్మెల్సీ సురేష్‌బాబు మాట్లాడుతూ వెన్నుపోటు ప్రభుత్వానికి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడల్లా మేనిఫెస్టోలు మార్చడమే తప్ప వాటిని అమలుచేయడం తెలియదని విమర్శించారు. ఒక మేనిఫెస్టోకు మరో మేనిఫెస్టోకు అసలు సంబంధమే ఉండదన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా ఏమిటో చూపించి విజయకేతనం ఎగురవేయాలన్నారు. ● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు అంగీకరిస్తే నారా లోకేశ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకా, విశాఖ సెంట్రల్ జైలుకా అన్నది తేలుతుందని, ఉచిత సలహాలు, సవాళ్లు చేసే స్థాయి లోకేశ్‌కు లేదని మాజీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ● స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులన్నీ కలిసి కట్టుగా పోరాడాలని డాక్టర్ బొత్స సందీప్ కోరారు. వైఎస్సార్ సీపీ ప్రజలు, కార్యకర్తల పోరాటం నుంచి వస్తే అధికారంలో ఉన్న టీడీపీ వెన్నుపోటు లోంచి వచ్చిందని యువ నాయకురాలు బొత్స అనూష అన్నారు. ఈ వెన్నుపోటు పార్టీకి ఓటుతో బుద్ధిచెప్పాలని కార్యకర్తలతో చెప్పించారు. సమావేశంలో నియోజవర్గ పరిశీలకుడు రొంగలి జగన్నాథం, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, రాష్ట్ర మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి తూముల అచ్యుతవల్లి, వైద్య విభాగం నాయకులు డాక్టర్ బొత్స కాశినాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ బొమ్మి శ్రీనివాసరావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు తూముల రామసుధీర్, మాజీ మునిసిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు, నాలుగు మండలాల జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలుటీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిన మెట్టవలస, వెలగవలస గ్రామాలకు చెందిన యువత, నాయకులకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌లు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడండి మీకు పార్టీ అండగా ఉంటుందన్నారుసెల్ఫీలు తప్ప చేసిన అభివృద్ధి ఏదీ? నియోజకవర్గంలో రోడ్డుపై సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడం తప్ప రాజులు చేసినది శూన్యమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయన్నారు. ప్రలోభాలకు గురిచేసి మున్సిపల్ చైర్మన్ పదవిని లాక్కోవడం తప్ప కొత్తగా చేసిన ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కనిపించదన్నారు. రైతుల కరువు పరిస్థితులు ప్రభుత్వానికి కనిపించడంలేదన్నారు. -
కలిసి జీవిస్తున్న వ్యక్తిని కడతేర్చిన మహిళ
● సిమెంట్ దిమ్మతో తలపై కొట్టి చంపి, శరీరంపై పోసిన మరిగిన నూనె ● అనంతరం పురుగు మందు తాగి ఆత్మహత్నాయత్నం చేసిన నిందితురాలుచీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కందిపేట గ్రామంలో కలిసి జీవనం సాగిస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తనతో కలిసి జీవిస్తున్న ధనాల శ్రీను(34) అనే వ్యక్తిపై రాములమ్మ సిమెంట్ దిమ్మతో దాడి చేసి హతమార్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాములమ్మకు గతంలోనే వివాహం కాగా భర్తను విడిచి దూరంగా ఉంది. అదే విధంగా మృతుడు ధనాల శ్రీను కూడా వివాహం చేసుకుని భార్యను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు.ఈ క్రమంలో వారిద్దరూ పరిచయం పెంచుకుని ఎనిమిది నెలల క్రితం నుంచి భార్యాభర్తల మాదిరిగా కందిపేట గ్రామంలో జీవిస్తున్నారు. శ్రీను విశాఖపట్నంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ అప్పుడప్పుడూ కందిపేట వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ మధ్య ఐదు రోజులుగా కందిపేట గ్రామంలోనే ఉంటున్నాడు. తనను కూడా విశాఖపట్నం తీసుకుపోవాలని కొంతకాలం నుంచి రాములమ్మ అడుగుతుండడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. బుధవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో తనను విశాఖపట్నం తీసుకువెళ్లిపోవాలని శ్రీనుపై రాములమ్మ ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ క్రమంలో రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో రాములమ్మ మంచం కాళ్ల కింద పెట్టిన సిమెంట్ దిమ్మతో శ్రీను తలపై గట్టిగా కొట్టి హత్య చేసింది. అంతటితో ఆగకుండా ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతుని ముఖం, శరీరంపై మరిగిన నూనెను పోసింది. హత్య అనంతరం రాములమ్మ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ జి.శంకరరావు, ఎస్సై బి.లోకేశ్వరరావులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను వైద్య చికిత్స నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. ఎస్సై లోకేశ్వరరావు కేసు నమోదు చేయగా సీఐ శంకరరావు దర్యాప్తు చేస్తున్నారు. -
మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మత్స్య సంపద ఉత్పత్తిని పెంచేందుకు శాసీ్త్రయ పద్ధతుల్లో సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన చాంబర్ నుంచి ఆన్లైన్లో సంబంధిత అధికారులతో గురువారం మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి పీఎంఎంఎస్ వై ఫేజ్–2 కకింద రిజర్వాయర్ల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఈ పధకం కిం కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 నిధులవాటాతో రిజర్వాయర్ పరిమాణాన్ని బట్టి నిధులు కేటాయిస్తుందన్నారు. మత్స్యకారులకు సీడ్ లింక్స్, ఆటోలు, మోటార్ సైకిళ్లు, ఐస్ బాక్సులు అందజేస్తారన్నారు. సమావేశంలో మత్స్యశాఖ డీడీ లావణ్య పాల్గొన్నారు. పోస్టుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వండి ● గిరిజన ఉపాధ్యాయుల విభజన పారదర్శకంగా చేపట్టాలి ● ఐటీడీఏ అధికారులకు యూటీఎఫ్ డిమాండ్ పార్వతీపురం రూరల్: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను ఎటువంటి లోపాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా చేపట్టాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సాగుతున్న ఈ ప్రక్రియలో.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు కేటాయించిన పోస్టుల వివరాలను వెల్లడించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్రావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కృష్ణారావు, కె.భాస్కరరావు కోరారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా ఏ జిల్లాకు ఎంతమందిని కేటాయిస్తున్నారో స్పష్టం చేయడంతో పాటు, తక్షణమే ఖాళీల జాబితాను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. విభజన విషయంలో ఐటీడీఏ అధికారులు ఉపాధ్యాయులకు ఒకలా, సంఘాలకు మరోలా పొంతనలేని సమాచారం ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ గందరగోళానికి తెరదించుతూ.. కేవలం ప్రొవిజనల్, ఫైనల్ సీనియార్టీ జాబితాల ఆధారంగానే కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా ప్రాజెక్టు అధికారి (పీవో) కచ్చితమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయ సంఘాలతో తక్షణమే అధికారిక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ పోటీలకు ఇద్దరు ఎంపిక విజయనగరం అర్బన్: జాతీయ సైన్స్ సెమినార్–2026లో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. దాసన్నపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్–2047’ అనే అంశంపై గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన 47 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా తమ ఆలోచనలు, పరిశోధనలు, భవిష్యత్ దృక్పఽథాలను వెల్లడించారు. ఈ పోటీలో వేపాడ మండలం బక్కునాయుడుపేట ఏపీఎంఎస్పాఠశాలకు చెందిన ఎం.అరవింద్ ప్రథమ స్థానంలో నిలవగా, చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థిని ఐ.మాధవి ద్వితీయ స్థానాన్ని సాధించారు. వీరిద్దరూ విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను డీఈఓ మాణిక్యంనాయుడు అభినందించారు. పోటీల జ్యూరీ సభ్యులుగా పి.వెంకటనాయుడు, ఎం.హరిబాబు వ్యవహరించగా, నిర్వహణలో సైన్స్ కోఆర్డినేటర్ టి.రాజేష్, డీఏసీ జి.సన్యాసినాయుడు, ఎస్ఆర్పీ ఎ.సురేంద్రనాథ్ పాల్గొన్నారు. 30న యువజనోత్సవాలు విజయనగరం: జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026ను ఈ నెల 30న నిర్వహించనున్నట్టు సెట్విజ్ సీఈఓ వి.వి.అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం పట్టణంలోని మహారాజా అటానమస్ కళాశాల(కోట)లో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. జానపద నృత్యాలు, జానపద గీతాలు, వీధి నాటకం, కవితా రచన, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్ జిరాక్స్, వయసు ధ్రువీకరణ పత్రం, పాస్‌ఫొటో తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారని, వివరాలకు సెల్: 94943 34044 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
20 న ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు
● యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శివ ప్రసాద్ విజయనగరం: ఏపీయూడబ్ల్యూజే 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్‌ఎస్‌వీ. శివ ప్రసాద్ కోరారు. ఈ మేరకు గురువారం ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా 27వ మహాసభల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. జిల్లాస్థాయిలో రెండు విడతలుగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రడిటేటషన్ల మంజూరుకు కృషి చేసినట్లు చెప్పారు. ఫ్రీ లాన్స్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ల మంజూరు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం హక్కుల సాధన కోసం ఏపీడబ్ల్యుజే రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమన్వయంతో ముందుకెళ్తున్నాయని చెప్పారు. ఈనెల 20న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అదే రోజు మధ్యాహ్నం యూనియన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎలిశెట్టి సురేష్ కుమార్, విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు లింగాల నరసింగరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎస్ఎన్ రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు టి.రాధాకృష్ణ యూనియన్ నాయకులు కేజే శర్మ, పంచాది అప్పారావు, సముద్రాల నాగరాజు, వైఎస్ పంతులు, శెట్టి గోవిందరావు, బంకురు శంకరరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు . -
ఆరిపోయిన ఆశల దీపం
● ఎదిగి వస్తాడనుకున్న కొడుకు మరణంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● పాఠశాల గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థి గుర్తింపు ● ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ● ఏకలవ్య పాఠశాలలో విషాదం ● విధుల్లో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్ సస్పెన్షన్, వార్డెన్ తొలగింపువిద్యార్థి కుటుంబానికి ఐటీడీఏ హామీ పార్వతీపురం రూరల్ /మక్కువ: చక్కగా చదువుకుంటూ అన్ని రంగాల్లో ముందుండే ఆ పసివా డు అనంత లోకాలకు పయనమయ్యాడు. ఎదిగి వచ్చి ఇంటికి పెద్ద దిక్కు అవుతాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అర్థాంతరంగా ఆవిరయ్యాయి. ‘ఏం కష్టమొచ్చింది నాన్నా.. ఎవరితో చెప్పుకోలేక ఎందుకిలా చేశావ్ అసలు ఏమైంది అంటూ’ ఆ కన్నవారు కుమిలిపోతున్న తీరు చూపరులను కలిచి వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న సవర అర్పిత్ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. గురువారం ఉదయం తరగతి గదిలో అర్పిత్ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది.. హుటాహుటిన డోకిశీల పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పార్వతీపురం కేంద్రాస్పత్రికి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా..మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. సీతంపేట మండలంలోని ఎర్రన్నగూడకు చెందిన రాంబా బు, చామంతి దంపతులకు ఇద్దరు కుమార్తెల తర్వాత పుట్టిన అర్పిత్ మరణవార్త విని ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ఎప్పుడూ చలాకీగా ఉండే అర్పిత్.. ఉరి వేసుకుని చనిపోతానని ఉదయం తనతో చెప్పిన ట్లు స్నేహితుడు హర్షవర్దన్ తెలపగా, ఇంటికి వెళ్లిపోతానని గతంలో చెప్పినట్లు మరో విద్యార్థి లోకేష్ వెల్లడించాడు. అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాడని భావించిన తోటి విద్యార్థులు ఈ ఊహించని సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యార్థి మృతి ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టింది. పాలనాపరమైన వైఫల్యాలకు బాధ్యుడ్ని చేస్తూ.. అనసభద్ర ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ కె.సురేష్‌పై తక్షణమే సస్పెన్షన్ విధిస్తూ ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశా రు. సస్పెన్షనన్కు గురైన ప్రిన్సిపాల్ తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించగా, సీనియర్ పీజీటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితుల నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ (అతిథి అధ్యాపకుడు)ఎ.మహేశ్వరరావును విధుల నుంచి తొలగిస్తూ తక్షణ ఆదేశాలు అమలు చేశారు. బందోబస్తు నిర్వహించిన పోలీసులు ఈ ఘటన సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబసభ్యులు భారీగా ఆటోల్లో జిల్లా ఆస్పత్రికి చేరుకుంటున్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి ముందుగా చేరుకున్న ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ నాయకుడు పాలక రంజిత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు తహసీల్దార్ భానుప్రసాద్ పాఠశాలకు చేరుకుని ఏడో తరగతి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పాఠశాలను సందర్శించి దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థి ఉరి వేసుకున్నట్లుగా భావిస్తున్న గది కిటికీని ఏఎస్సై శ్రీనివాసరావు పరిశీలించగా, క్లూస్ టీమ్ ఆ గదిని తమ ఆధీనంలోకి తీసుకుని కీలక ఆధారాలు సేకరిస్తోంది.పార్వతీపురం రూరల్: మక్కువ మండలంలోని అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో గురువారం ఏడో తరగతి విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై సమాచారం అందుకు న్న వెంటనే ఐటీడీఏ ఏపీవో ప్రభాకరరావు కేంద్రాస్పత్రికి చేరుకున్నారు. అక్కడ మృతుడి తల్లి దండ్రులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆయన ప్రభుత్వం తరఫున కీలక హామీలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల వరకు నష్టపరిహారం అందజేస్తామని ఏపీవో స్పష్టం చేశారు. దీనికి తోడు, ఆ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. -
క్రీడాస్ఫూర్తిని జీవితానికి అనుసంధానం చేయాలి
విజయనగరం టౌన్: క్రీడాస్ఫూర్తిని నిజ జీవితానికి ప్రతి ఒక్కరూ అనుసంధానం చేసుకోవాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ సూచించారు. ఈ మేరకు సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీకానిస్టేబుల్స్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలను పరేడ్ గ్రౌండ్లో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకనుగుణంగా క్రీడాస్ఫూర్తితో సమష్టిగా, ఒకరితో మరొకరు సమన్వయం చేసుకుని ఆడుతూ విజయం సాధించాల్సి ఉంటుందన్నారు. అదేరకమైన స్ఫూర్తిని నిజజీవితంలో కూడా ప్రదర్శించి, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా,ఉద్యోగిగా ప్రవర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. క్రీడాస్ఫూర్తితో నిబంధనలు పాటిస్తూ, సమష్టిగా సమన్వయంతో ఆడి ఎలాగైతే విజయం సాధిస్తామో, అదేవిధంగా మనం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ విధినిర్వహణలో ఒకరికొకరు సహాయపడుతూ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఏటా నిర్వహించే రాష్ట్రస్ధాయి పోటీల్లో ప్రతిభ కనబర్చితే అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, సర్వీసులో ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆటలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ ప్రదానం చేశారు. ముగింపు వేడుకల్లో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్. అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, మహిళా పీఎస్ డీఎస్పీ పీవీవీ .నరసింహారావు, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుర్తు తెలియని యాచకుడి మృతికొత్తవలస: మండల కేంద్రంలోని విజయనగరం రోడ్డులో గల బస్‌షెల్టర్‌లో గుర్తు తెలియని యాచకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. మృతుడికి సుమారు 60 సంవత్సరాలు ఉంటాయని అంచనా. ఆయన గత 30 రోజులుగా స్థానికంగా యాచిస్తూ రాత్రి వేళ బస్‌షెల్టర్‌లో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పంచాయతీ పారిశుధ్య కార్మికులు మృతదేహాన్ని పక్కనే గల శ్మశాన వాటికలో ఖననం చేశారు. -
నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు
● సిబ్బందికి ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదేశాలు విజయనగరం టౌన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయస్ధానాల్లో శిక్షలు పడే విధంగా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఎస్సైలు, సీఐలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బందితో జూమ్ మీటింగ్‌ను గురువారం ఎస్పీ నిర్వహించారు. వారు నిర్వహించాల్సిన విధులు, న్యాయస్ధానాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కేసుల్లో నిందితులు అరెస్టు అయిన సమయంలో పూర్తి వివరాలను సంబంధిత ఎస్సైలు రిజిస్టర్లో నమోదుచేయాలని సూచించారు. న్యాయస్ధానాలు, పోలీసు స్టేషన్ల మధ్య కోర్టు కానిస్టేబుళ్లు, సీఎంఎస్ అధికారులు వారధిగా పనిచేయాలన్నారు. కేసుల విచారణ సమయంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసేందుకు సాక్షులు సకాలంలో హాజరయ్యేందుకు సమన్లను సకాలంలో అమలుచేయాలని, కోర్టులు జారీచేసిన నాన్‌బెయిల్‌బుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసి, నిందితులు కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవిధంగా చూడాలని సూచించారు. మహిళలపై జరిగే దాడులు, పోక్సో, గంజాయి కేసుల్లో నిందితులు కఠినంగా శిక్షకు గురయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. కేసుల విచారణ వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేరస్తులకు శిక్ష పడితేనే ఖాకీకి సార్థకత
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: నేరస్తులకు కోర్టులో శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు సాగినప్పుడే పోలీసు శాఖకు గౌరవం దక్కుతుందని, సమాజంలో నేరం చేయాలంటే వణుకు పుడుతుందని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి మాసాంతపు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్యలు, ప్రాపర్టీ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకోవాలని సూచించారు. బందోబస్తు విధుల్లో సిబ్బంది తప్పనిసరిగా బాడీవోర్న్ కెమెరాలు ధరించాలని, సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో గగనతల పహారా కొనసాగించాలని ఆదేశించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అత్యంత సున్నితమైన (హైపర్ సెన్సిటివ్) గ్రామాలపై నిఘా పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దత్తత గ్రామాల పోలీసులు ‘మన్యంతో మమేకం’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టాలని కోరారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి శాఖలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి అదుపు, ఆస్తుల రికవరీ, కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన 38 మంది సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, మారూఫ్, రమణ, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు : జేసీ
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ 2026–27 సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లును ముందుగానే పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ పక్రియను చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం నిర్వహించిన జిల్లా కొనుగోలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో 2,05,893 ఎకరాల్లో వరి సాగు కా గా, సుమారు 5.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా.. ఎల్‌నినో ప్రభావంతో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున ప్రాధమికంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేసినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,461, సాధారణ రకం ధాన్యం క్వింటా రూ. 2441లుగా నిర్ణయించారన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు, కొనుగోలు కేంద్రాల్లో కల్పించే సౌకర్యాలపై గ్రామసభలు, పోస్టర్లు కరపత్రాలు, మైక్ ప్రచారం ద్వారా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ పంట నమోదు లో కేవలం సాగు చేసిన వ్యవసాయ భూములు, రైతులు సాగు చేసిన పంట రకాలను మాత్రమే నమోదు చేయాలన్నారు. రైస్ మిల్లుల తనిఖీలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు మిల్లులను అనుసంధానం చేయాలన్నారు. రైస్ మిల్లర్లు గడువులో గా బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ డీఎం బి.శాంతి, డీఎస్ఓ మురళీనాధ్, ఆర్డీఓ సుధాసాగర్, సుధారాణి, రామ్మోహన్రావు, మార్కెటింగ్ ఏడీ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
● రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి ● ఉద్దవోలులో అలముకున్న విషాదఛాయలు
తెర్లాం: మరణం కూడా ఆ భార్యాభర్తల బంధాన్ని విడదీయలేకపోయింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన సంఘటన మండలంలోని ఉద్దవోలు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఉద్దవోలు గ్రామానికి చెందిన తమ్మి రెడ్డి అప్పలస్వామి, పార్వతమ్మ భార్యాభర్తలు. వీరిరువురు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం అప్పలస్వామి భార్య పార్వతమ్మ(75) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. మంగళవారం ఆమె అంత్యక్రియలు గ్రామంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. భార్య పార్వతమ్మ మరణించిందన్న దుఃఖంతో భర్త అప్పలస్వామి(79) బుధవారం ఉదయం మృతి చెందా డు. భార్య అంత్యక్రియలు జరిగి 24 గంటలు గడవక ముందే భర్త కూడా మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకు న్నాయి. అప్పలస్వామి, పార్వతమ్మలకు ము గ్గురు సంతానం. వారంతా వివాహితులే. తల్లి దండ్రులిద్దరూ ఒక రోజు వ్యవధిలో మరణించ డంతో వారంతా దుఃఖంలో మునిగిపోయారు. -
వివాహేతర సంబంధం.. అంతులేని విషాదం
● నడిపల్లి మహిళ హత్యకేసు ఛేదించిన పోలీస్‌శాఖ ● నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం టౌన్: వివాహేతర సంబంధాలతో కుటుంబాలు ఛిన్నాభిన్నమై, అంతులేని విషాదం మిగులుతుందని వాటి జోలికి పోవద్దని ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. జీవితాలను నాశనం చేసే వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలని, మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తే, వాటిని తిప్పికొట్టాలని సూచించారు. కుటుంబ వ్యవస్ధతో పాటు చిన్నారులు దిక్కూముక్కూ లేనివారవుతారని, ప్రతి ఒక్కరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి గ్రామంలో జరిగిన హత్య ఉదంతంపై ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అనుమానం..పెనుభూతమై.. పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న శీల అప్పారావు..తన భార్య రమ (37) కనిపించడం లేదని పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం రమ మృతదేహం లభించడంతో మిస్సింగ్ కేసు కాస్త హత్యకేసుగా మార్చి ఉమెన్ పీఎస్ డీఎస్పీ పీవీవీ నరసింహరావు, ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు గురైన రమకు హత్యకు పాల్పడిన నిందితుడు 28 ఏళ్ల లంకలపల్లి బంగారుబాబు మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గత నాలుగు నెలలుగా రమ తన ప్రియుడు బంగారుబాబును దూరం పెట్టడం, బంగారుబాబు ఫోన్‌కాల్స్‌కు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె వేరెవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెంచుకుని, ఆమైపె కక్ష పెంచుకున్నాడు. నిందితుడు ఈ నెల 14న 11 గంటల ప్రాంతంలో రమకు ఫోన్ చేయగా ఆమె కొద్ది సమయం మాత్రమే ఫోన్ మాట్లాడి పెట్టేసింది. అనంతరం మధ్యాహ్న సమయంలో మరోసారి ప్రియుడు ఫోన్ చేయడంతో ఇంట్లో ఎవరూ లేరని, తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని, మాట్లాడుకుందామని ఇంటికి రమ్మని చెప్పడంతో, ప్రియుడి మాటలు నమ్మి రమ వారింటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని తనతో కొనసాగించకపోతే విషయాన్ని భర్తకు చెప్పేస్తామని ఆమెను బెదిరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బంగారుబాబు ఆమె ముక్కు, నోరుపై దిండును పెట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం గోనె సంచిలో ఆమె శవాన్ని దాచిపెట్టి, మోటారు సైకిల్ ముందు పెట్టుకుని, సారిపల్లి కొండ సమీపంలోకి తీసుకుని వెళ్లి పడేశాడు. దర్యాప్తులో భాగంగా లంకలపల్లి బంగారుబాబుపై అనుమానంతో దర్యాప్తు అధికారులు సాంకేతికను వినియోగించి ఆధారాలు సేకరించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేయగా, నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా క్లూస్ టీమ్ సహకారంతో పరిశీలించి, సాంకేతిక, శాసీ్త్రయ ఆధారాలు సేకరించామని ఎస్పీ వివరించారు. రమ మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్ సైకిల్, నిందితుడు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో సీజ్ చేశామన్నారు. కేసులో దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి, న్యాయస్ధానంలో నిందితుడిపై త్వరలో అభియోగపత్రం దాఖలు చేసి, నిందితుడ్ని శిక్షించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్సై అరుణ్ కిరణ్, కానిస్టేబుల్స్ సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు ఎస్.రాఘవులు, పీవీవీ.నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ .లీలారావు, పూసపాటిరేగ ఎస్సై అరుణ్‌కిరణ్, నెల్లిమర్ల ఎస్సై గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం
విజయనగరం అర్బన్: మహారాజా అటానమస్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ బీబీ సరిత, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ శరప్ ముఖ్య వ్యక్తలుగా పాల్గొన్నారు. ఓజోన్ పొర సూ ర్యుడి నుంచి వెలువడే హానికర అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై జీవరాశులను కాపాడే రక్షణ కవచమని వక్తలు తెలిపారు. క్లోరోఫ్లోరో కార్బన్లు (సీఎఫ్సీలు) వంటి రసాయనాల వల్ల ఓజోన్ పొర కు కలుగుతున్న నష్టాన్ని వివరించారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సహజ వనరులను సంరక్షించడం, మొక్కలను పెంచడం ద్వారా ప్రతి ఒక్క రూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావా లని సూచించారు. ముఖ్య వక్తలను ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి.సుధ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రైతు బజార్ ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ ఉల్లంఘన
● మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గేదెల గాయత్రికి ఆహ్వనం లేకుండానే కార్యక్రమం ● వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులతో రైతుబజార్ నిర్మాణంపూసపాటిరేగ: భోగాపురం రైతు బజార్ ప్రారంభోత్సవంలో అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘించారు. వ్యవసాయ మార్కెట్ నిధులతో నిర్మాణాలు చేసి సంబంధిత శాఖ చైర్పర్సన్ గేదెల గాయత్రికి ఆహ్వానం ఇవ్వకుండానే ప్రారంభాలు చేయడంతో వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ఉదయం 8.30 సమయంలో భోగాపురం రైతు బజార్‌ను హడావిడిగా ప్రారంబించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గేదెల గాయత్రి టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం, నెల్లిమర్ల ఎంఎల్ఏ లోకం నాగమాధవి జనసేన కావడంతో మార్కెట్ కమిటీ కార్యక్రమాలపై కొంత కాలంగా వర్గపోరు నడుస్తోంది. దీనిలో భాగంగా అధికారుల ప్రోద్బలంతోనే చైర్పర్సన్ గేదెల గాయత్రిని విస్మరించారనే చర్చ సాగుతోంది. రైతు బజార్ భూములు మావే భోగాపురంలో నిర్మాణం చేసిన రైతు బజార్ భూములు తమవే అని బావిశెట్టి తిరుమలవేణి పేరిట రైతుబజారు గేటుకు బ్యానర్ వెలిసింది. రైతు బజారు ప్రారంభోత్సవం జరిగిన గంట వ్యవధిలోనే బ్యానర్ వెలిసింది. సుమారు రూ.74 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేయడం విదితమే. లక్షలాది రుపాయలు ప్రభుత్వ నిధుల మాటేమటని పలువురు విస్మయం చెందుతున్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం
ఈనెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పా ట్లు చేస్తున్నాం. అలాగే ఈ ఎన్ని కలను పర్యవేక్షించేందుకు అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నాం. నోటిఫికేషన్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతాం. ప్రశాంత వాతావరణంలో ఎస్ఎంసీ ఎన్నికలు జరిగేలా తల్లిదండ్రులు తమ సహకారాన్ని అందించేలా అవగాహన కల్పిస్తాం. ప్రైవేటు పాఠశాల్లో కూడా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతాం. పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా -
తాగునీటికి యూజర్ చార్జీలు..!
విజయనగరం ఫోర్ట్: తాగునీటికి కూడా చంద్రబాబు ప్రభుత్వం యూజర్ చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవు తుంది. తాగునీటి పథకాల నిర్వాహణ పేరుతో ప్రజలపై భారం మోపేందుకు టీడీపీ సర్కార్ చూస్తుంది. దీని వల్ల జిల్లా ప్రజలపై కోట్లాది రుపాయిల భారం పడనుంది. చంద్రబాబు నేతృత్వంలో ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు జీవించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం తాగునీటికి యూజర్ చార్జీలు వసూలు చేసేందుకు సన్నద్ధం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒక్క గ్రామానికి తాగునీరు అందించే రక్షితనీటి పథకాలు 851 ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు తాగునీరు అందించే రక్షిత తాగునీటి పథకాలు 30 ఉన్నాయి. జిల్లాలో ఇళ్లు 4.15 లక్షలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో 2.10 లక్షల తాగునీటి కుళాయిలు ఉన్నాయి. వీటిలో పబ్లిక్ కుళాయిలతో పాటు ఇంటింటి కుళాయిలు కూడా ఉన్నాయి. జిల్లాలో అత్యధిక శాతం మంది ప్రజలు రక్షిత మంచినీటి పథకాలు ద్వారా సరఫరా అయ్యే కుళాయి నీటినే తాగుతున్నారు. రోజు విడిచి రోజు కుళాయి వచ్చే ప్రాంతాల్లో ప్రజలు తాగునీటిని రెండు రోజులకు సరిపడ నిల్వ చేసుకుంటారు. ఏదైనా సమస్య వచ్చి తాగునీటి కుళాయిలు ద్వారా తాగునీరు రాకపోతే ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. వాటర్ ప్లాంట్లు వద్ద నీరు కొనుగోలు చేసి తాగేవారు చాలా తక్కువ. 95 శాతం మంది వరకు కుళా యి నీటినే తాగుతున్నారు. పట్టణాలతో పాటు, పల్లెల్లో కూడా తాగునీటి కుళాయిల ద్వారా వచ్చే నీటినే ప్రజలు ఎక్కువగా తాగుతున్నారు. జిల్లాలో ప్రజలు తాగే నీటికి కూడా చంద్రబాబు సర్కార్ యూజర్ చార్జీలు వసూలు చేయనుంది. ఏడాదికి ఒక్కో ఇంటికి యూజర్ చార్జీలు కింద రూ.340 వరకు వసూలు చేయనున్నారు. తాగునీటి పథకాల నిర్వాహణ నిమిత్తం యూజర్ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం జీఓ కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కుళాయి కనెక్షన్లుకు యూజర్ చార్జీలు వసూలు చేస్తే ప్రజలపై రూ.7 కోట్లకు పైగా భారం పడనుంది. జిల్లాలో సగం మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. శతశాతం కుళాయి కనెక్షన్లు ఇవ్వకుండా యూజర్ చార్జీలు ఏవిధంగా వసూలు చేస్తారనే వాదన కూడా వినిపిస్తుంది. తాగునీటి నిమిత్తం యూజర్ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. తదుపరి విధి విధానాలు అయితే ఇంకా రాలేదు. జలజీవన్ మిషన్ 2.0 లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఇళ్లకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని చెబితే ముందుకు వెళతాం. – ఎస్.కవిత, ఎస్.ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
జిల్లా వ్యవసాయ అధికారిగా రామారావు బాధ్యతల స్వీకరణ
విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యవసాయ అధికారిగా ఎం.రామారావు (ఎఫ్ఏసీ) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసిన వి.తారకరామారావుకు కాకినాడకు బదిలీ అయింది. జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రామారావుకు వ్యవసాయ శాఖ కార్యాలయం అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. విజయనగరం గంటస్తంభం: ఎస్ఐఆర్ – 2026 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భా గంగా నోటీసులు జారీ చేసిన 1,93,735 మందికి విచారణ పూర్తి చేసినట్లు డీఆర్వో సిహెచ్.సత్తిబాబు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించగా, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువు సెప్టెంబరు 10తో ముగిసిందన్నారు. నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబరు 5 వరకు కొనసాగుతుందని, తుది ఓటర్ల జాబితా అక్టోబరు 9న ప్రచురిస్తా మని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను సీఈఓఆంధ్ర.ఎన్ఐసి.ఇన్ లేదా జిల్లా అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చన్నారు. సమావేశంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహభావంతో మెలగాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీ రాణి అన్నారు. స్థానిక డీసీహెచ్ఎస్ కార్యాలయంలో సెకండరీ హెల్త్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో బుధవా రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యం మరింత మెరు గు పడాల్సిన అవసరం ఉందన్నారు. పారిశు ధ్య నిర్వాహణలో లోపాలున్నట్టయితే సంబంధిత నిర్వాహణ సంస్థకు నోటీస్ ఇచ్చి అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. ఆలస్యంగా విధులకు వస్తున్న వైద్యులకు, సమయం కంటే ముందుగా వెళ్లిపోతున్న వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సెలవులు తగ్గించాలన్నారు. అవసరమైన వారికి క్రమశిక్షణ చర్యలకు సిఫా ర్సు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు, ఇన్పేషేంట్స్ సంఖ్యను పెంచాలన్నారు. ఆస్పత్రికి వస్తున్న ప్రతీ రోగి వివరాలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేటట్టు చూడాలన్నారు. రోగు లకు సేవలు అందించడంలో అలసత్వం వహించరాదని సూచించారు. -
శభాష్ పోలీస్..!
● రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసుల ప్రతిభవిజయనగరం టౌన్: రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన రాష్ట్రస్ధాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్, డ్యూటీమీట్‌లో విశాఖ రేంజ్ తరఫున జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పతకాలు సాధించారు. ఈ మేరకు ఎస్పీ ఏఆర్.దామోదర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పతకాలు సాధించిన పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్లో రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్, డ్యూటీమీట్లను ఇటీవల నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, విశేష ప్రతిభ కనబర్చారన్నారు. జిల్లా పోలీసు శాఖకు చెందిన 34 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడా పోటీల్లో విశాఖ రేంజ్ తరఫున పాల్గొని 35 గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్‌తో సహా 66 పతకాలను సాధించి, రాష్ట్రస్ధాయిలో విశాఖ రేంజ్ ఆల్ రౌండర్ చాంపియన్ షిప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అదేవిధంగా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో కూడా జిల్లా పోలీసుశాఖకు చెందిన 8 మంది 4 గోల్డ్ మెడల్స్ , 3 సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ సహా 8 మెడల్స్‌ను రాష్ట్రస్ధాయిలో సాధించారని చెప్పారు. మెడల్స్ సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి, వారి క్రీడాప్రతిభను, వృత్తి నైపుణ్యాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ. లీలారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
చైతన్యంతోనే రజకుల అభివృద్ధి సాధ్యం
● రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి విజయనగరం క్రైమ్: చైతన్యంతోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఏపీ రజక అభివృద్ధి,సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి అన్నారు. ఈ మేరకు బుధవారం ఊటగడ్డ చాకిరేవులో రజక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రజక సంక్షేమ అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మాట్లాడుతూ తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న రజకుల సంక్షేమం, అభివృద్ధి చైతన్యం పొందడం ద్వారా మాత్రమే.సాధ్యమని ఉద్బోధించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజకుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయని సరైన చైతన్యం లేక వాటిని రజకులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, క్షేత్రస్థాయిలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వారిని చైతన్యం చేసే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నామని తెలిపారు రజకులు సంఘ చైతన్యంతో తమ హక్కులను కాపాడుకోవడానికి ముందుకు రావాలని అందుకు తమ అండదండలు అందిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు గురజాపు సత్యారావు కెల్లసత్యం. మద్ది పైడిరాజు తామాడ అచ్చన్న రాయవలస వెంకటరమణ గోవింద్ వెల్దుర్తి నాగరాజు జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యులు. జొన్నాడశ్రీనివాస రావు కొత్తకోట శ్రీనివాసరావు, తాళ్ల,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో బుధవారం ఆమె ఉదయం 8గంటల నుంచి 10:30 వరకు పుల్లయ్య కోనేరు. రోళ్లవాక. గజపతినగరం. దోబీ ఘాట్లను పరిశీలించి రజకులతో చర్చించారు. వినతి పత్రాలు స్వీకరించారు అకస్మాత్తుగా మృతిచెందిన వెల్దుర్తి గౌరినాయుడు, కందివలస ఉమామహేశ్వరరావు కుటుంబాలను. పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేవిధంగా చూస్తామని పేర్కొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి విజయనగరం: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జిల్లా రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తంగేటి భాస్కరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్పర్సన్ సావిత్రికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హమీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్యపై ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హమీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రజకులకు న్యాయం చేసి ఆర్ధికంగా, సామాజికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి జంప చిన్న, ఉపాధ్యక్షుడు శీల తాతారావు, నగర గౌరవ అధ్యక్షుడు ఈశ్వరరావు, పైడి చిట్టి, అప్పలరాజు, సతీష్, సింహాచలం, శ్రీను, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలి
● ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య విజయనగరం: ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ సమీపంలో రెవెన్యూ భవన్లో ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీ్త్రశక్తి పథకం మరింత విజయవంతం కావాలంటే భవిష్యత్‌లో రాబోయే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొని నిర్వహించడం ద్వారా సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో యాజమాన్యంతో చర్చలు జరిపి, ఉద్యోగులకు భద్రతతో పాటు భరోసా కల్పించేలా పలు అంశాలపై ఒప్పందాలు సాధించామని తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత, సంక్షేమం, పదోన్నతులు, ఖాళీల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు, విద్యుత్ బస్సుల విషయంలో ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జేఏసీ చేసిన పోరాటాల ఫలితంగానే పలు అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ సమావేశంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి డి.అరుణ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని, యూనియన్లకు అతీతంగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం యూనియన్ చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. సమావేశంలో కె.కృష్ణారావు, ఎల్ఏరావు, కేవీ రమణ, యుఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
22ఎ భూములపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, అధికారులు విజయనగరం గంటస్తంభం: 22ఏ భూముల వివ రాల పరిశీలన, రెవెన్యూ సేవలు, ప్రజా ఫిర్యాదు ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ సర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, 22ఏ భూముల వివరాల నవీకరణ, రెవెన్యూ సేవలు, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ భూ రీసర్వే పెండింగ్ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో సిహెచ్.సత్తిబా బు, ఆర్డీఓ సుధాసాగర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతే లక్ష్యంగా.. కార్యాచరణ విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించనున్న స్వచ్ఛత హి సేవా–2026 కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యర్థాల విభజనపై అవగాహన కల్పించడం, అపరిశుభ్ర ప్రాంతాల సుందరీకరణ, బస్టాండ్లు, మార్కెట్లు, ఆస్పత్రులు, నీటి వనరులు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇంటింటా ప్రచారం, నాలుగు రకాలుగా వ్యర్థాల విభజన, ఇంటి వద్దే సేంద్రియ ఎరువు తయారీ, గుడ్డ సంచుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వినాయక నిమజ్జనం అనంతరం ఘాట్ల పరిశుభ్రత, వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమాలు, పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాలు పంపిణీ చేపట్టాలని తెలిపారు. అక్టోబరు 1న ఏక్ దిన్..ఏక్ ఘంటా..ఏక్ సాత్లో భాగంగా సామూహిక శ్రమదానం, 2న ప్రత్యేక గ్రామసభలు, పట్టణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాలపై ముందస్తు ప్రణాళికతో పాటు పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్ చేయాలని కలెక్టర్ సూచించారు. -
ఎన్నికల సంబడి
● ఈ నెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు ● చేతులెత్తే పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక ● ఈ సారి ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఎన్నికలు వీరఘట్టం: బడిలో ఎన్నికల సందడి మొదలు కానుంది. సర్కారు బడుల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు రెండేళ్లకు ఒకసారి విద్యాశాఖ ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఎన్నికలను నిర్వహిస్తుంది. రెండేళ్ల క్రితం ఎన్నికై న ఎస్‌ఎంసీల కాలపరిమితి ముగిసింది. దీంతో ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29న ఎన్నికల నిర్వహించేందుకు బుధవారం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని నిశ్చయించారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండకూదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల రాజకీయ నాయకులు చొరబడడంతో తగాదాలు జరిగాయి. మరి ఈసారి ఏ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారో చూడాలి. విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తే పద్ధతి ద్వారా ఎస్ఎంసీ చైర్మన్, వైఎస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలను జరిపించేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాథమిక, మోడల్ ప్రైమరీ, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ ఇలా అన్ని మేనేజ్మెంట్లలో 1,604 సర్కారు బడులు ఉన్నాయి. అలాగే 98 ప్రైవేట్ పాఠశాలలతో కలిపి 1702 విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో 1,65,352 మంది విద్యార్థులు ఈ ఏడాది చదువుతున్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్లు లిస్టు(తల్లిదండ్రులు) జాబితా ప్రచురుణ చేస్తారు. 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఓటరు జాబితాపై అభ్యంతరాలు/ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3–4 గంటల మధ్యలో తుది ఓటరు జాబితా ప్రచురణ చేస్తారు. రాజకీయ జోక్యం లేకుండా 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఎస్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య తొలి సమావేశాన్ని నిర్వహిస్తారు. 15 మండలాలకు ఎన్నికల ప్రత్యేకాధికారులు.. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో ఈ నెల 29న జరగనున్న ఎస్ఎంసీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు విద్యాశాఖకు సంబంధించిన అధికారులను జిల్లాలోని 15 మండలాలకు నియమించారు. వీరు ప్రతి మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతారు. అలాగే ఇక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులకు నివేదిస్తారు. -
హ్యూమన్ రైట్స్ రాష్ట్ర డైరెక్టర్‌గా అదృష్టకుమార్
బొబ్బిలి: పట్ట ణానికి చెందిన కె.అదృష్ట కుమార్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలే నియామక సమాచారం అందుకున్న అదృష్ట కుమార్ బుధవారం కాకినాడలోని జేఎన్టీయూ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు టి. ప్రసన్నకుమార్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర డైరెక్టర్‌గా నియామకమైన అదృష్టకుమార్ను ఈ సందర్భంగా పట్టణ వాసులు అభినందిస్తున్నారు. సమర్ధవంతమైన చర్యలతో నేరాల తగ్గుముఖంవిజయనగరం టౌన్: జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న పటిష్టమైన భద్రత చర్యలు, సమర్థవంతమైన పోలీసింగ్‌తో గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్‌కి సంబంధించి గతేడాది 304 కేసులు నమోదుకాగా, ఈ ఏడాదిలో 217 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. క్రైమ్ ఎగినెస్ట్ చిల్డ్రన్‌కి సంబంధించి పోక్సో కేసులు గత ఏడాది 44 నమోదు కాగా, ఈ ఏడాదిలో 20 కేసులు నమోదయ్యాయన్నారు. క్రైమ్ ఎ గినెస్ట్ ఉమెన్ కేసుల్లో 31 క్రైమ్, ఎగినెస్ట్ చిల్డ్రన్ కేసుల్లో 36, మొత్తం 67 కేసుల్లో నిందితులకు న్యాయస్ధానాల్లో శిక్షలు పడ్డాయని తెలిపారు. గంజాయి కేసుల్లో గతేడాది 78 కేసులు నమోదు చేసి 1147.856 కిలోల గంజాయిని సీజ్ చేసి, 246 మందిని అరెస్టు చేసి, 35 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాదిలో 23 కేసులు మాత్రమే నమోదుకావడం, 655.225 కిలోల గంజాయి సీజ్ చేసి, 118 మందిని అరెస్ట్ చేసి, 25 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. రహదారి ప్రమాదాల్లో ఈ ఏడాది ఇప్పటివరకూ 350 రహదారి ప్రమాదాలు జరిగి, 137 మంది మరణించగా, 444 మంది గాయపడ్డారన్నారు. గతేడాది కంటే రహదారి ప్రమాదాలు 15.5శాతం తగ్గాయని వివరించారు. రెవెన్యూ రికార్డుల మార్పుపై ఫిర్యాదు పూసపాటిరేగ: మండలంలోని కొల్లాయివలసకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ ఎన్వీ రమణను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 76–1లో భూములు మార్పు చేశారని దువ్వు అప్పలస్వామితో పాటు పలువురు తెలిపారు. దీనిపై తహసీల్దార్ రమణ స్పందిస్తూ విచారణ చేసి హక్కుదారుల పేర్లు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎంవీజీ శంకరరావు, నర్సన్న, తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి● గరివిడి ఆర్ఓబీ సమీపంలో ప్రమాదం చీపురుపల్లిరూరల్(గరివిడి): విజయనగరం–పాలకొండ ప్రదాన రహదారిలో గరివిడి ఆర్ఓబీ సమీపంలో పెట్రోల్‌బంకు ఎదురుగా బుధవారం ఉదయం ఓ బైక్‌ను లారీ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్ల మండలానికి చెందిన ద్విచక్రవాహనదారు బోడసింగి లక్ష్మణరావు(37) సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదానికి సంబంధించి గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఉదయం 11గంటల సమయంలో విజయనగరం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న లారీడ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గుర్ల మండలంలోని కొండగండ్రేడు గ్రామానికి చెందిన బోడసింగి లక్ష్మణరావు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడికి భార్యతో పాటు డిగ్రీ చదువుతున్న కూతురు నీలిమ, ఏడో తరగతి చదువుతున్న బాలుడు యుగంధర్ ఉన్నారు. చిన్నపాటి వ్యవసాయం, కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. -
రామతీర్థంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలను జరిపించారు. అనంతరం గ్రామ బలిహరణ పూర్తిచేసి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని ఎగురవేసి సమస్త దేవతామూర్తులను బ్రహ్మోత్సవాల వేడుకకు ఆహ్వానం పలికారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు ప్రతిరోజూ శ్రీవారిని గ్రామ తిరు వీధుల్లో ఊరేగింపు, 20న స్వామివారి కల్యాణోత్సవం, 24న పుష్పాంజలి కార్యక్రమాలు జరిపిస్తామని అర్చకులు తెలిపారు. -
700 ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్
● 17,18 తేదీల్లో కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 17,18 తేదీల్లో విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో కౌశలం డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్(జీటీఐ)ఆధ్వర్యంలో ఫౌండ్రీ విభాగంలో 400, మెషినింగ్ విభాగంలో 300 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 32 ఏళ్ల వయస్సు గల పురుష అభ్యర్థులు, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్(మెకానికల్) తదితర విద్యార్హతలు కలిగిన వారు, ఫ్రెషర్లు కూడా హాజరుకావచ్చన్నారు. ఎంపికై వారికి రూ.15,500 నుంచి రూ.16,500 వరకు వేతనంతో పాటు హాజరు బోనస్, నైట్ షిఫ్ట్, వర్క్‌స్టేషన్ అలవెన్సులు, ఉచిత భోజనం, వసతి, ఈపీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు అందనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ప్రతిభ, ఆసక్తి ఉన్న వారికి సెర్బియాలోని సంస్థ గ్రూప్ కంపెనీలో ఏడాది పనిచేసే అవకాశం కూడా లభించవచ్చన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఫోన్ 90305476667 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. -
రజకుల సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన
● ఏపీ రజక సంక్షేమ అభివృద్ధి చైర్పర్సన్ సావిత్రి వెల్లడివిజయనగరం క్రైమ్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు, స్వయం ఉపాధి అవకాశాలను పరిశీలించేందుకు జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర రజక సంక్షేమ, అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి తెలిపారు. ఈ మేరకు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ముఖ్యంగా రజకులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తాను వచ్చానన్నారు. జిల్లాలో 51 వేల మంది రజకులు ఉన్నారని, బీసీ కార్పొరేషన్ ద్వారా 698లక్షల ఉపాధి లబ్ధిపొందారన్నారు. ఇందులో 429 రజక సొసైటీలుండగా, 147.25లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రజక మహిళలు శిక్షణ అవకాశాలను వినియోగించుకోవాలని, టైలరింగ్‌తో పాటు జీవనోపాధి శిక్షణ ఇస్తున్నామన్నారు. అందుకు 2849 దరఖాస్తులు రాగా, 2063 మంది అర్హత పొందారని చెప్పారు. అయితే రజక మహిళల నుంచి కేవలం 81 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయన్నారు. అవగాహన లోపం కారణంగా రజక మహిళలు ప్రభుత్వ శిక్షణ స్వయం ఉపాఽధి అవకాశాలను వినియోగించుకోలేక పోతున్నారన్నారు. గతంలో త్రీమెన్ కమిషన్ ఏర్పాటు చేసి అందుకు రూ.50లక్షల నిధులు కేటాయిచి మూడు నెలల పాటు కమిషన్ పనిచేసినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదన్నారు.ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాని రజక సంఘం నేతలు చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడడమే తన అంతిమ లక్ష్యమని చైర్పర్సన్ స్పష్టం చేశారు. -
శాశ్వత ముద్ర
విజయనగరంబుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కుటుంబ యజమాని సరైనవారు అయితే ఆ కుటుంబం సన్మార్గంలో పయనిస్తుంది. నాయకుడు మంచివారైతే ఆ దేశం, రాష్ట్రం, ప్రాంతం, గ్రామం ప్రగతి పథంలో పయనిస్తుంది. ప్రజలకు సంక్షేమం సమకూరుతుంది. ప్రగతిలో శాశ్వత ముద్ర కనిపిస్తుంది. అచ్చంగా అలానే.. వైఎస్సార్, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్టీయూ, తోటపల్లి, జంఝావతి, గిరిజన వర్సిటీ, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులు జిల్లాకు సమకూరాయి. ఇది మన విజయనగరం అనేలా ప్రగతి కళ్లకు కట్టిందని జిల్లా వాసులు చెబుతున్నారు. ● జిల్లాకు ప్రగతి ఫలాలు అందించిన వైఎస్సార్ కుటుంబం ● అందుబాటులోకి విద్య, వైద్యం ● సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంఖాళీ బిందెలతో మహిళల నిరసన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఇటు అధికారులు..అటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కొండపాలెం ప్రజలు ఆందోళన చేశారు. –8లోఅభివృద్ధిలో.. -
గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని గూడెంగ్రామానికి చెందిన శనపతి సంతోష్(34) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన శనపతి సంతోష్ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో అవుట్ సోర్సింగ్‌లో మొటలర్జీ డిపార్ట్మెంట్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. జేఎన్టీయూలో తనతో పాటు పనిచేస్తున్న అదే డిపార్ట్మెంట్కు చెందిన ఏడుగురు సిబ్బంది సంతోష్‌ను తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక గూడెంలోని తన నివాసం వద్ద గడ్డి మందు కూల్ డ్రింక్‌లో కలుపుకుని తాగేశాడు. గడ్డి మందు తాగే ముందు నా ఆత్మహత్యకు జేఎన్టీయూలో పనిచేస్తున్న ఏడుగురు వ్యక్తులే కారణమని లేఖలో రాశాడు. గడ్డి మందు తాగిన సంతోష్ పరిస్థితిని కుటుంబ సభ్యులు చూసి వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి వివాహం కాలేదు. తల్లి రాములమ్మ, తమ్ముడు సతీష్ ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. -
అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు
● 17వ తేదీలోగా అందజేయాలి ● ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కృష్ణ విజయనగరం అర్బన్: విజయనగరం టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈఏటీ) విభాగంలో అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అఽభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కృష్ణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మెకానికల్ బ్రాంచ్‌లో బీటెక్ లేదా సమానమైన డిగ్రీలో ద్వితీయ శ్రేణితో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజ యనగరం టౌన్లో నిర్వహించే డెమో తరగతులకు విధిగా హాజరు కావాలని తెలియజేశారు. మొక్కజొన్న పంట ధ్వంసంపార్వతీపురం రూరల్: మండలంలోని రావికోన పంచాయతీ గంగమాంబాపురంలో ఏనుగులు పంటలను, ఇళ్లను మంగళవారం ధ్వంసం చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ఏడాది వరి వేయలేక, తనకున్న 1.50 సెంట్ల భూమిలో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగుచేసిన కేండ్రుక శ్రీనివాసరావు ఆశలపై ఏనుగుల దాడి నీళ్లు చల్లింది. ఆరుగాలం కష్టించి పెంచిన పంటను సుడిగాలిలా వచ్చి సర్వనాశనం చేయడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన ఉర్లక రఘు ఇంటిపైనా గజరాజులు ప్రతాపం చూపాయి. ఇంటి గేటుతో పాటు కిటికీలను నుజ్జునుజ్జు చేయడంతో ఆ కుటుంబం భయంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. అటవీశాఖ అధికారులు తక్షణమే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని మాజీ సర్పంచ్ కడ్రక రామస్వామి అధికారులను కోరారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిదత్తిరాజేరు: మండలంలోని మరడాం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా శుక్రవారం ఉదయం వెనుక నుంచి బైక్ ఢీకొన్న సంఘటనలో గాయపడిన మరడాం గ్రామానికి చెందిన గుగ్గిలపు నారాయణరావు(60) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు, ఈ మేరకు ఎస్.బూర్జవలస ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు. నారాయణ రావు ఇంటి నుంచి రోడ్డుకు వెళ్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు బలమైన గాయాలు కాగా విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య రమణమ్మ వివాహమైన కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. ప్రొఫెసర్లపై ఫిర్యాదువిజయనగరం టౌన్: జేఎన్టీయులో ఇటీవల జరిగిన పరీక్షల జవాబు పత్రాల్లో మార్కుల టాంపరింగ్ జరిగినట్లు వీసీ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. దీనిపై రిజిస్ట్రార్ కె.చంద్రభూషణరావు వీసీ ఆదేశాలకు మేరకు మంగళవారం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కొందరు ప్రొఫెసర్లపైన, ఉద్యోగులపైన ఆరోపణలు చేశారని రూరల్ పోలీసులు తెలిపారు. యువకుడి దుర్మరణంవిశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలోని ఆరిలోవ లా అండ్ ఆర్డర్ ఎస్సై వరహాలునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన పిసిని పవన్శేఖర్(20) విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధురవాడలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసి, తన స్నేహితుడు ఆకుల ప్రసాద్‌తో కలిసి బైక్‌పై జగదాంబ వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఎండాడ కూడలి దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో పవన్ శేఖర్ కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై వరహాలు నాయుడు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చవితి మంటపాల్లో ఎన్నికల వేడి..!
● పోటాపోటీగా మంటపాల ఏర్పాటు ● వినాయకుడి చాటున ‘వార్డు’ రాజకీయంవిజయనగరం అర్బన్: వినాయక చవితి వేళ.. వియయనగరం పట్టణంలో మంటపాల సాక్షిగా ఎన్నికల వేడి సెగపుట్టిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు, తమ ఉనికిని చాటుకునేందుకు చవితి మండలాల ఏర్పాటును ఒక అవకాశంగా మలుచుకుంటున్నారు. పోటాపోటీగా మంటపాల ఏర్పాటుకు సహకారం అందించారు. దీంతో గతేడాదిలో పోలిస్తే ఈ ఏడాది పట్టణంలో వినాయక చవితి మంటపాల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా పోలీసుల లెక్కల ప్రకారం నగరంలో 530 మంటపాలు వెలిశాయి. గతేడాది ఈ సంఖ్య కేవలం 300 లోపు ఉండేది. ఒకప్పుడు ప్రధాన కూడళ్లు, కాలనీలకే పరిమితమైన మంటపాలు... ఇప్పుడు ప్రతి సందులోనూ దర్శనమిస్తున్నాయి. ఆశావహులు చవితి వేడుకల సాక్షిగా తమ అనుచరగణాన్ని పెంచుకునేందుకు పాకులాడుతుండడాన్ని చూసిన జనం ముక్కునవేలేసుకుంటున్నారు. మంటపాల సంఖ్య పెరగడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్లు, కూడళ్లు, కాలనీ వీధుల్లో మంటపాల ఏర్పాటుతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు స్థలం తగ్గిపోగా, మరికొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు తప్పనిసరి అవుతున్నాయి. భక్తి, సామాజిక ఐక్యతకు వేదిక కావాల్సిన చవితి ఉత్సవాలను రాజకీయ ప్రచార వేదికలుగా పలువురు ఉపయోగించుకోవడం విమర్శలకు తావిస్తోంది. -
మార్కుల ట్యాంపరింగ్‌పై విచారణ కమిటీ
● బాధ్యులపై చర్యలు తప్పవు ● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావువిజయనగరం రూరల్: జిల్లాలో ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – గురజాడ విజయనగరంలో గత కొన్నేళ్లుగా జవాబుపత్రాల్లో జరుగుతున్న మార్కుల ట్యాంపరింగ్ వివాదంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని వర్సిటీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు తెలిపారు. ఇటీవల మార్కుల ట్యాంపరింగ్‌పై ఈ నెల 7న ఫిర్యాదులు అందడంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపగా ఐదుగురు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి ఉత్తీర్ణత చేసినట్లు విచారణలో తేలింది. అయితే, అసలు దొంగలు తప్పించుకుని పరీక్షా విభాగానికి ఏ సంబంధం లేని ఔట్సోర్సింగ్ ఉద్యోగి సనపతి సంతోష్‌పై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సంతోష్ మానసిక ఆందోళనతో మూడు రోజుల కిందట నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి తన స్వగ్రామంలో ఆత్మాహత్యాప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు. నలుగురు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లపై ఆరోపణలు సంతోష్ తన సూసైడ్ లేఖలో వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులే మార్కుల ట్యాంపరింగ్‌లో కీలక సూత్రదారులని పేర్కొన్నారు. ఇది కొద్ది రోజులుగా జరుగుతున్న తంతుకాదని, తాను ఉద్యోగంలో చేరకముందు నుంచే గత మూడు నాలుగేళ్లుగా జరుగుతుందని పేర్కొన్నాడు. మూడేళ్ల నుంచి జవాబు పత్రాలను పరిశీలిస్తే దోషులు ఎవరో తేలుతుందని, వర్సిటీ ఉపకులపతి దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ట్యాంపరింగ్ నిజమే ఈ విషయమై ఉపకులపతి వి.వి.సుబ్బారావును వివరణ కోరగా తమకు అందిన సమాచారం మేరకు జవాబు పత్రాలను పరిశీలించగా ఐదుగురు విద్యార్థులకు వారికి వచ్చిన మార్కులు కంటే అధికంగా మార్కులు వేసి ట్యాంపరింగ్ చేసినట్టు గుర్తించామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గత మూడేళ్లు జవాబు పత్రాలను పరిశీలించేందుకు కమిటీ వేశామని, వారి విచారణలో మార్కుల ట్యాంపరింగ్ జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
చీపురుపల్లి రూరల్ (గరివిడి): తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఇటు అధికారులు..అటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కొండపాలెం ప్రజలు గరివిడి మేజర్ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన తాగునీటిని అందించడంలో అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు గత మూడు నెలలుగా తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కొండపాలెం ప్రజలు చివరకు విసుగెత్తి గరివిడి మేజర్ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో కొండపాలెం ప్రాంతానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, నీటి సమస్యను ఎదుర్కొంటున్న వారంతా కలిసి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. ‘తాగునీరు లేకపోతే ప్రజలు ఎలా బతకాలి’? అంటూ అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బొంపల్లి వెంకటరావు, శివుకు కాంతారావు, శ్రీను, జమ్ము వెంకటరావు తదితరులు మాట్లాడుతూ కొండపాలెంతో పాటు డీఎఫ్ఎనన్ ఏరియా, జె–టైప్ క్వార్టర్స్, టూరింగ్ క్వార్టర్స్, రేకుల షెడ్ ఏరియా ప్రజలు కూడా తాగునీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నారని, నెలల తరబడి సమస్య కొనసాగుతున్నా పట్టించుకోని అధికారుల తీరుపై మండిపడ్డారు. 45 రోజులుగా కరెంటు సమస్యతో పాటు గుజ్జింగివలస వద్ద మోటార్ రిపేర్ అయ్యి, నీటి సరఫరా వ్యవస్థ నిలిచిపోయినా, దానిని మరమ్మతు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు. ఒక మోటార్ మరమ్మతుకు, కరెంటు సమస్యకు ఇన్ని రోజులు పడుతుందా? లేక ప్రజల తాగునీటి సమస్య అధికారులకు పట్టదా? అంటూ నిలదీశారు. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన బాధ్యత ఉన్న గరివిడి మండల స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యే వరకు, అలాగే సంబంధిత అధికారుల వరకు సమస్యపై స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది..ప్రజలు తాగు నీటి కోసం అల్లాడుతుంటే పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయింపు గరివిడి మేజర్ పంచాయతీ కార్యాలయం ముట్టడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజాగ్రహం రంగప్రవేశం చేసిన పోలీసులురోడ్డుపై బైఠాయింపు..రంగంలోకి పోలీసులు మేజర్ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందులతో ఆందోళన చేసి అనంతరం ప్రధాన రహదారిపై ప్రజలు బైఠాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఎస్సై లోకేశ్వరరావు పోలీసులతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఈవో వేణుగోపాల్ స్పందిస్తూ..గుజ్జింగివలస వద్ద మోటార్ కాలిపోవడం, సుమారు 45 రోజులుగా విద్యుత్ అంతరాయం ఏర్పడడం వల్లే తాగునీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మోటార్‌కు మరమ్మతులు పూర్తి చేసి మంగళవారం సాయంత్రం కొండపాలెం గ్రామానికి తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొండపాలెం, డీఎఫ్ఎనన్్, జె–టైప్ క్వార్టర్స్, టూరింగ్ క్వార్టర్స్, రెగ్యుల్ షెడ్ ప్రాంతాలకు రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తామని వెల్లడించారు. -
చంపేసి..
గోనె సంచిలో మూటకట్టి..● కుదిపి గ్రామ సమీపంలో వివాహిత మృతదేహాన్ని పడేసిన నిందితుడు ● కన్నీరుపెడుతున్న చిన్నారులుపూసపాటిరేగ: వినాయక చవితి పండగ వేళ పూసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో వివాహిత హత్య కలకలం రేపింది. పూసపాటిరేగ పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం... సోమవారం మధ్యాహ్నం నడిపల్లికి చెందిన లంకలపల్లి బంగారుబాబు పిలుపుమేరకు ఆయన ఇంటికి ఆదే గ్రామానికి చెందిన శీలా రమా(34) వెళ్లింది. వారిద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడై బంగారుబాబు దిండుతో రమాను ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. సాక్ష్యాలు మాయం చేయడానికి రమా మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి బండిపై 20 కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్లి కుదిపి, సారిపల్లి గ్రామాల మధ్య తోటల్లో పడేశాడు. భార్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త శీల అప్పారావు పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వివాహిత హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చి పలు కోణాల్లో విచారణ జరిపారు. నిందితుడిని పూసపాటిరేగ మండలం పోరాం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. భోగాపురం రూరల్ సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వి.నర్సింహరావు, పూసపాటిరేగ ఎస్ఐ వి.అరుణ్‌కిరణ్ పరిశీలించారు. పాపం చిన్నారులు... మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లి హత్యకు గురైందన్న విషయం తెలుసుకుని కన్నీరుకార్చారు. అమ్మ కావాలి అంటూ ఇద్దరు చిన్నారులు గుక్కపెట్టి ఏడవడం గ్రామస్తులను కన్నీరుపెట్టించింది. -
పండగ వేళ కాటేసిన మృత్యువు
కొత్తవలస: వినాయక చవితి పర్వదినాన జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుంటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆనందగా గడపాల్సిన వేళ యువకుడిని మృత్యువు కాటేసింది. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా,.. మరో యువకుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామాజు జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి ప్రాంతానికి చెందిన బిడ్డక చరణ్ (21), బిడ్డక రాజు ఇంటి వద్ద వినాయక పూజలు ముగించుకొని ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. కొత్తవలస మండలం జిందాల్ ఫ్యాక్టరీకి సమీపంలోని చెరువు వద్ద మరమ్మతులతో రోడ్డుపై నిలిపివేసిన బొలోరా వాహనాన్ని బైక్‌తో ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి తలకు తీవ్రగాయాలు కావడంతో చరణ్ (21) మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజు కొన ఊపిరితో వైద్యసేవలు పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. విశాఖపట్నం–అరకు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన ద్విచక్రవాహనం ఒకరు మృతి, కొన ఊపిరితో మరొకరు.. -
భూ సమస్యను పరిష్కరించకుంటే చావే శరణ్యం
● పురుగు మందు డబ్బాలతో తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ రైతుల ధర్నారామభద్రపురం: కాళ్లరిగేలా తిరుగుతున్నా తమ భూ సమస్యను పరిష్కరించడంలేదని, ఇక చావే శరణ్యమంటూ రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పురుగు మందు డబ్బాలు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేశారు. ఇట్లామామిడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 161లో ఎస్సీలకు చెందిన సుమారు 3 ఎకరాల భూమిని విజయనగరానికి చెందిన ఓ పెత్తందారు కబ్జాచేసి కంచె ఏర్పాటు చేశాడని, సమస్య పరిష్కరించి న్యాయంచేయా లని అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరించకుంటే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ బుధవారం క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. రైతుల నుంచి పురుగు మందు డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో రైతులు అక్యారపు లక్ష్మణ, రామవరపు సత్యం, బలగ లక్ష్మణరావు, సత్యం పైడమ్మ, రాములమ్మ, సీపీఎం నాయకుడు బలస శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టంలో కుండపోత వీరఘట్టం: వీరఘట్టంలో మంగళవారం ఉదయం వేసవిని తలిపించే ఎండతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో అల్లాడిపోయారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు ఏకదాటిగా కుండపోతగా వర్షం కురిసింది. 4.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. వర్షం రైతుల్లో హర్షాన్ని నింపింది. -
సమస్యలు సృష్టించడం సరికాదు
● ఎస్పీ ఏఆర్ దామోదర్ విజయనగరం టౌన్: ఎవరైనా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలే కానీ, లేని సమస్యలను సృష్టించడం, స్వలాభం కోసం విద్యార్థులను రెచ్చగెట్టడం సరికాదని విద్యార్థి సంఘాల నాయకులకు ఎస్పీ ఏఆర్.దామోదర్ హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసు ఉద్యోగ నియామకాలను పెద్ద సంఖ్యలో చేపట్టాలని ఆందోళనలు చేపడుతున్న విద్యార్థి సంఘాల ఉచ్చులో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘం నాయకులు తమ రాజకీయ ఎదుగుదలకు నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి, వారు చేపట్టే నిరసన, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పావులుగా వాడుకుంటున్నారన్న వాస్తవాన్ని యువత గుర్తించాలని హితవు పలికారు. విద్యార్థి సంఘాల నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువతను ప్రలోభపెట్టి, రెచ్చగొట్టి వారిని హింసా మార్గంలోకి తీసుకువెళ్లి, క్రిమినల్ కేసుల్లో నిందితులుగా చేసి, తమ సంఘాల్లో వారు పనిచేసే విధంగా చేస్తున్నారన్నారు. విద్యార్థిసంఘాల ఉచ్చులో పడిన నిరుద్యోగ యువతపై ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు నమోదుచేశామన్నారు. ఎవరైనా క్రిమినల్ కేసుల్లో ఒకసారి నిందితులుగా చేరితే, వారి భవిష్యత్తు నాశనమైనట్లేనని, భవిష్యత్తులో వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు ఎంపికై నా క్రిమినల్ కేసుల కారణంగా ఉద్యోగాలు పొందే అవకాశాలను కోల్పోతారని స్పష్టం చేశారు. ఉద్యోగాలు సాధించడానికి ఏకాగ్రత, అంకితభావం, క్రమశిక్షణతో, నిరంతర సాధన చేయాలని, నిరుద్యోగయువతకు ఎస్పీ పిలుపునిచ్చారు. -
దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సహకారంతో 350 మంది దివ్యాంగులకు కృత్రిమ ఆవయవాలు, ఉపకరణాలను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ముందుగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. దివ్యాంగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.కృత్రిమ అవయవాల తయారీ విధానాన్ని ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు సమగ్రంగా వివరించారు. అనంతరం రఘురాం మాట్లాడుతూ గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగుల సేవలో పరితపిస్తోందన్నారు. వారికి నడక నడత నేర్పి ఎంతో సహకారం చేస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులకు ఉచితంగా ట్రైసెకిల్స్, పోలియో కాలిపవర్స్, చెవిటి మిషన్లు, వీల్‌చైర్స్, వాకింగ్ స్టిక్స్‌ను అందజేశారు. అనంతరం పలువురు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. -
29న ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు
● పాఠశాలల్లో పారదర్శకంగా నిర్వహించాలి ● డీఈఓ మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: జిల్లాలోని 1,767 ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల పునర్వ్యవస్థీకరణ ఎన్నికలను ఈ నెల 29న సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అఽధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త యూ.మాణిక్యం నాయుడు ఆదేశించారు. కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఎస్ఎంసీ మార్గదర్శకాలు–2026 ఆధారంగా రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఇదీ.. మంగళవారం ఉదయం 10గంటలకు ఎస్ఎంసీ సభ్యులు, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల నోటీసు బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన. 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితా ఖరారు చేసి ప్రదర్శన. 29న ఉద యం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎస్ఎంసీ సభ్యుల ఎన్నికలు. మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం. 3 నుంచి 3.30 గంటల వరకు నూతన ఎస్ఎంసీ తొలి సమావేశం నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా డిప్యూటీ ఈఓలు, సెక్టోరిల్ అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు అవసరమైన సమాచారం అందించాలని డీఈఓ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. పాఠశాల పర్యవేక్షణ, మెరుగైన యాజమాన్యం, విద్యార్థులకు మెరుగైన వాతారణం కల్పించడంలో ఎస్‌ఎంసీల పాత్ర కీలకమని పేర్కొంటూ కమిటీల ఏర్పాటును ప్రోత్సహించాలని మండల స్థాయి విద్యాశాఖ ఆధికారులకు సూచించారు. -
భూసేకరణను వేగవంతం చేయాలి
● పారిశ్రామిక ప్రాజెక్టులకు సకాలంలో భూములు అప్పగించాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డివిజయనగరం గంటస్తంభం: జిల్లాలో వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా భూముల వివరాలు, అవార్డు ప్రక్రియ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలను పరిశీలించారు. నోటిఫికేషన్లు, సర్వేలు, రికార్డుల ధ్రువీకరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని అంబటివలస రిషి డెకర్స్, ఆంధ్ర కార్న్ ప్రొడక్ట్స్, కాపుసంబం ఎంఎస్ఎంఈ పార్కు, మరుపల్లి అన్షుమి ఇండస్ట్రియల్ పార్కు, శ్రీరాంపురం మై వీడు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్, ఆకులకట్ట ఫుడ్ పార్కు తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని సమీక్షించారు. కాపుశంభాం ఎంఎస్ఎంఈ పార్కు పనులకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఐపీబీ పరిధిలో రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రాజెక్టుకు భూమి అప్పగించి పనులు ప్రారంభించినందుకు అధికారులను అభినందించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
విజయనగరం గంటస్తంభం: ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అర్హులకు ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్‌తో కలిసి కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షించారు. మార్చి 2027 నాటికి రీ–సర్వే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, అక్టోబర్ 2026 నాటికి పాసుపుస్తకాల పంపిణీని వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, హౌసింగ్ పీడీ మురళి, సర్వే ఏడీ విజయకుమార్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ ● అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలి విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుమన్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించకపోవడం, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులను సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నవంబర్ 15న ఎన్ఎంఎంఎస్ఎస్ రాతపరీక్ష పార్వతీపురం రూరల్: జాతీయ ప్రతిభ ఆధారిత పేదరిక నిర్మూలన ఉపకార వేతన పథకం (ఎన్ఎంఎంఎస్ఎస్) రాతపరీక్ష ఈ ఏడాది నవంబర్ 15న జరగనుందని డీఈఓ పి.బ్రహ్మాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడో తరగతిలో 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం) సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండి, తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున ఎస్బీఐలో చెల్లించాలి. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఆసక్తిగల విద్యార్థుల దరఖాస్తు చేసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. నిలకడగా తోటపల్లి నీటి ప్రవాహం గరుగుబిల్లి: అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న వర్షాల నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి 105 మీటర్లకు 104.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 3,570ల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తేసి 4,706 క్యూసెక్కుల నీటిని తిరిగి నదిలోకి విడిచిపెడుతున్నారు. కుడి ప్రధాన కాలువకు 800, పాతకుడి కాలువకు 40, ఎడమ కాలువకు 414 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ కిశోర్ తెలిపారు. -
పీటీసీలో స్పోర్ట్స్‌మీట్ ప్రారంభం
విజయనగరం టౌన్: శారీరక దృఢత్వాన్ని పెంపొందించేవి క్రీడలని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, సమయపాలన, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పీటీసీ ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న 473 మంది మహిళా కానిస్టేబుల్స్‌కు రెండు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్‌ను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండాలన్నారు. శారీరక దారుఢ్యం ప్రతి పోలీసు అధికారికి వృత్తిపరమైన బాధ్యతగా భావించాలని సూచించారు. ఓటమి అంతిమం కాదని, అది మరింత మెరుగ్గా ఎదగడానికి ఒక అవకాశమన్నారు. ప్రతి పోటీ నుంచి ఒక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డి.కోటేశ్వరబాబు, డీఎస్పీలు పి.రమేష్, ఎం.చంద్రశేఖర్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, కళాశాల సిబ్బంది, శిక్షణ అధికారులు, మహిళా కానిస్టేబుల్ శిక్షణార్థులు పాల్గొన్నారు. పాల్గొన్న 473 మంది శిక్షణ కానిస్టేబుల్స్ -
● చంద్రబాబు టక్కుటమారాలు విజయనగరంలో చెల్లవు
చంద్రబాబు టక్కుటమారా విద్యలు విజయనగరంలో చెల్లవు. బొత్స అంటే ఒక బ్రాండ్. ఎంతోమంది సమస్యలను పరిష్కరించే నాయకుడికి ఇబ్బందిపెట్టాలనుకోవడం అవివేకం. బొత్స సత్యానారయణ నాయకత్వంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ చెక్కు చెదరదు. 23 మంది ఎమ్మెల్యేలను 2014–19 మధ్య చంద్రబాబు దొడ్డిదారిన చేర్చుకున్నా భయపడలేదు. పార్టీ జిల్లాస్థాయి సమావేశానికి అధిక సంఖ్యలో హాజరుకావడం జగన్మోహన్రెడ్డిపై ఉన్న నమ్మకానికి అద్దంపడుతోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, ఎంపీపీ, ఎంపీటీసీ, వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం. ఇంటింటికీ వెళ్లి వెన్నుపోటు టీడీపీ నిజస్వరూపాన్ని చెబుదాం. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, వైఎస్సాసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ -
జాతీయ లోక్ అదాలత్ సక్సెస్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ● అదాలత్‌లో 7051 కేసులు పరిష్కారంవిజయనగరం లీగల్; రాజీయే రాజ మార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌కు హాజరై న్యాయమూర్తి మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయం, డబ్బు వృధా కాకుండా వారి జీవితాలలో ప్రశాంతత కలిగి ఉంటారన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని కోర్టులైన విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 7051 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. వాటిలో సివిల్ కేసులు 162, క్రిమినల్ కేసులు 6866, ప్రీ లిటిగేషన్ కేసులు 23 ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 9,73,16,602 లక్షల రూపాయలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. జాతీయ లోక్ అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు సీనియర్ న్యాయవాదులు పీఏఎన్ రాజు, పంపాన రవికుమార్, కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి చైర్మన్ దుర్గయ్య, కుటుంబ న్యాయ స్థానం అదనపు జిల్లా న్యాయమూర్తి ఓ.విజయ కళ్యాణి, బి.అప్పలస్వామి, నాల్గవ శ్రేణి అదనపు న్యాయమూర్తి, శ్రీధర్, సీనియర్ సివిల్ జడ్జి రమేష్‌నాయుడు, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి బుజ్జి, మొబైల్ కోర్ట్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ఖతేజా చక్రవర్తి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, ఇజి.శ్రీ విద్య, మూడవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, నలితం రమేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లాన రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, కోర్టు సిబ్బంది, వివిధ శాాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, న్యాయ వాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
‘బాల సంజీవని’ టెండర్లలో అవకతవకలు
● బాల సంజీవని టెండర్లలో గోల్‌మాల్‌పై స్వతంత్ర విచారణ జరపాలి విజయనగరం గంటస్తంభం: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే బాల సంజీవని పథకాన్ని కొద్ది మంది బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు పరిమితం చేయడం సరికాదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ విమర్శించారు. బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ టెండర్లలో జరిగినట్టు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీపీఐ నాయకులతో కలిసి కలెక్టరేట్లో డీఆర్ఓ, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 జిల్లాలను నాలుగు యూనిట్లుగా విభజించి నిర్వహించిన టెండర్ల మొత్తం వార్షిక విలువ సుమారు రూ.172.80 కోట్లు కాగా, కిట్ ధరలు పెరిగాయని తెలిపారు. ట్రైబల్ కిట్ఽ ధర రూ.350 నుంచి రూ.446కు, సాధారణ కిట్ ధర రూ.241 నుంచి రూ.283.19కు పెరగడం వల్ల సుమారు రూ.29.22 కోట్ల మేర అదనపు ప్రజాధనం భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని కోరారు. టెండర్ నిబంధనల్లో సొంత తయారీ యూనిట్, ఫుడ్ సేప్టీ లైసెన్స్, ఉత్పత్తి సామర్థ్యం వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తయారీ యూనిట్లు లేని సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో అనర్హతకు గురైన సంస్థలకు తిరిగి ఎలా అర్హత కల్పించారో విచారించాలన్నారు. పలువురు బిడ్డర్లు ఒకే ధరను కోట్ చేయడం వంటి అంశాలపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. జోన్ విధానాన్ని రద్దు చేసి జిల్లా వారీగా టెండర్లు నిర్వహించాలని, డ్వాక్రా సంఘాలు, మహిళా స్వయం సహాయక గ్రూపులకు పథకాన్ని అప్పగించాలని అశోక్ డిమాండ్ చేశారు. టెండర్లపై ఆర్థిక ఆడిట్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు పొందురూ అప్పలరాజు, బూర వాసు పాల్గొన్నారు. -
21 వరకు మద్యం దుకాణాలకు రెన్యువల్ గడువు
విజయనగరం రూరల్: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ ఈ నెల 21 వరకు చేపట్టనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి, ఎకై ్సజ్ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బొగ్గులదిబ్బ వద్దనున్న పట్టణ ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి ఆధ్వర్యంలో మద్యం లైసెన్స్‌దారులతో దుకాణాల రెన్యువల్ ప్రక్రియపై శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాసచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 21 సాయంత్రం 5 గంటలలోపు మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆలోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు ఈ ఏడాది మద్యం దుకాణాల రెన్యువల్‌కు ప్రభుత్వం జీవో 579 జారీ చేసిందని వివరించారు. ఈ జీవోను అనుసరించి జిల్లాలో ఓపెన్ కేటగిరి, గీత కార్మికులకు సంబంధించి మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 153 మద్యం దుకాణాలు ఉండగా, గీత కార్మికులకు సంబంధించి 16 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. 50 వేల జనాభా కలిగిన ప్రాంతాల్లోని 17 ఓపెన్ కేటగిరి మద్యం దుకాణాలకు వార్షిక రుసుం రూ. 60.50 లక్షలు, ఆర్ఈటీ రెన్యూవల్ ఫీజు రూ.23 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.88.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 136 ఓపెన్ కేటగిరి దుకాణాలకు వార్షిక ఫీజు రూ.71.50 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.27.20 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.1.06 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని గీత కులాల మద్యం దుకాణాలకు జనాభా ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించినట్టు తెలిపారు. 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలకు వార్షిక ఫీజు రూ.30.30 లక్షలు, ఆర్ఈటీ రెన్యువల్ ఫీజు రూ.11.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.46.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షలలోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 14 దుకాణాలకు వార్షిక ఫీజు రూ.35.80 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.13.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.56.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత లైసెన్స్‌దారులు ఈ నెల 21లోపు రెన్యువల్ చేసుకోవాలని ఆయన తెలిపారు. రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలకు ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఈ నెల 30న లాటరీ విధానం ద్వారా అర్హులైన వారికి మద్యం దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను లైసెన్స్‌దారులు పూర్తిగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధికారి ఎస్.దొర, జిల్లాలోని వివిధ స్టేషన్ల సీఐలు, ఏ – 4 దుకాణాల లైసెన్స్‌దారులు పాల్గొన్నారు. -
ప్రతీ స్థానంలో పోటీచేద్దాం.. విజయపతాకం ఎగురవేద్దాం
విజయనగరం: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని, ప్రతి స్థానంలో పోటీ చేసి విజయపతాకం ఎగురవేద్దామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరంలోని పూలబాగ్ జగన్నాథ ఫంక్షన్ హాల్లో శనివారం వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రానున్న రోజుల్లో పార్టీ పటిష్టత, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎదుర్కోవడం, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోతం, నూతనంగా నియామకమైన పార్టీ కమిటీలు అనుసరించాల్సిన విధి, విధానాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు దివంగతముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం జిల్లా స్థాయి నాయకులకు పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డులను అందజేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, శోభా హైమావతి, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గొర్లె రవికుమార్, శంబంగి వేణుపాల్, సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు బొత్స అనూష, బొత్స సందీప్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు ఆవినాష్, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, జిల్లా పింఛన్ల విభాగం అధ్యక్షుడు డోలా మన్మథకుమార్, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, పార్టీ నాయకులు వేచలపు చినరామునాయుడు, రొంగలి జగన్నాథం, గులుపల్లి గణేష్, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, తదితరులు పాల్గొన్నారు. పార్టీయే ప్రధానం రాజకీయాల్లోకి వ్యక్తులు వస్తుంటారు.. వెళ్లిపోతుంటారు. పార్టీయే ప్రధానంగా ప్రజల కోసం పనిచేద్దాం. వక్రబుద్ధితో వ్యాపారాలు, వ్యవహారాలు నడిపితే కొంపముంచుకున్న వారిగా మిగులుతారు. విలువలు కోల్పోయి, నైతికంగా దిగజారిపోతే ఎంతటికై నా తెగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం. పార్టీ ఇచ్చేది గుర్తింపు కార్డు కాదు.. నాయకులకు భరోసా. రాష్ట్రంలో జరుగుతున్న దురాగత పాలనను ఎదుర్కొనేందుకు జగనన్న సైనికులుగా గట్టిగా నిలబడదాం. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీల్లో జగనన్న సైన్యంగా చేరడం శుభపరిణామం. సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అందరికీ సమాజంలో మంచి గుర్తింపు లభించేలా సముచిత స్థానం కల్పిస్తారు. జిల్లా స్థాయి సమావేశానికి వచ్చిన వారంతా పార్టీపై నమ్మకంతో వచ్చిన వారే. స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఎంపిక అందరి ఆమోదంతో చేయాలి. రెండున్నరేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనను ప్రజలకు వివరించాలి. పింఛన్ల దరఖాస్తుల నమోదులో వివక్షపై ప్రచారం చేయాలి. చంద్రబాబు తన ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తారే తప్ప ప్రజాసంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోరు. ఆయన పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే మనల్ని విజేతలుగా నిలుపుతుంది. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత ‘స్థానిక’ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు జిల్లా వ్యాప్తంగా జగనన్న సైనికులకు గుర్తింపు కార్డులు అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీలోని సభ్యులకు సముచిత స్థానం శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ -
తోటపల్లికి నీటి తాకిడి
గరుగుబిల్లి: తుఫాన్ ప్రభావంతో ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 104.25 మీటర్లగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యారేజీకి 8,497 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా మూడు గేట్లును ఎత్తి 7,691 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువకు 800 క్యూసెక్కులు, పాత కుడి కాలువకు 40, పాత ఎడమ కాలువకు 414 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మట్టి వినాయకుడినే పూజించాలి విజయనగరం గంటస్తంభం: వినాయక చవితిని పర్యావరణహితంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలను నివారించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని, ప్రభుత్వ మార్గదర్మకాలు పాటించాలని కోరారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్షించారు. -
ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ
● ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో వక్తలువిజయనగరం: ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన ఆరో జిల్లా మహాసభలు శనివారం జరిగాయి. ఇందులో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిజం వృత్తి సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు పెన్షన్ తదితర సంక్షేమ పథకాలు సాధించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ ముందుంటుందన్నారు. డీపీఆర్ఓ పి.గోవిందరాజులు, రాష్ట్ర నాయకులు ఎన్.మధుసూదనరావు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి భీమారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శివకేశవనాయుడు, అప్పారావు ఎన్నికయ్యారు. -
కనులపండువగా కోడూరుమాత యాత్ర
బాడంగి: మండలంలోని కోడూరు గ్రామంలో కోడూరుమాత యాత్ర శనివారం వైభవంగా సాగింది. వేలాది మంది భక్తులు కోడూరు మాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. దివ్యబలిపూజల్లో పాల్గొన్నారు. విశాఖ అగ్రపీఠం చాన్సలర్ జొన్నాడ జ్ఞానప్రకాష్, దుగ్గుంపూడి బాలసౌరి తదితర గురువులు వినిపించిన శాంతి సందేశాలను శ్రద్ధగా ఆలకించారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా బొబ్బిలి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించారు. భక్తులకు వీలుగా ఆర్టీసీ అధికారులు శ్రీకాకుళం, పాలకొండ, సాలూరు, పార్వతీపురం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. పండగ విజయవంతంగా ముగియడంపై కోడూరు చర్చి ఫాదర్ పీటర్ సింహాచలం సంతోషం వ్యక్తంచేశారు. -
మరీ ఇంత అన్యాయమా..!
కూటమి నాయకులను కలిస్తేనే... ముకుందపురం గ్రామానికి చెందిన 11 మంది వివిధ పింఛన్లకు అర్హులుగా ఉన్నారు. ఇందుకోసం ఐదు రోజుల కిందటే సచివాలయానికి దరఖాస్తుతో పాటు అన్ని వివరాలు అందజేశారు. కాని ఇంతవరకు ఆన్లైన్ చేయలేదు. కూటమి నాయకులను కలిస్తేనే ఆన్లైన్ చేస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం. – గడే రామారావు, వైఎస్సార్సీపీ నాయకుడు, ముకుందపురంసంతకవిటి: అర్హులైన వారందరూ కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు గడువు తక్కువగా ఇచ్చి, లేనిపోని నిబంధనలు పెట్టినప్పటికీ అర్జీదారులు అష్టకష్టాలు పడి దరఖాస్తులను ఆన్లైన్ చేయించుకునే పనిలో ఉన్నారు. అయితే మండలంలోని మోదుగులపేట సచివాలయ సిబ్బంది మాత్రం అర్జీదారుల దరఖాస్తులను ఆన్లైన్ చేసే పనిలో మెతకవైఖరి కనబరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయ పరిధిలోని ముకుందపురానికి చెందిన 11 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరుల దరఖాస్తులను శుక్రవారం సాయంత్రం వరకు ఆన్లైన్ చేయలేదు. శనివారం సెలవు రోజు అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ సచివాలయానికి వచ్చి కొందరి దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ముకుందపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు గడే రామారావు, గడే మల్లేశ్వరరావు, తదితరులు సచివాలయానికి చేరుకుని, తమవారి దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేయాలని పట్టుబట్టారు. దీంతో డిజిటల్ అసిస్టెంట్ స్పందిస్తూ.. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి, మాకు ఫోన్లు వస్తున్నాయని రుసురుసలాడారు. దీంతో నాయకులు స్పందిస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదారులైనంత మాత్రాన వారి దరఖాస్తులను ఆన్లైన్ చేయరా అని ప్రశ్నించారు. గడే త్రినాథ, సూర్యారావు, పాపినాయుడు, కురిటి పారయ్య, కురిటి రమణ, పిన్నింటి తవుడు, గడే తవిటినాయుడు, కురిటి కళావతి, లోలుగు విజయకుమారి, కురిటి రామలక్ష్మి, గడే జ్యోత్స్నలకు సంబంధించిన దరఖాస్తులను ఎందుకు ఆన్లైన్ చేయరో చెప్పాలని కార్యదర్శిని నిలదీశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేయడంతో కార్యదర్శి స్పందిస్తూ.. మంగళవారం నాడు అందరి దరఖాస్తులూ ఆన్లైన్ చేయిస్తానని చెప్పడంతో అర్జీదారులు, వైఎస్సార్సీపీ నాయకులు శాంతించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి భవానీశంకర్ వద్ద ప్రస్తావించగా.. సర్వర్ డౌన్ అవ్వడంతో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, మంగళవారం నాటికి అన్ని దరఖాస్తులు ఆన్లైన్ చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పింఛన్ దరఖాస్తులు ఆన్లైన్ చేయని వైనం కూటమి నాయకులను కలిస్తేనే చేస్తామంటున్న సిబ్బంది నిలదీసిన వైఎస్సార్సీపీ నాయకులు -
● కార్యకర్తలే పార్టీకి బలం
కార్యకర్తలే పార్టీకి బలం. వారు బలంగా ఉన్నంత వరకు పార్టీని ఎవరూ టచ్చేయలేరు. చంద్రబాబుకు మొదటి నుంచి కుటుంబాల మధ్య చిచ్చు పెట్డడం, విడగొట్టడం అలవాటు. పిల్లనిచ్చిన సొంతమామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్నో కుటుంబాలను విడగొట్టాడు. ప్రజా నాయకుడు బొత్స సత్యనారాయణ. ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దిన బొత్స ఓ రాజకీయ విశ్వవిద్యాలయం వంటి వారు. స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా విజయకేతనం ఎగురవేద్దాం. 2029 ఎన్నికల్లో విజయనగరంలో టీడీపీకి సమాధి కట్టడం ఖాయం. రెడ్‌బుక్ పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లు కుమిలికుమిలి ఏడ్చేరోజు వస్తుంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
పణుకువలస వంతెనపై.. వాహన రాకపోకలు బంద్
● వంతెనకు ఇరువైపులా గోడల నిర్మాణం ● శిథిలమైన వంతెనను పరిశీలించిన ఆర్అండ్బీ, పోలీస్ అధికారులు తెర్లాం: రాజాం – రామభద్రపురం ఆర్అండ్బీ రోడ్డులో మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వాహనాల రాకపోకలను శనివారం ఉదయం నుంచి ఆర్అండ్బీ, పోలీస్ అధికారులు పూర్తిగా నిషేధించారు. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వంతెనను మండల ఆర్అండ్బీ ఏఈ రాజు తన సిబ్బందితో పరిశీలించి వంతెన ప్రమాదకరంగా ఉందని, ఎప్పుడైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో వంతెన పైనుంచి రాకపోకలు సాగించే వాహనాలు వెళ్లకుండా పూర్తిగా బంద్ చేశారు. వంతెన పైనుంచి వాహనాలు రాకుండా ఉండేలా వంతెనకు ఇరువైపులా రోడ్డు మధ్యలో సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టారు. వంతెన మీదుగా వాహనాలు, ప్రయాణికులు వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీస్ అధికారులు వంతెనకు రెండు వైపులా స్టాఫర్లు, ఇసుకతో నింపిన డ్రమ్ములు ఏర్పాటు చేశారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
గుమ్మలక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన రాష్ట్ర రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పార్వతీపురం మన్యం జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, పత్తిక చంద్రమోహన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా జిల్లా నుంచి పాల్గొన్న 50 మంది క్రీడాకారుల్లో 18 మంది గోల్డ్ మెడల్స్‌ను, 20 మంది సిల్వర్ మెడల్స్‌ను, 12 మంది కాంస్యం మెడల్స్‌ను పొందారని తెలిపారు. పైడితల్లి జాతరలో 21 పనులకు టెండర్ల ఆహ్వానం విజయనగరం క్రైమ్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీ పైడితల్లి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు దేవదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష శనివారం తెలిపారు. సిరిమాను సంబరం, తొలేళ్ల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏర్పాటు పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. చదురగుడి, వనంగుడులలో ఎలక్ట్రికల్ పనులు, చలువ పందిళ్లు వేయటానికి, క్యూ లైన్లు, వనంగుడిలో ఆర్చి, లడ్డూ ప్రసాదం తయారీ వంటి 21 పనులు చేయించేందుకు ఈ నెల 16వ తేదీలోపు టెండర్లను దేవదాయ శాఖ కోరుతోందని ఈఓ శిరీష తెలిపారు. వివిధ రకాల పనులు, వాటి వ్యయాల బట్టి, వంద నుంచీ యాభై వేల రూపాయల వరకు దేవస్థానం పేరుతో డీడీ తీసి టెండర్‌కు జతపరచి బాక్స్‌లో వేయాలని తెలిపారు. కార్మికుడి మృతి కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి గ్రామ సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లోయిస్ కర్మాగారంలో అస్వస్థతతో కాంట్రాక్టు కార్మికుడు చింత గౌరినాయుడు (45) శనివారం మృతి చెందాడు. దీనికి సంబంధించి సీఐ టి.వి.విజయకుమార్ తెలిపిన వివరాలు.. వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన మృతుడు చింత గౌరినాయుడు శారడ కర్మాగారంలో చిన్నారావు అనే లేబర్ కాంట్రాక్టర్ వద్ద గత కొద్ది కాలంగా రాయి కొట్టే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే శనివారం పనికి వచ్చి మధ్యాహ్నం భోజనం అనంతరం ఒంట్లో నలతగా వుందని తోటి కార్మికులకు చెప్పి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలోనే వాంతులు చేసుకోవడంతో తోటి కార్మికులు గమనించి వెంటనే కొత్తవలసలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. బాలింత..సీతంపేట: మండలంలోని శిలిగాం గ్రామానికి చెందిన ఐదు నెలల బాలింత కె.రేణుక (36) శనివారం శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బీపీ పూర్తి స్థాయిలో పడిపోవడంతో ప్రాధమిక చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. రేణుక అంగన్వాడీ హెల్పర్‌గా పని చేస్తుంది. ఐదు నెలల కిందట కుమార్తెకు జన్మనిచ్చింది. ఈమె మృతితో భర్త కిషోర్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతి మెరకముడిదాం : మండలంలోని బిళ్లలవలస గ్రామంలో శనివారం రామాలయం వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మృతి చెందిన మహిళ బిళ్లలవలస గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ వుండేదని, హిందీలో మాట్లాడేదని, ఎవరు తినేందుకు ఏమి పెట్టినా తినేది కాదని గ్రామస్తులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున రామాలయం వద్ద విగత జీవిగా పడి వుందని తెలిపారు. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో బుదరాయవలస ఎస్ఐ తన సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలు ఎక్కడ నుంచి వచ్చింది.. ఏ ప్రాంతానికి చెందినది అన్న వివరాలు తెలియరాలేదు. దీంతో గ్రామస్తులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. -
● 50 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైంది
● చంద్రబాబుది మోసపూరిత పాలన ● పట్టుదలతో పని చేయాలి ● పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం చంద్రబాబు ప్రభుత్వంలో వెనుకబడిన గిరిజనుల సంక్షేమం పట్టకుండా పోయింది. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడదాం. వారి సమస్యలపై పోరాటం చేద్దాం. వెన్నుపోటు పార్టీ చేస్తున్న మోసాలను ఇంటింటికీ వెళ్లి వివరిద్దాం. స్థానిక ఎన్నికల్లో విజయం దక్కించుకుందాం. – పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత పాలన. సూపర్‌సిక్స్ అట్టర్‌ప్లాప్ అయ్యింది. రెండున్నరేళ్లుగా పింఛన్లు లేవు. నిరుద్యోగ భృతిలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500 ఇవ్వడంలేదు. బియ్యం, నిత్యవాసరాల ధరలు పెరిగిపోయాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, పార్టీని గెలిపించుకుందాం. – కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మోసకారి పాలనకు అడ్డుకట్ట వేయడంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా తీసుకోవాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో పని చేయాలి. ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యం కావాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. – శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి 2029 ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హమీలు, అసత్య ప్రచారాల కారణంగా ఓటమి పాలయ్యాం. గతంలో ఇలాంటి పరిస్థితిని చూశాం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఏకతాటిపై పని చేద్దాం. బొత్స సత్యానారాయణ నాయకత్వంలో వైఎస్సార్సీపీ విజయం కోసం కృషి చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం. – కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్.కోట మోసపూరిత హమీలతో కూటమి నేతలు గద్దెనెక్కారు. వాటిని అమలు చేయకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నడుచుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిక్కడు దొరకుడు అన్న చందంగా తిరుగుతున్నారు. నారా లోకేశ్ రక్తచరిత్ర చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాళ్లగే మోసగాడులా పాలన సాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒట్టేసిఒక మాట ఓట్టేయకుండా ఓ మాట చెప్పనన్న చందంగా పాలన సాగిస్తే... కూటమినేతలు ఇచ్చిన హమీలను విస్మరించి పాలన సాగిస్తున్నారు. – డాక్టర్ తలే రాజేష్, నియోజకవర్గ సమన్వయకర్త, రాజాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పాలనను, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో తేడాలను ప్రజలకు వివరించాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇచ్చిన హమీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతూ పబ్బంగడుపుతోంది. ప్రజలంతా వైఎస్సార్‌షీపీ వైపే చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పార్టీకి పూర్వవైభం తీసుకొద్దాం. – డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్సీ ఏ రంగంలోనైనా గెలుపు ఇచ్చే గౌరవం వెలకట్టలేనిది. ప్రధాన రాజకీయాల్లో విజయం సాధించిన వారికి దక్కే గౌరవ మర్యాదలు చెప్పనక్కర్లేదు. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలకు ఆయా స్థాయిల్లో అధికారులు, ప్రజలు మర్యాద ఇస్తారు. అది సాధించుకోవాలంటూ కష్టపడి పనిచేయాలి. స్థానిక సమరానికి సన్నద్ధం కావాలి. కూటమి ప్రభుత్వం మోసాలను, అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. – బడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, నెల్లిమర్ల బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పని చేస్తోన్న వైఎస్సార్సీపీలో రానున్న రోజుల్లో కార్యకర్తలకే పెద్ద పీట వేస్తాం. ఇప్పుడు నియమించిన గ్రామ కమిటీల్లోని సభ్యులతోనే పాలన సాగుతుంది. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ఏకై క లక్ష్యం కావాలి. ప్రజల కూడా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నారు. ఓటుతో తమ వ్యతిరేకతను చూపిస్తారు. – బొత్స అప్పనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం -
టిప్పరు దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో నాగావళి తీరంలో గల ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తరలించేందుకు సిద్ధం చేసిన టిప్ప రు శనివారం దగ్ధమైంది. విజయనగరానికి చెందిన ఈ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పాలకొండ ఆగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి జామి సర్వే శ్వరరావు శకటంతో సహా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో వాహనం క్యాబిన్, తొట్టె పూర్తిగా కాలిపోయాయని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సదరు వాహన యజమాని రాగోలు సత్యనారాయణ మాట్లాడుతూ రూ.10 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు వాపోయారు. -
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
ఓ బొజ్జ గణనాథుడా.. రావయ్యా..రా.. ఏటా ఖరీఫ్ ప్రారంభించి నాట్లు పడిన వెంటనే నువ్వు వస్తావని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లం. వర్షాలు అనుకూలించి పంటలు ఆశాజనకంగా ఉన్న వేళ ఆనందంతో నీ ఉత్సవాలు వైభవంగా చేసి, ఇష్టంగా కొలిచి, నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకం, పప్పుబూరెలు నైవేద్యంగా పెట్టేవాళ్లం. వాటిని ఆరగించి, మూసిక వాహనంపై ప్రయాణిస్తూ భక్తులకు వరాలు కురిపించేవాడి. ఈ ఏడాది వర్షాలు లేవు. వరినాట్లు సరిగ్గా పడలేదు. ఎరువుల కొరత, అధిక ధరలు. ఏమీ చేయాలో తోచని పరిస్థితి. ఈ తరుణంలో నీకు కష్టాలు చెప్పుకుందామనుకునేలోపే నిన్ను పిలవడానికే బాధేస్తుంది. వినాయక చవితికి వచ్చే నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకాలు పెట్టలేని స్థితి ఏర్పడింది. బెల్లం ధర అమాంతంగా పెరిగిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.45లు ఉండే బెల్లం ధర ఇప్పుడు రూ.80 పలుకుతోంది. పప్పుల, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా మొర నువ్వైనా వింటావా.. గతంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతీ ఇంటికి నగదుసాయం అందేది. ఇప్పుడు ఏ సాయం లేదు. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. బెల్లానికి బదులు పంచదారతో ఉండ్రాళ్లు చేద్దామంటే పంచదార సైతం కిలో రూ.75లు పలుకుతోంది. కందిపప్పు కిలో ధర రూ.140లు పైబడి ఉంది. గతంలో రేషన్ దుకాణాల్లో పండగ సమయాల్లో బెల్లం, పంచదార, కందిపప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవు. మేం ఎలాగూ కొనలేం... తినలేం. నీకు నైవేద్యం పెడదామన్నా ధరలు తట్టుకోలేకపోతున్నాం. పోనీ ఉత్తి బియ్యిం పిండి ఉండ్రాలు పెడదామంటే బియ్యం కిలో ధర రూ.60లు నుంచి రూ.70లు ఉంది. ఈ ధరాఘాతంలో మేం ఎలా బతికేది. మా మొర విని, ఈ ఏడాది నీ బొజ్జ నిండేట్టు పెట్టలేని మా బతుకులకు ఆర్థిక భరోసా కల్పించే కొత్త ఆసరా ఇవ్వ తండ్రీ. ఇట్లు.. గట్టిగా పిలవలేక పిలుస్తున్న నీ భక్తులు – రాజాం -
విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు
విజయనగరం టౌన్: విఘ్న నాయకునికి పూజలు నిర్వహించే వారంతా విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు జిల్లా పోలీసు శాఖ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టింది. అడుగడుగునా ఆయా స్టేషన్ల పరిధిలో ప్రతి పోలీస్ ఉద్యోగి సమాచారాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. నిఘా నేత్రంతో నిశిత పరిశీలన చేస్తోంది. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలను కోరింది. నిబంధనలు పాటించాలని పేర్కొంది. మండపాలు ఏర్పాటు చేసే వారందరూ సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతులకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మండపం వద్ద ఎల్లప్పుడూ నిర్వహకులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మండపం వద్ద అగ్నిమాపక పరికరాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి. అత్యవసర సమయాల్లో ప్రజలు మండపం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం ఖాళీగా ఉంచాలి. సాధ్యమైన చోట మండపం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పనిచేసే స్థితిలో ఉంచాలి. లౌడ్ స్పీకర్లు, డీజేలు ఉపయోగించేటప్పుడు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. విగ్రహ ఊరేగింపు నిర్వహించే ముందు పోలీసు శాఖకు సమాచారమందించి, వారు సూచించిన మార్గం, సమయాన్ని మాత్రమే పాటించాలి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి వినాయక మండపానికి నిర్వహకులు ఒక బాధ్యత గల వ్యక్తిని నోడల్ పర్సన్‌ను నియమించాలి. మొబైల్ నెంబర్, పూర్తి వివరాలను సంబంధిత పోలీసుస్టేషన్‌కు ముందుగానే అందజేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దు అసాంఘిక కార్యకలాపాలకు తావీయ్యొద్దు అడుగడుగునా నిఘా నేత్రం : ఎస్పీ దామోదర్ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరి మనోభావాలు దె దెబ్బతినకుండా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటూ ప్రత్యేకంగా నిఘా నేత్రంతో పరిశీలన చేస్తుంటుంది. మండపాలకు అనుమతులు తప్పనిసరిగా ఉచితంగా తీసుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అనుమానాస్పద పరిస్థితులు తలెత్తినా వెంటనే డయల్ 112/100కి సమాచారమివ్వాలి. – ఏఆర్ దామోదర్, ఎస్పీ -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
విజయనగరం: వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈనెల 12న ఉదయం 10 గంటలకు నగరంలోని పూల్‌బాగ్ జగన్నాథ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తామని పార్టీ జిల్లా కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శలు, పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ కమిటీ సభ్యులు, నియోజకవర్గ/మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల సభ్యులు, పార్టీ కమిటీలలో వివిధ హోదాల్లో ఉన్న సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, సోషల్ మీడియా సైనికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది. నేడు జాతీయ లోక్ అదాలత్ విజయనగరం లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబందిత కేసులు, సివిల్ కేసులతో పాటు, ఇతర కేసులను సైతం పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఫూల్‌బాగ్ కాలనీ హనుమాన్ నగర్‌లోని ఎంఆర్వీఆర్జీఆర్పీజీ బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలోని నూతన కోర్టు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే కార్యక్రమాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ విజయనగరం గంటస్తంభం: వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన ‘మట్టి వినాయకుడు పర్యావరణ పరిరక్షణకు మన వంతు’ పోస్టర్లు, కరపత్రాలను శుక్రవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈఈ సరిత మాట్లాడుతూ, పీవోపీ విగ్రహాలు, రసాయన రంగులకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. -
గిరిజనులకు అన్యాయం చేస్తారా?
● పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి రామభద్రపురం: చంద్రబాబు ఇచ్చేయమంటే దశాబ్దాల కాలంగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూములు స్వాధీనం చేసుకుని పరిశ్రమల పేరిట పెత్తందార్లకు కట్టబెట్టి గిరిజనులకు అన్యాయం చేసేస్తారా? అని పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మండలకేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామభద్రపురం మండలంలోని కాకర్లవలస వద్ద గిరిజన రైతుల పంటలను రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి నిరా్ద్క్షిణ్యంగా ధ్వంసం చేయడం ఘోరమని మండిపడ్డారు. భూమి మీద సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని, ఎంతో కాలం కష్టపడి పండించిన పంటలు పోలీసు ఫోర్స్ ఉపయోగించి దౌర్జన్యంగా ధ్వంసం చేయించిన ఆర్డీవో, తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంటలు అధికారులే ధ్వంసం చేయించి అడ్డుకున్న గిరిజన రైతులను అక్రమ అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పెత్తందార్లు ఎలా చెబితే అలా ప్రభుత్వం చేస్తే పేదల ఉసురు తగులుందన్నారు. గిరిజనులు భూములు వదిలేదిలేదని, ధ్వంసం చేసిన పంటలకు సంపూర్ణ నష్టపరిహారం అందించి న్యాయం జరిగే వరకు పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మర్రి శ్రీనివాసరావు, సీపీఎం నాయకుడు బలస శ్రీనివాసరావు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు. -
సర్వజనమృత్యు ఘోష..!
● సీతయ్య అనే 40 ఏళ్ల వ్యక్తి మెటబాలజీమ్ అనే వ్యాధితో ఈ నెల 6వ తేదీన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. 8వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ● బి.లక్ష్మి అనే 58 ఏళ్ల మహిళ ఆగస్టు 7వ తేదీన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరింది. 10వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ● 8 నెలల్లో 1070 మంది రోగుల మృతి ● చికిత్స అందించడంలో నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు మరణాలు ఇలా.. ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు నెలాఖారు నాటికి ఆస్పత్రిలో 1070 మంది మంది మరణించారు. దీనిని బట్టి వైద్యసేవల తీరును అంచనా వేయవచ్చు. ఒక్క జనవరి నెలలో అత్యధికంగా 175 మంది మరణించారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్యసేవలపై నిర్లక్ష్యం కూడా దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంలేదని పలువురు రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరిన వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. మరణాలపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహిస్తున్నాం. వైద్య సిబ్బంది అలసత్వం కారణంగా రోగి మరణించినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి విజయనగరం ఫోర్ట్: సర్వజన ఆస్పత్రిలో మృత్యుఘోష వినిపిస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం, సకాలంలో వైద్య సేవలు అందకపోవంతో అధిక మరణాలు నమోదుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. కేవలం 8 నెలల్లో 1070 మంది సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మృతిచెందినట్టు వైద్య రికార్డుల్లో నమోదుకావడం కలవరపెడుతోంది. ఆస్పత్రిలో చికిత్స అందించడంలో అలసత్వం కారణంగా అధికమంది రోగులు మృత్యువాత పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం చికిత్స అందించంలో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్కానింగ్, ఎక్స్‌రే తీయించడంలోనూ తీవ్ర జాప్యం వ్యాధి నిర్ధారణలో వైద్య సిబ్బంది అలసత్వం వహిస్తున్నట్టు రోగులు చెబుతున్నారు. సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించడంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం తీయాల్సిన స్కాన్, ఎక్స్‌రేలకు సాయంత్రం వరకు రోగులను ఉంచుతున్నారు. ఎక్స్‌రే, స్కానింగ్ రిపోర్టు వస్తేగాని చికిత్స అందించలేమని వైద్యులు చెబుతున్నారు. వైద్యసేవలు సకాలంలో అందక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని రోగుల బంధువులు కన్నీరుపెడుతున్నారు. ఆదివారం అయితే పరిస్థితి మరింత ఘోరం.. ఆదివారం అయితే రోగుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎమెర్జెన్సీ వార్డు, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యవసరమైతే సకాలంలో చికిత్స అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఆర్ఐ, సీటీస్కాన్ రిపోర్టులు రావడం లేదు. ఈ రిపోర్టులు కోసం సోమవారం వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి. రిపోర్టు రాకపోవడం వల్ల ఏ వ్యాధి తెలియకపోతే ఏ విధంగా వైద్యం చేయగలమని వైద్యులు చెబుతున్నారు. రిపోర్టుల జాప్యం వల్ల రోగుల పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. -
అంతర్ జిల్లా సాఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభం
బొబ్బిలి రూరల్: 13వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్ బాల్ పోటీలు శుక్రవారం పారాది జెడ్పీహెచ్ స్కూల్లో ప్రారంభమయ్యాయి.రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక పటుత్వం లభిస్తుందని,రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. విద్యార్ధి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తిని కనబర్చాలని, చదువుతో పాటు క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలని తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బేబినాయన, డీఈఓ మాణిక్యం నాయుడు, డీఎస్పీ గోవిందరావు ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు. -
పణుకువలసలో వణుకు..!
● ప్రమాదకరంగా వంతెన ● వాహనాల రాకపోకలు నిలిపివేత ● పరిశీలించిన రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులుతెర్లాం: రాజాం–రామభద్రపురం ఆర్ అండ్ బీ రోడ్డులో తెర్లాం మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది. వంతెనకు దక్షిణ దిక్కున ఉన్న రక్షణ గోడ, వంతెన కొంత భాగం శుక్రవారం ఉదయం పూర్తిగా కూలిపోయింది. గురువారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ఆ వర్షానికి వంతెనకు ఓ వైపు శిథిలావస్థకు గురైన రక్షణ గోడ, వంతెనలో సగభాగమంతా పూర్తిగా పడిపోయింది. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ ఆర్.ధనం, డిఫ్యూటీ తహసీల్దార్ జి.సత్యనారాయణ, ఆర్అండ్బీ ఏఈ రాజు, మాజీ ఎంపీపీ ప్రతినిధి నర్సుపల్లి వెంకటేశ్వరరావులు వెంటనే వంతెన వద్దకు వెళ్లి పరిశీలించారు. వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో మిగిలిన వంతెన భాగం కూడా ప్రమాదకరంగా మారిందని, భారీ వాహనాలు వంతెన పైనుంచి రాకపోకలు సాగిస్తే పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు ఆ వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వంతెన పైనుంచి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ప్రమాదకరంగా ఉన్న వంతెన పరిస్థితిని కలెక్టర్‌కు తెలియజేస్తానని తహసీల్దార్ ధనం తెలిపారు. పణుకువలస వద్ద ఉన్న వంతెన రక్షణగోడ ఓ పక్క పూర్తిగా పడిపోయిందని, మిగిలిన వంతెన భాగం ప్రమాదకరంగా ఉందన్న విషయాన్ని మాజీ ఎంపీపీ ప్రతినిధి వెంకటేశ్వరరావు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్ అండ్ బీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు వంతెన పరిస్థితిని ఏఈ రాజు తెలియజేశారు. వంతెన పైనుంచి భారీ వాహనాలు రాకుండా రెండు వైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు. వంతెన మీదుగా భారీ వాహనాలు రాకుండా చూడాలని పణుకువలస వీఆర్ఏను తహసీల్దార్ ఆదేశించారు. ఇబ్బందిపడుతున్న వాహన చోదకులు, ప్రయాణికులు పణుకువలస వంతెన ఓ పక్క పూర్తిగా కూలిపోవడం, వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు, కార్లు, బస్సులు ఎక్కువగా ఈ వంతెనపై నుంచి వెళ్తుంటాయి. వంతెన ప్రమాదకరంగా ఉండడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేయడంతో రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి రాజాం, శ్రీకాకుళం వైపు వస్తున్న వాహనాలు, శ్రీకాకుళం, రాజాం వైపు నుంచి సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు వస్తున్న వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీకాకుళం నుంచి సాలూరు, బొబ్బిలి వెళ్లేందుకు వస్తున్న బస్సులు పణుకువలస జంక్షన్ వద్ద నిలిపివేస్తున్నారు. సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి వస్తున్న వాహనాలు తెర్లాం జంక్షన్ వద్ద నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంత వేగంగా వంతెనకు మరమ్మతులు చేపట్టాలని, లేదా వంతెన పక్క నుంచి వాహనాలు వెళ్లేందుకు డైవర్షన్ ఇప్పించాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సోషల్ మీడియా సైనికులపై ఉందని వైఎస్సార్సీపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నా రు. విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే టీడీపీ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా శక్తివంతమైన సాధనం సోషల్ మీడియా కేవలం పోస్టులు పెట్టే వేదిక మాత్రమే కాదని, ప్రజల్లో చైతన్యం కలింగించే శక్తివంతమైన సాధనమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను వాస్తవాలతో ప్రజలకు చేరవేయాలని పార్టీ సోషల్‌మీడియా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ఎదుగుదలలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఇది బలమైన ఆయుధంగా నిలిచిందని గుర్తుచేశారు. విజయనగరం జిల్లా రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాల్లో ఒకటని, ఇక్కడ జరిగే ప్రతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రజలకు వివరించాలని, కూటమి దుష్ఫ్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బలంగా తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మేల్యే బొత్స అప్పలనరసయ్య, బొత్స అనూష, బొత్స సందీప్, రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి యూత్ వింగ్ అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు వై.వాసునాయుడు, ఎస్.కోట యూత్ వింగ్ అధ్యక్షుడు వాకాడ సతీష్ దొర, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, కెల్ల సురేష్, నియోజకవర్గాల అధ్యక్షులు కనకల కృష్ణ, ఎ.వీరస్వామి, ఎడ్ల కిశోర్, సీరాపు వంశీరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, మండలాల సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సోషల్ మీడియా సైనికులు సమర్థంగా పనిచేయాలి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ -
విద్యార్థులకు క్రీడా తరహా దుస్తులు
● యూనిఫారానికి బదులుగా ఇవ్వాలని ప్రతిపాదించిన కలెక్టర్సాక్షి, పార్వతీపురం మన్యం: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ముఖ్యమైన ప్రతిపాదనను సమర్పించారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతమున్న సంప్రదాయ యూనిఫాంల స్థానంలో సౌకర్యవంతమైన స్పోర్ట్స్ తరహా యూనిఫాం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన దర్జీల కొరత వల్ల ప్రస్తుత యూనిఫాంల కుట్టు నాణ్యత సరిగా ఉండడం లేదని, త్వరగా చిరిగిపోతున్నాయని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల లోగోతో కూడిన గాలి పీల్చే కాటన్ ఫ్యాబ్రిక్ టీ–షర్ట్, ట్రాక్ ప్యాంట్లను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఉచితంగా కదిలేందుకు మెరుగైన సౌకర్యం లభించడమే కాక.. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. ఈ ప్రతిపాదనను పైలట్ ప్రాజెక్ట్‌గా ముందస్తుగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయడానికి అనుమతించాలని కోరారు. ● కలెక్టర్ల కాన్ఫరెన్‌న్స్‌లో పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. మన్యం జిల్లాలోని విద్యాశాఖ బడ్జెట్ సమన్వయంతో బాలురు, బాలికలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని ఇప్పటికే ఎంపిక చేశామని, రాబోయే రెండు వారాల్లో వారికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒలింపిక్ క్రీడలను లక్ష్యంగా చేసుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ● యువత నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన ‘నైపుణ్యం’ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జిల్లా ఏకంగా 65.8 శాతం సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ● జిల్లాలో ఈ–ఆఫీస్ ఫైళ్ల సమర్థ నిర్వహణపై సీఎం ప్రశంసించారు. కలెక్టర్‌కు వచ్చే ప్రతి ఫైల్‌ను సగటున కేవలం 5 గంటల వ్యవధిలోనే పరిష్కరించి క్లియర్ చేస్తున్న తీరుపై అభినందనలు తెలిపారు. ప్రజలకు, అర్జీదారులకు వేగంగా న్యాయం జరిగేలా మన్యం జిల్లా చూపిస్తున్న ఈ పనితీరును అందరూ స్ఫూర్తిగా తీసుకుని అమలు చేయాలని సూచించారు. ● జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. కేవలం భౌతిక వసతులు, కిట్ల పంపిణీతోనే సరిపెట్టకుండా విద్యార్థులకు అందే విద్యా ప్రమాణాలను పెంచడం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ● జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రైతులకు నిలకడైన ఆర్థిక పరిపుష్టి అందించేందుకు చేపడుతున్న ఉద్యాన అభివృద్ధి చర్యలను కలెక్టర్ వివరించారు. పైనాపిల్, జీడిమామిడి, పసుపు పంటల ప్రగతిని తెలియజేశారు. -
తప్పిన పెనుప్రమాదం
రామభద్రపురం: మండలకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని విజయనగరం వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది, దీంతో అప్పటికే విద్యుత్ సరఫరా అవుతున్న స్తంభం పక్కకు ఒరిగిపోయి ఆ పక్కనే ఉన్న బట్టల షాపు బోర్డు మీద పడి అలా ఉండిపోయింది.బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీ కొట్టిన వెంటనే పక్కకు తప్పించి దూరంగా తీసుకెళ్లి నిలిపాడు. ఆ సమయంలో ఆక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపేశారు.ఏ మాత్రం స్తంభంతో పాటు వైర్లు కింద పడినా అదే సమయంలో బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. అలాగే బట్టల దుకాణాం షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం తప్పింది. మరో వైపు రోడ్డుపై రాకపోకలు సాగించే పాదచారులు,వాహనాలకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో హమ్మాయ్యా ఏ దేవుడు రక్షించాడో అంటూ అంతా ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్ శాఖాధికారులు వెంటనే స్పందించి కొత్త స్తంభం ఏర్పాటు విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. -
‘స్థానిక’ పోరుకు సన్నాహాలు
విజయనగరం రూరల్: జిల్లాలోని 27 మండలాల్లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్‌కు ముందున్న వివరాల మేరకే ఫొటోలతో కూడిన గ్రామీణ ఓటర్ల జాబితాను శుక్రవారం అన్ని కార్యాలయాల వద్ద ప్రచురించారు. జిల్లాలోని 27 మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తొలుత ఫొటో ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం మండల పరిషత్ కార్యాలయాలు, జెడ్పీ కార్యాలయం వద్ద అధికారులు ప్రచురించారు. 2021వ సంవత్సరంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీల పదవీకాలం ఈ నెల 23న, జెడ్పీటీసీల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపట్టింది. విజయనగరం జిల్లా పరిధిలో విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 449 ఎంపీటీసీ స్థానాలకు, 27 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, చంద్రబాబు సర్కారు ఆలోచన ప్రకారం ఎంపీపీల ఎన్నిక నేరుగా ప్రజలతో నేరుగా ఎన్నికోబడితే, మండలానికో ఎంపీపీ చొప్పున 27 మంది ఎంపీపీలు ఎన్నిక కానున్నారు. అలాగే, ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగా ఉన్న విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు ఈ నెల 25 నుంచి కొత్త జిల్లా పరిషత్‌లుగా అవతరించనున్నాయి. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఏర్పాట్లు పాత ఓటర్ల జాబితా ప్రకారం స్థా నిక ఎన్నికల నిర్వహణకుసర్కా రు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. సర్ ప్రక్రియలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. వీటిని పట్టించుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సమాచారంఅసెంబ్లీ నియోజక వర్గాలు: 07 మండలాలు: 27 ఎంపీటీసీలు: 449 ఎంపీపీలు: 27 జెడ్పీటీసీ స్థానాలు: 27 పోలింగ్ కేంద్రాలు: 7,398 పురుష ఓటర్లు: 6,36,006 మహిళా ఓటర్లు: 6,49,664 ఇతరులు: 34 మొత్తం ఓటర్లు: 12,85,704 ఓటర్ల జాబితా ప్రచురణ ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1994 నియమ నిబంధనలు, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు జిల్లాలోని జెడ్పీ ప్రాదేశిక నియోజక వర్గాలకు, మండల ప్రాదేశిక నియోజక వర్గాలకు సంబంధించి ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను శుక్రవారం మండల పరిషత్, జెడ్పీ కార్యాలయాల వద్ద ప్రచురించారు. జెడ్పీటీసీ నియోజకవర్గాలకు సంబందించి ఓటర్ల జాబితాను జెడ్పీ సీఈవో ఎ.లోవరాజు జెడ్పీ కార్యాలయం వద్ద ప్రచురించారు. ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రచురించిన ఓటర్ల జాబితాను ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించిన అధికారులు ఈ నెల 23న ఎంపీటీసీలు, 24న ముగియనున్న జెడ్పీటీసీల పదవీకాలం -
బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ
విజయనగరం అర్బన్/రాజాంసిటీ: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం, రాజాంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. తమ డిమాండ్లను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. 5 రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని, వివక్షతో కూడిన పీఎల్ఐ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ నిర్ణయాలను యూనియన్లతో చర్చించిన తర్వాతే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యుఎఫ్‌బీయూ కన్వీనర్, కో ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్, ఎస్‌వీఐ రీజనల్ సెక్రటరీ, ఇతర సంఘాల, బ్యాంకుల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విజయనగరంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
విశాఖపట్నం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని మారికవలసలో జరిగిన ఈ సంఘటనపై పీఎంపాలెం ఇన్స్పెక్టర్ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన గోర్లపల్లి చైతన్య (29)కు అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డుకు చెందిన ఝాన్సీ (23)తో 2025లో వివాహమైంది. వీరు మారికవలస విశ్వనాథ్ అవెన్యూలోని 202వ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. చైతన్య ఇన్ఫోసిస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తూ వర్క్ ఫ్రం హోమ్ విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం చైతన్య తండ్రి రవికుమార్ మృతి చెందాడు. అప్పటి నుంచి చైతన్య మానసికంగా కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనికి భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న మనస్పర్థలు కూడా తోడయ్యాయని, ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ బెడ్రూమ్లోకి వెళ్లారు. శుక్రవారం తెల్ల వారుజామున 3 గంటల సమయంలో ఝాన్సీ నిద్రలేచి చూడగా చైతన్య పక్కన లేకపోవడంతో మరో బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహకారంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చైతన్య తువ్వాలుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండడాన్ని గుర్తించారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటూ ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎస్.కోట వాసి -
భూ సమస్యలకు త్వరిత పరిష్కారం
● కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలువిజయనగరం గంటస్తంభం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సదస్సులో పాల్గొని సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ, విద్య, వైద్యారోగ్యం, నైపుణ్యాభివృద్ధిపై సీఎం సమీక్షించారు. సంక్షేమ పథకాల తేదీలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించి ప్రజలకు తెలియాజేయాలని ఆదేశించారు. 22ఏ జాబితాలోని భూ సమస్యలను పరిష్కరించడంతో ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాల భూములకు విముక్తి కల్పించామని సూచించారు. రీసర్వే పూర్తయిన భూములకు బ్లాక్‌చెయిన్ సాంకేతికతతో భద్రత కల్పించాలని సూచించారు. నవంబర్ 1 నుంచి రియల్‌టైమ్ ఇంటిగ్రేషన్ చేపట్టాలని, 45 రోజుల్లో బ్యాక్లాగ్ భూ వివరాలను బ్లాక్‌చెయిన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాలని, నియోజకవర్గాల వారీగా జాబ్ఫెయిర్లు నిర్వహించాలని సూచించారు. 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించేలా చర్యలు చేపట్టాలని, పాఠశాల భవనాల భద్రతపై ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. -
ఆకతాయిల దాడిలో వంటమనిషికి తీవ్ర గాయాలు
పార్వతీపురం రూరల్: కళాశాల విద్యార్థుల మధ్య రేగిన పాతకక్షలు రచ్చకెక్కగా, ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని ఒక అమాయక వంట మనిషి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన పార్వతీపురం పట్టణంలోని ఇందిరా కాలనీ సమీప ప్రధాన రహదారిపై కలకలం రేపింది. స్థానిక కల్యాణ మంటపంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కళాశాల వేడుకల అనంతరం, కేటరింగ్ సామగ్రితో ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న వంట మనిషిని, మరో విద్యార్థిని కొందరు యువకులు మార్గమధ్యంలో అడ్డగించారు. సదరు విద్యార్థితో పాత విషయాలపై వాగ్వాదానికి దిగి భౌతిక దాడికి పూనుకున్నారు. అక్కడే ఉన్న వంట మనిషి గమనించి, వారిని వారించేందుకు జోక్యం చేసుకోగా.. ఉన్మాదంతో రగిలిపోయిన ఆకతాయిలు వంటమనిషిపై కూడా విరుచుకుపడ్డారు. సమీపంలో ఉన్న సిమెంట్ రేకుల ముక్కలు, పిడికిళ్లతో దారుణంగా కొట్టడంతో ఆ వంట మనిషి తల, పెదవికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితుడిని గమనించిన ఓ స్థానిక ఆటో డ్రైవర్ తక్షణమే స్పందించి పార్వతీపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ కొట్లాటకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు పాల్పడిన విద్యార్థులు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవను ఆలయ అర్చకులు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిపించారు. శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఉంచి దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.8మంది మేకల దొంగల అరెస్ట్మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస, కాశీపట్నం, తూరుమామిడి గ్రామాలకు చెందిన పలువురి మేకలు ఇటీవల చోరీకి గురికాగా పోలీస్ స్టేషన్లో నమోదైనప ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో మార్కొండపుట్టి, దుగ్గేరు, పనసభద్ర గ్రామాలకు చెందిన ఆరుగురితో పాటు మరో ఇద్దరూ మైనర్లు ఉన్నారు. వారు దొంగిలించిన 10 మేకలు, రవాణాకు ఉపయోగించిన ఆటో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎనిమిది మందిలో ఆరుగురిని జుడిషియల్ రిమాండ్‌కు ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టుకు పంపించినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. పామాయిల్ గెలల ట్రాక్టర్ బోల్తాకొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి భారీగా గోతుల మయం కావడంతో వాహన చోదకులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అల్ప పీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో శుక్రవారం రామభద్రపురం సమీపంలో పామాయిల్ గెలలతో వెళ్తున్న ట్రాక్టర్ గోతిలో బోల్తా పడింది. ఈ క్రమంల అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నేడు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభవిజయనగరం: ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహసభ ఈనెల 11న జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం జరగనున్న మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నామని తెలిపారు. మహాసభకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకటరావు, జి.ఆంజనేయులు, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు, రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న మహాసభలకు జిల్లాలో, నగరంలో ఉన్న జర్నలిస్టు మిత్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు.బి.ప్రసాదరావు, నాగరాజు పాల్గొన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిబొబ్బిలి: క్రైస్తవ ప్రార్ధనల అనంతరం చర్చి నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బొబ్బిలి పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద జరిగిన త ప్రమాదంపై సీఐ కె.నారాయణ రావు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కొండ పుట్టి గ్రామానికి చెందిన నారాయణ పురం లక్ష్మయ్య(53)బొబ్బిలిలోని ఐటీఐ కాలనీలో గల చర్చికి వచ్చాడు. ప్రార్థనల అనంతరం తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఫ్లైఓవర్ వైపు వెళ్తుండగా రామభద్రపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం లక్ష్మయ్యను ఢీకొని మీదుగానే వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు సీహెచ్‌సీకి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. లక్ష్మయ్య తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్సై లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వన్‌స్టాప్ సెంటర్ ప్రచార రథానికి బ్రేకులు..!
● బిల్లులు చెల్లించకపోవడంతో వాహనాన్ని నిలిపివేసిన నిర్వాహకుడు విజయనగరం ఫోర్ట్: వన్‌స్టాప్ సెంటర్ అందించే సేవలను ప్రచా రం చేయడానికి, రెస్క్యూ కార్యక్రమాల కోసం ఏర్పాటుచేసిన ప్రచార రథానికి బ్రేకులు పడ్డాయి. ఐసీడీఎస్ అధికారులు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వల్ల ప్రచార రథానికి బ్రేకులు పడ్డాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రచారరథం సేవలు ఇలా.. కళాశాలలకు, పాఠశాలలకు, సచివాలయాలు, వసతి గృహాలకు వాహనంపై సిబ్బంది వెళ్లి వన్‌స్టాప్ సెంటర్ మహిళలకు అందించే రక్షణ, ఉచిత న్యాయ, వైద్యసేవలు, బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ మోసాలు, గుడ్‌టచ్ బ్యాడ్‌టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించేవారు. ఆపదలో ఉన్న మహిళలను వన్‌స్టాప్ సెంటర్‌కు తీసుకు రావడానికి, బాధితులను ఇంటికి చేర్చడానికి వాహనాన్ని వినియోగించే వారు. జిల్లాలో వన్‌స్టాప్ సెంటర్ ప్రచార రథాన్ని గతేడాది డిసెంబర్లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 200 వరకు అవగాహన సదస్సులు నిర్వహించారు. 15 రెస్క్యూలు నిర్వహించారు. డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు మాత్రమే వాహనానికి బిల్లులు చెల్లించారు. నెలకు రూ.37,500 చొప్పున అద్దె చెల్లించేలా ప్రచార రథాన్ని సమకూర్చారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలఖారు వరకు ఐదు నెలలకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో రథం నిర్వాహకుడు వాహనాన్ని నిలిపివేసినట్టు సమాచారం. వన్‌స్టాప్ సెంటర్ సిబ్బందికి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్ (పీడీ)కి మధ్య గత కొన్ని నెలలుగా కోల్డ్‌వార్ నడుస్తుండడం వల్లే వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది ఏది అడిగినా పీడీ వాటిని పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై వివరణ అడిగేందుకు పీడీ బాలామణికి ఫోన్‌చేయగా ఆమె స్పందించ లేదు. -
ప్రజలకు అండగా నిలబడదాం
● పార్టీని విజయపథాన నిలుపుదాం ● కార్యకర్తలకు పిలుపునిచ్చిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రజలకు అండగా నిలబడదామని, వారి సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాటం చేద్దామని, వైఎస్సార్సీపీని విజయపథాన నిలుపుదామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గరివిడిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనం అండగా నిలబడదామని భరోసా ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో కార్యకర్తలు, ప్రజలు అందించిన ఆదరణను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు లభిస్తున్న గౌరవం.. మీరిచ్చిందే అంటూ కంటతడి పెట్టారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బొత్స అడుగుజాడల్లో నడుద్దాం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ హయాం నుంచి నేటి వరకు బొత్స హయాంలో జిల్లాతో పాటుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేశారు. తోటపల్లి సాగునీటిని తీసుకువచ్చిన ఘనత బొత్సకే చెందుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో చీపురుపల్లి నియోజకవర్గానికి వంద కోట్లతో ప్రతి గ్రామానికి నీళ్ల ట్యాంకులు నిర్మించి తాగునీరు అందించామని గుర్తుచేశారు. బొత్స అడుగుజాడల్లో నడుద్దామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పింఛన్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నారే తప్ప మంజూరుచేస్తారోలేదో తెలియదన్నారు. అవసరం తీరిపోయాక ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్యగా పేర్కొన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్‌కోటాలో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, యువ నాయకురాలు బొత్స అనూష, బొత్స సందీప్, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, పార్టీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, పార్టీ మండలాధ్యక్షుడు తాడ్డి వేణు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సీర అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ తోట తిరుపతిరావు, నాలుగు మండలాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
చక్కెర కర్మాగారాన్ని మూసివేయొద్దు
● మూసివేత ప్రకటనను యాజమాన్యం ఉపసంహరించుకోవాలి రేగిడి: ఎల్‌నినో ప్రభావంతో 2027–28 క్రషింగ్ సీజన్‌కు రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం మూసివేస్తున్నామని యాజమాన్యం చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి చక్కెర పరిశ్రమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు చక్కెర కర్మాగారం జీఎం వెంకట సూర్యనారాయణకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తొలుత నిర్వహించిన సమావేశంలో రైతు సంఘ నాయకుడు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం గతంలో మాదిరిగా రైతులకు రాయితీలు ఇచ్చి చెరకు సాగు విస్తీర్ణానికి తగు ప్రణాళికలతో ముందుకు వస్తే రైతులంతా యాజమాన్యానికి సహకరిస్తారని అన్నారు. యాజమాన్యం స్పష్టమైన ప్రకటన ఇచ్చేంత వరకు దశలవారీగా ఉద్యమం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కింజరాపు సురేష్, చింత సంగంనాయుడు, కెంబూరు కోటేశ్వరరావు, కుమరాపు బలరాంనాయుడు, కర్రి రమణ, మజ్జి అప్పలనాయుడు, నీలకంఠేశ్వర యాదవ్, కొప్పర వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఒకరు మునిగిపోయి.. మరి కొందరిని ముంచారు..
● లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు ● ట్రేడింగ్ పేరుతో కుచ్చుటోపీ ట్రేడింగ్‌తో టోకరా.. క్యూవీఎస్‌ఈ యాప్ ఎంతగా విస్తరించిందంటే ఏకంగా వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేసేంత వరకు వెళ్లింది. ప్రతి పట్టణంలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ ఊరిలో డబ్బులు డిపాజిట్ చేసిన వారిని సభ్యులుగా చేర్పిస్తారు. ప్రతి రోజూ యాప్‌కు సంబంధించిన కోడ్ లు ఇందులో పోస్ట్ చేస్తారు.ఈ కోడ్ తోనే ట్రేడింగ్ చేయాలి అని చెబుతారు. వారందరూ దాదాపుగా డబ్బు డిపాజిట్ చేసిన వారే. ఇప్పుడు గ్రూప్ సభ్యులు అందరూ లబోదిబోమంటున్నారు. మోసపోయాం అంటూ బాధపడుతున్నారు.. గజపతినగరం రూరల్ / రాజాం సిటీ: ఆన్లైన్లో జరుగుతున్న మోసాలు ప్రతిరోజూ వింటున్నా.. చూస్తున్నా.. మోసపోతూనే ఉన్నారు. ఒకవైపు పోలీసులు ఆన్లైన్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినా ఈ మోసాలు ఆగడం లేదు. తాజాగా గజపతినగరం, రాజాం నియోజకవర్గాల పరిధిలో క్యూవీఎస్‌ఈ డాలర్ స్కామ్ బహిర్గతమైంది. క్యూవీఎస్‌ఈ డాలర్ల స్కామ్‌లో వేలాది మంది కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆన్లైన్ మోసం జిల్లా వాసుల్లో కలకలం రేపుతోంది. మధ్య తరగతి ప్రజలు, రాజకీయ నాయకులు, చిన్న ఉద్యోగులు, మహిళలు సైతం లక్షల రూపాయలు పెట్టి మోసపోయినట్లు సమాచారం. పెట్టుబడికి రెట్టింపు డబ్బులు వస్తున్నాయన్న ఆశతో డిపాజిట్ చేసి అడ్డంగా బుక్ అయిపోయారు. జిల్లాలో సుమారు రెండువేల మంది పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. రూ.50 వేలు మొదట కట్టి సభ్యుడినిగా చేరిన మూడు నెలల్లో మన డబ్బులు మనకు వచ్చేస్తాయనే ఆశతో వందలాది మంది ఈ యాప్‌లో చేరి డబ్బులు డిపాజిట్ చేశారు. కుటుంబాలకు కుటుంబాలు ఈ యాప్‌లో డబ్బు డిపాజిట్ చేసేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఒక గ్రూప్‌గా మారిపోయి ఒకరి తర్వాత ఒకరు డబ్బులు డిపాజిట్ చేశారు. మహిళలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మరీ క్యూవీఎస్‌ఈ యాప్‌లో డిపాజిట్ చేసి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మొదట జాయిన్ అయినవారు చైన్ సిస్టంలో ఒక్కొక్కరు ఐదుగురు చొప్పున రిఫర్ చేసి జాయిన్ చేస్తే బోనస్ ఇస్తామని యాప్ నిర్వాహకులు ప్రకటించడంతో చాలా మంది తాము మోసపోవడమే కాదు తమ బంధువులు, స్నేహితులను కూడా ఈ మోసంలో బాధితులను చేశారు. ఒక్కొక్కరు ఐదుగురిని జాయిన్ చేసి వారితో కూడా డబ్బులు డిపాజిట్ చేయించారు. తాము చేర్చినందుకుగాను వచ్చిన బోనస్ ఒక్కక్కరివి లక్షలాది రూపాయలు యాప్‌లో ఉండిపోయాయి. ఒక్కొక్కరు రెండేసి మూడేసి ఐడీలతో డబ్బును విచ్చలవిడిగా డిపాజిట్ చేసేశారు. ఆగస్టు 24 తేదీ నుంచి విత్ డ్రా ఆప్షన్ తీసివేయడంతో లబోదిబోమంటున్నారు. విత్‌డ్రాలు నిలిచిపోవడంతో బహిర్గతం.. గత 15 రోజులుగా విత్ డ్రాలు నిలిచిపోవడంతో సంస్థ ఏర్పాటు చేసిన మూడు రకాల వాట్సాప్ గ్రూపుల ద్వారా లావాదేవీలు జరిపిన పెట్టుబడిదారులు లబోదిబోమనడంతో మోసం బహిర్గతమైంది. కష్టపడి దాచుకున్న డబ్బంతా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ నిబంధనల ప్రకారం కొంతమంది ఖాతాల్లో లక్షల రూపాయలు లాభాలు చూపిస్తున్నా ఆ డబ్బులు విత్ డ్రా కావడం లేదు. విత్ డ్రా కావాలంటే అదనంగా మరో రూ.50వేలు డిపాజిట్ చేస్తే మీ లాభాలు చెల్లింపు చేస్తామంటూ మెసేజ్‌లు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. బోనస్ చెల్లింపులు కోసం ఈనెల 12వ తేదీ వరకు యాప్ నిర్వాహకులు గడువు ఇచ్చినట్లు, ఆ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో పెట్టుబడిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒకరు మునిగిపోయి మోసపోయిన స్కామ్ కాదు. యాప్‌లో మొదట్లో డబ్బు రావడంతో ఇది మోసం అని తెలియక చాలా మంది మరికొంతమందిని ఇందులో జాయిన్ చేశాారు. యాప్‌లో వచ్చే రిటర్న్స్ బాగుండడంతో బయట తక్కువ వడ్డీకి అప్పు తెచ్చి యాప్ లో డిపాజిట్ చేసిన వారు కూడా ఉన్నారు. బ్యాంకులో నగలు పెట్టి డబ్బులు తెచ్చిన వారు కూడా ఉన్నారు. మహిళలు కొందరు తమకు వచ్చిన బ్యాంకు రుణం సొమ్మును ఇందులో డిపాజిట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా ఒకరేంటి చాలా మంది ఎలాగోలా డబ్బు పుట్టించి యాప్ నిర్వాహకుడికి అప్పనంగా ఇచ్చేశారు. -
రెడ్‌క్రాస్‌లో పోస్టులకు 22న ఇంటర్వ్యూలు
విజయనగరం ఫోర్ట్: రెడ్‌క్రాస్ సొసైటీలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 22న రెడ్‌క్రాస్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సత్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ సూపర్ వైజర్ (బీఎస్సీ ఎంఎల్టీ), డీఎంఎల్టీగా ఏడాది అనుభవం ఉన్నవారు, ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్టీ విద్యార్హత) ఏడాది అనుభవం, స్టాఫ్‌నర్సుకు జీఎన్ఎంగా ఏడాది అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు. సహస్ర ఘటాభిషేకం శృంగవరపుకోట: మండలంలోని పుణ్యగిరి శివాలయంలో దేవదాయ దర్మదాయశాఖ ఆదేశాల మేరకు గురువారం దృశ్య వరుణ పూజ సహస్ర ఘటాభిషేకంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పురోహితుడు లట్టాన మణిశర్మ ఆధ్వర్యంలోని వేదపండితులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విమానాశ్రయ భూముల పరిశీలన బాడంగి: బాడంగి సమీపంలోని విమానాశ్రయ భూములను విశాఖ ఏన్డీఏకు చెందిన అధికారులు బొబ్బిలి ఆర్డీఓ రామమోహన్‌రావు, తహసీల్దార్ వరప్రసాద్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్డీఏకు చెందిన డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులు విమానాశ్రయ గచ్చు రోడ్డును నిశితంగా పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన రన్‌వేతో కలిపి సుమారు 247 ఎకరాల భూములకు కేవలం రన్వేగచ్చు రోడ్డు 50 ఎకరాలు మినహా మిగిలిన 197ఎకరాలు రైతుల ఆక్రమణలో ఉన్నట్టు నిర్ధారణకొచ్చారు. ఆక్రమిత భూముల్లో ప్రస్తుతం నీలగిరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతుండడాన్ని గమనించారు. భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని రెవెన్యూ ఽఅధికారులను కోరారు. విమానాశ్రయ భూములను త్వరలో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఖైదీల పట్ల వివక్ష చూపొద్దు విజయనగరం లీగల్: ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు ఎటువంటి వివక్ష చూపించరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. విజయనగరం సబ్ జైలులో గురు వారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో ఆమె మాట్లాడారు. ప్రతిఒక్కరూ నేర ప్రవృత్తిని విడనాడాలని హితవు పలికారు. సకాలంలో న్యాయ సహాయం అందించేందుకు జైల్ లీగల్ ఎయిడ్ క్లినిన్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలను ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంట గది, భోజనశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, విజయనగరం అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, తదితరులు పాల్గొన్నారు. -
దళిత సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● అధికారుల తీరుపై ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అసహనం ● శ్మశానవాటికలకు తక్షణమే దారులు కల్పించాలి: ఎంఆర్ఓలకు ఆదేశం పార్వతీపురం రూరల్: ప్రోటోకాల్ పాటించడంలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో దళితుల సమస్యలపై ఆయన ప్రత్యేక గ్రీవెన్స్, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న తమకు ఆర్డీఓ కార్యాలయం నుంచే ప్రోటోకాల్ అందాల్సి ఉండగా, ఆ బాధ్యతను సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేయడం దారుణమన్నారు. ‘ప్రోటోకాల్ పాటించకపోవడానికి మేమేమైనా వార్డు మెంబర్లమా? ఈ నిర్లక్ష్యపు తీరు పునరావృతమైతే అధికారులను కమిషన్ ముందు నిలబెడతాం. మీ కెరీర్‌కు మచ్చ తెచ్చుకోవద్దు‘ అని ఘాటుగా హెచ్చరించారు. అనంతరం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో దళితుల శ్మశానవాటికల ఆక్రమణలపై ఆయన స్పందించారు. ప్రాణం పోయాక కూడా దళితులకు ప్రశాంతత కరువయ్యేలా ఆక్రమణలు జరగడం శోచనీయమన్నారు. శ్మశానాలకు దారులు లేకపోతే, ప్రైవేటు భూములైనా సేకరించి (ల్యాండ్ అక్విజిషన్) మార్గం సుగమం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆక్రమణలకు గురికాకుండా తక్షణమే రక్షణ గోడలు, కందకాలు నిర్మించాలన్నారు. దళిత భూసమస్యల పరిష్కారంలో అధికారులంతా నిబద్ధతతో పనిచేసి న్యాయం చేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశాల మేరకు జోగంపేట, గురుగుబిల్లి ఎస్సీ వసతిగృహాలను తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. -
కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి విజయనగరం ఫోర్ట్: కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. కుష్ఠు వ్యాధిపై ఈనెల 11 నుంచి 24 వతేదీ వరకు ఇంటింటా కుష్ఠు రోగుల గుర్తింపు సర్వే జరగనుంది. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ప్రచారం చేసేందుకు ప్రచార వాహనాన్ని గురువారం జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిదన్నారు. నొప్పి, స్పర్శ లేని మచ్చలు ఉంటే కుష్ఠు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇటువంటి మచ్చల పట్ల నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డాక్టర్ అర్చన దేవి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేతమక్కువ: మండలంలోని కొండబుచ్చమ్మపేట గ్రామసమీపంలో శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు గురువారం పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం మక్కువ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ ఆటోపై పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు కాపుకాసి పట్టుకున్నారు. మొత్తం 842 కేజీల బియ్యాన్ని తన సొంత మహేంద్ర ఎలక్ట్రికల్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడ్డాయి. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు, వాహనాన్ని పోలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. విజయనగరం: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ్ విరాజితుడని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ అన్నారు. విశ్వనాథుని జయంతి పురస్కరించుకుని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు, శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వేయిపడగల నవలా సృష్టికర్తకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ.. విశ్వనాథుడి కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకని కొనియాడారు. కార్యక్రమంలో గురజాడ వెంకటేశ్వరప్రసాద్, సాహితీవేత్తలు చీకటి దివాకర్, కాగుపాటి నారాయణమూర్తి, ఎం.సుభద్రాదేవి, పసుమర్తి సన్యాసిరావు , గాంధీ తదితరులు పాల్గొన్నారు. బ్రోచర్ ఆవిష్కరణ విజయనగరం రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించమే లక్ష్యంగా నిర్వహించనున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) – 2026లో భాగంగా అధికారిక బ్రోచర్‌ను జేఎన్టీయూ ఉప కులపతి వీవీ సుబ్బారావు గురువారం ఆవిష్కరించారు. జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న అంతర్గత హ్యాకథాన్‌లో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. ఈ హ్యాకథాన్‌కు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా డాక్టర్ జి.జయసుమ వ్యవహరించనుండగా, విద్యార్థి సమన్వయకర్తలుగా ఎం.లిఖిత్‌కుమార్, కె.ప్రవళ్లిక వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె.చంద్రభూషణరావు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ వకుల, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు. -
శ్లాబ్ పైనుంచి పడి వ్యక్తి మృతి
నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట గ్రామంలో ఓ ఇంటి శ్లాబ్‌పై పనిచేస్తున్న తాపీ పని కార్మికుడు పెందుర్తి పైడిరాజు (47) ప్రమాదవశాత్తు జారి నేలపై పడి మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ సంఘటనలో శ్లాబ్ పైనుంచి కిందకు పడి తీవ్ర గాయాలపాలైన పైడిరాజును వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు పైడిరాజు గుర్ల మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ సంఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
పాలకొండ: ఒక్క వాహనం పోయిందని వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా ఐదు ద్విచక్రవాహనాల దొంగతనం గుట్టు రట్టయింది. నిత్యం వాహనాలు పోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు చిన్న ఆధారంతో దర్యాప్తు చేసి వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు దొంగలించి వాటిని అమ్మి ఆ సొమ్ముతో జల్సా చేస్తున్న వీరఘట్టం పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ ఎం.రాంబాబు గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వీరఘట్టం మండలం కంబరవలస వెటర్నరీ అసిసెంట్ పశువుల ఆస్పత్రి వద్ద తన ద్విచక్రవాహనం పార్కింగ్ చేసి విధులు నిర్వహిస్తున్న సమయంలో తన వాహనం చోరీ జరిగిందని ఈ నెల 1న వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం వీరఘట్టం–పార్వతీపురం రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి ద్విచక్రవాహనం వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన పొందూరు మురళీకృష్ణ, చేతల చంద్రమౌళిలుగా గుర్తించి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ఈ విచారణలో పట్టుబడిన వాహనం చోరీ చేసినదే అని గుర్తించారు. నిందితులను తమ దైన శైలిలో విచారణ చేయడంతో ఈ వాహనంతో పాటు మరో నాలుగు పల్సర్ ద్విచక్రవాహనాలు దొంగతనం చేసినట్లు నిందితులు అంగీకరించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరగా ఛేదించిన వీరఘట్టం ఎస్సై ఎస్ షణ్ముఖరావు, సిబ్బందిని డీఎస్పీ అబినందించారు. సమావేశంలో సీఐ ఎ ప్రసాద్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఐదు బైక్‌లు స్వాధీనం -
గజరాజుల గమనం..కుంకీల కదనం
● సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం ● గ్రామస్తుల తీవ్ర ఉత్కంఠపార్వతీపురం రూరల్: గజరాజుల గమనం, కుంకీల కదనం మధ్య పార్వతీపురం, కొమరాడ మండలాల సరిహద్దుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంటలు పాడుచేస్తూ, గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న అడవి ఏనుగుల గుంపునకు అడ్డుకట్ట వేసేందుకు కుంకీ ఏనుగులు అహర్నిశలు పహారా కాస్తున్నాయి. ఇటీవల ఆంధ్రా–ఒడిశా సరిహద్దులకు వెళ్లిన అడవి ఏనుగులు, అక్కడి ప్రజల తరిమివేతతో వెనుదిరిగి వచ్చి ప్రస్తుతం గంగమాంబపురం, చందలింగి, వరహాల గడ్డ రిజర్వాయర్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఈ మదపుటేనుగులు పెద్దమరికి పంచాయతీ గ్రామాల్లోకి ప్రవేశించకుండా కుంకీ ఏనుగులైన ’అభిమన్యు, జయంత్’లు కంచెలా నిలబడి సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి. బుధవారం రాత్రి ఈ రెండు గుంపులు ముఖాముఖి ఎదురుపడగా, గురువారం నాటికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మకాం వేశాయి. శిక్షకుడు సాయి, మావటీల పర్యవేక్షణలో కుంకీ ఏనుగులకు తగిన ఆహారం, నీరు అందిస్తూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పగటి పూట గిరిజన గ్రామాల్లో, మెట్ట ప్రాంతాల్లో కుంకీలు సంచరిస్తుండడంతో తమ ప్రాణ, ఆస్తులకు రక్షణ లభించిందని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, రాత్రివేళ ఈ రెండు గుంపులు మరింత చేరువవుతున్న తరుణంలో అటవీశాఖ అధికారులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించనున్నారు? గజరాజుల మళ్లింపు సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నలతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంటిమీద కునుకులేకుండా జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు విధించిన గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించాలని లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.సంగం డిమాండ్ చేశారు. కొత్త పింఛన్ల ప్రక్రియ కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 16తో ముగుస్తున్న దరిమిలా, పత్రాల సేకరణకు ఈ సమయం ఏమాత్రం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్వతీపురం మండలంలోని గంగాపురం గ్రామ సచివాలయానికి గురువారం వెళ్లి, అక్కడి అడ్మిన్‌తో దరఖాస్తుల స్వీకరణలో సామాన్యులు పడుతున్న సాధకబాధకాలను ఆయన చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు దరఖాస్తులకు అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. కాగితాల కష్టాలతో అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారని, సకాలంలో పత్రాలు సమర్పించడానికి వారికి మరింత వెసులుబాటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లక, అర్హులందరికీ న్యాయం జరిగేలా ఆలోచించి ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాయకులు వెలమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కరిగిపోతున్న కాలం..!
వీరఘట్టం: ఈమె పేరు సీరాపు లిఖిత..వీరఘట్టానికి చెందిన ఈమెకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. నాలుగు నెలల క్రితం భర్త అనార్యోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛన్ కోసం ఇటీవల వీరఘట్టం సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసింది.అయితే ఆ దరఖాస్తును స్వీకరించడం లేదు. ఎందుకని ఆరా తీస్తే హౌస్ హోల్డింగ్‌లో ఆమె పుట్టింటిలో ఈమె పేరును జత చేశారు. ఈ హౌస్ హోల్డ్‌లో ఉన్న వాళ్ల నాన్నమ్మకు వృద్ధాప్యపు పింఛన్ వస్తోంది. వీరు వేర్వేరుగా నివసిస్తున్నప్పటికీ, వేర్వేరుగా రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ వారంతా ఒకే హౌస్ హోల్డ్‌లో ఉండడంతో ఆమెకు పింఛన్ పెట్టేందుకు దరఖాస్తును కంప్యూటర్ స్వీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. వింతంతు పింఛన్‌కు ఈమెకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు కూడా పెట్టలేని పరిస్థితి. ఇలా ఈమె ఒక్కరు మాత్రమే కాదు. ఇటువంటి వారు చాలా మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ల వల్ల పింఛన్ దరఖాస్తులు పెట్టలేకపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. మరో నెల రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరగనుండడంతో ఒక్కసారిగా వృద్ధులు, వింతతువులు, దివ్యాంగులపై ప్రేమ కురిపిస్తూ ఈనెల 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లో లక్షకు పైగా ఉన్న అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యపడడం లేదు.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆపసోపాలు పడుతున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు.. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇంటింటికీ పర్యటించిన అధికారులు ప్రతి ఇంటిలో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని వారందరి ఆధార్‌కార్డు నంబర్లను ఓకే హౌస్ హోల్డింగ్‌లో మ్యాపింగ్ చేశారు. తర్వాత కొంత మందికి పెళ్లై అత్తవారింటికీ వెళ్లిపోయినా ఇంకా పాత హౌస్ హోల్డింగ్‌లోనే ఉన్నట్లు చూపిస్తోంది. అటువంటి దరఖాస్తులను అధికారులు స్వీకరించలేకపోతున్నారు. దీంతో పింఛన్లు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోలేక అర్హులైన వారంతా కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. సర్వర్ ప్రోబ్లం.. వీరఘట్టం మేజర్ పంచాయతీలో నాలుగు సచివాలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి పింఛన్‌దారుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఒక్కొక్క దరఖాస్తు పరిశీలించి వారి ధ్రువీకరణ పత్రాలను స్కానింగ్ చేసి అప్లోడ్ చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు అరగంట సమయం పడుతోంది. దీంతో రోజుకు ఒక సచివాయలంలో 12 నుంచి 16 కంటే ఎక్కువ రఖాస్తులు అప్లోడ్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గురువారం నాటికి 350 సచివాలయాల్లో సుమారు 16 వేల దరఖాస్తులు అప్లోడ్ అప్ అయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు గడువు పెంచాలి.. పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7 నుంచి 16 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికి నాలుగు రోజులు గడిచిపోయాయి.ఇంకా దరఖాస్తు కు ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది.ఇందులో ఈనెల 12న రెండవ శనివారం,13న ఆదివారం,14న వినాయక చవితి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో దరఖాస్తు చేసుకునేందు కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయం సరిపోనందున పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని అర్హులైనవారు కోరుతున్నారు. మరో ఆరురోజులే గడువు అందులో మూడు రోజులు సెలవులు అర్హులకు పెన్షన్ టెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు ఆపసోపాలు వెంటాడుతున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు జిల్లాలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న సుమారు 1 లక్షమంది మరో వైపు మొరాయిస్తున్న సర్వర్లు సమయం పెంచాలని వేడుకుంటున్న పింఛన్ దరఖాస్తు దారులు -
ముమ్మరంగా కంటి పరీక్షలు
● 607 పాఠశాలల్లో 51,235 మందికి పూర్తయిన స్క్రీనింగ్ ● 2,651 మందికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీకి సన్నాహాలుపార్వతీపురం రూరల్: బడిపిల్లల భవితకు వెలుగులు పంచేలా పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉచిత నేత్ర వైద్య పరీక్షల పర్వం ముమ్మరంగా సాగుతోంది. జులై 15న విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ ఆదేశాలతో మన్యం జిల్లాలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలవుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ పి.విజయలక్ష్మి, డీఈఓ పి.బ్రహ్మజీరావుల సమన్వయంతో, ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ జగన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు కంటి వెలుగుల పండగను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలోని 1,563 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలే లక్ష్యంగా నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో ఆఫ్తాల్మిక్ సిబ్బంది పరీక్షలు వేగవంతం చేశారు. ఇప్పటివరకు 607 బడుల్లో 51,235 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,651 మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించగా, వారందరికీ త్వరలో ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. తీవ్రమైన సమస్యలు ఉండి, శస్త్రచికిత్సలు అవసరమైన ఐదుగురు చిన్నారులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నారు. విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించేలా 607 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు పూర్తి చేసి, కంటివెలుగులు పంచుతామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద కొత్తగా నిర్మించిన వంతెన సమీపంలో అదే గ్రామానికి చెందిన ఉత్తరావల్లి సంతోష్(37) అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రివరకు బ్రిడ్జికి ఆవల వైపు ఉన్న పొలాల వద్ద స్నేహితులతో మద్యం తాగిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో బ్రిడ్జి పైన ఉన్న రహదారిపైకి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సంతోష్ మృతి చెంది ఉంటాడని తెలిపారు. శరీరంపై ఎక్కడా గాయాలు కాలేదని, కేవలం తల, నుదురు భాగంలో మాత్రమే తీవ్రమైన గాయముందని, వాహనం ఢీకొట్టగానే రోడ్డుపైనుంచి కిందికి పడిపోయి మృతిచెంది ఉండవచ్చని తెలిపారు. డీఎస్పీ ఆర్ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్, ఫోరెన్సిక్ టీంతో విచారణ చేపట్టారు. ఎటువంటి క్లూస్ లభించ లేదని తేల్చారు. అయితే సంతోష్ మృతి పట్ల తండ్రి తిరుపతిరావు తన కుమారుడి మృతి అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులుతో మాట్లాడుతూ అప్పలరాజు పేట రహదారిలో వాటర్ ప్లాంట్ వద్ద బుధవారం రాత్రి 8 మంది స్నేహితులతో కలిసి సంతోష్ మద్యం తాగాడని రాత్రి 11 గంటల వరకు సంతోష్‌కు ఫోన్ పనిచేసిందని, అనంతరం ఫోన్ పనిచేయలేదని, అలాగే మృతదేహం సమీపంలోను, సంఘటనా స్థలంలో సంతోష్ ఫోన్ కూడా లభ్యం కాలేదని దీంతో ఎవరైనా గిట్టనివారు, లేదా మద్యం మత్తులో హత్య చేశారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు ఇచ్చన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడికి తల్లి సింహాచలం, తమ్ముడు సాయి ఉన్నారు. ఫిర్యాదు మేరకు సీఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలి
చికెన్పార్వతీపురం రూరల్ : అపార క్రీడా నైపుణ్యాలకు మన్యం జిల్లా నెలవని, అయితే సరైన ఆదరణ కరవై ఆణిముత్యాల్లాంటి గిరిజన క్రీడాకారుల ప్రతిభ అడవులకే పరిమితమవుతోందని కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జీవీవీఎస్ కమలాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర క్రీడల్లో ప్రతిభావంతులైన యువతను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కనీసం రన్నింగ్ ట్రాక్, మినీ స్టేడియం లేకపోవడం శోచనీయమన్న ఆయన.. మన్యంలో తక్షణం క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో క్రీడలకు పెద్దపీట వేయగా, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్యావ్యవస్థకే మచ్చతెచ్చేలా నీట్ పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు. ఏఐసీసీ ఎలక్టెడ్ మెంబర్ వైరిచర్ల శృతిదేవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యమని, క్రీడల్లో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం దక్కాలన్నారు. గిరిజన సంస్కృతి, ఆటపాటలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా జిల్లాలో పారాలింపిక్స్ తరహా క్రీడలు నిర్వహించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం నేతలు స్థానిక వాకర్స్ ప్రతినిధులు, విద్యార్థులతో క్రీడా సదుపాయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గేదెల రామకృష్ణ, బాత దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ డిమాండ్ -
12న వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి సమావేశం
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నట్టు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. కొందరు పార్టీని వీడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ శ్రేణులంతా త్వరలో జరగనున్న స్థానిక సమరానికి సన్నద్ధం కావాలన్నారు. సమాజం అంటే భయం, భక్తి ఉండాలని, అప్పుడే గౌరవం లభిస్తుందని వాఖ్యానించారు. పార్టీకి విధేయులైన కార్యకర్తలు, నాయకులే ప్రధాన బలమన్నారు. ఇకపై వారితోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టంచేశారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా స్థాయి సమావేశాలు పూర్తయ్యాయన్నారు. విజయనగరం జిల్లా స్థాయి సమావేశం ఈ నెల 12న ఉదయం 10 గంటలకు పూల్‌బాగ్‌లోని జగన్నాథఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, పార్టీలోని రాష్ట్ర కమిటీ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతారని స్పష్టంచేశారు. అలాగే, ఈ నెల 16 నుంచి రోజుకు రెండు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశాలు అనంతరం మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ సమన్వయకర్తలకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్, తదితరులు పాల్గొన్నారు. 16 నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు పార్టీ శ్రేణులంతా స్థానిక సమరానికి సమాయత్తం కావాలి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపు -
కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు
విజయనగరం గంటస్తంభం: హక్కుల సాధన కోసం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు. ఇచ్చిన హామీ మేరకు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోన్–1 సచివాలయ ఉద్యోగ సంఘాల సమైక్య(ఎస్జీఎస్డబ్ల్యూ) ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం కలెక్టరేట్ వేదికగా ఆందోళన చేశారు. రాత్రి 9.30 గంటల వరకు బైఠాయించి తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ తొలుత డీఆర్వో సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేసీ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. జేసీ వచ్చేవరకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళన కొనసాగించారు. జేసీ వచ్చాక సమస్యలను వినిపించి వినతిపత్రం అందజేశారు. గతంలో చేపట్టిన దీక్షల సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ వారం రోజుల్లో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, గడువు ముగిసినా నేటికీ ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని సంఘ నేతలు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న తమను విస్మరించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ మహిళా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. హామీలు ఇచ్చి చేతులెత్తేస్తే ఎలా? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. గతంలో దీక్షలు చేసినప్పుడు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చి విరమింపజేశారు. నేటీకీ ఎలాంటి స్పందన లేదు. – బి.శంకరరావు, జేఏసీ రాష్ట్ర సభ్యుడు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడతారా? గత కొన్నేళ్లుగా మా సర్వీసు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రొబేషన్ పూర్తయిన 9 నెలల బకాయి వేతనాలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మా న్యాయమైన హక్కులు. వీటిని తక్షణమే పరిష్కరించాలి. – వి.కాశీనాయుడు, జేఏసీ జిల్లా సభ్యుడు డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి వార్డుల్లో ప్రజా సేవలకు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం. కనీస బేసిక్ పే రూ.30,000 అమలు చేయడం, శాఖాపరమైన ప్రమోషన్లు కల్పించడం వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. – ఆర్.శివప్రసాద్, వార్డు జేఏసీ విజయనగరం హక్కుల సాధన కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ రాత్రి 9.30 గంటల వరకు బైఠాయింపు జేసీకి వినతిపత్రం అందజేసిన ఉద్యోగ సంఘ నాయకులు -
ఎవరి కోసం ఈ పనులు..?
విజయనగరం అర్బన్: ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాల్సిన అభివృద్ధి నిధులు అసలు ఎక్కడ ఖర్చవుతున్నాయి..? పట్టణంలో అత్యవసర మౌలిక వసతుల కంటే, రియల్ ఎస్టేట్ అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం పట్టణంలో వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 98 అభివృద్ధి పనులకు రూ.9.99 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా అందుబాటులో ఉన్న అధికారిక నివేదికల ప్రకారం వీటిలో 97 పనులు పూర్తయ్యాయి. వీటి విలువ రూ.9.59 కోట్లు. మరో పని రూ.39.80 లక్షలతో రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్ ప్రొగ్రెస్‌లో గానీ, గ్రౌండింగ్ కోసం ఎదురుచూస్తున్న పనులేవీ లేవని లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లో ఫుల్.. పనుల సంఖ్యను చూస్తే దాదాపు 99 శాతం పూర్తయినట్లుగా అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఖర్చు పరంగా కూడా దాదాపు 96 శాతం విలువైన పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే నగరంలోని శివారు కాలనీల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కామాక్షినగర్, ధర్మపురి, వైఎస్సార్‌నగర్, గాజులరేగ, మజ్జిపేట, బీసీ కాలనీ, దుప్పాడ, తదితర శివారు ప్రాంతాల్లో నేటీకి గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోడ్ల మీదనే వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవసరం ఉన్నచోట కాకుండా అవసరం లేని చోట్ల రోడ్లు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. లే అవుట్లకు ఎందుకంత ప్రాధాన్యం.. ప్రత్యేక పాలనలో ఉన్న సమయంలో అభివృద్ధి పనుల ఎంపికలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష జోక్యం లేకపోవడంతో అధికార యంత్రాంగం మాటే చెల్లుబాటు అవుతుంది. ఈ పరిస్థితిని అధికార పా ర్టీకి చెందిన కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జనావాసాలు లేని ప్రాంతాల్లో వెడల్పాటి రహదారులు, లే అవుట్లు, రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లే అవుట్లలో సంబంధిత యజమానులు రోడ్లు వేయాలి. కాని ఇక్కడ ప్రభుత్వ ధనంతో రోడ్లు వేయించి, లేఅవుట్ యజమానులకు మేలు చేస్తున్నారు. ఇప్పటికే జనాభా అధికంగా ఉన్న.. ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏయే పనులు ఏ ప్రాంతాల్లో చేపట్టారు..? వాటి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి..? ఆయా రహదారుల వల్ల ప్రస్తుతం ఎంతమంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది..? రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు ప్రయోజనం కలిగే ప్రాంతాల్లో చేపట్టిన పనుల సంఖ్య ఎంత..? వంటి వివరాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లే అవుట్లలో రహదారుల జోరు శివారు కాలనీల్లో అధ్వానపు తీరు రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేస్తున్న అధికారులు కాలనీ వాసులకు తప్పని ఇక్కట్లుసామాజిక ప్రయోజనం ఎంత..? 98 పనులకు దాదాపు రూ.10 కోట్ల నిధులు వెచ్చించిన నేపథ్యంలో.. ప్రతి పనికి సంబంధించిన వార్డు, ప్రాంతం, పనితీరు, వ్యయం, రహదారి పొడువు, లబ్ధిదారుల సంఖ్య, తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నగరవాసులు కోరుతున్నారు. అధికారిక లెక్కల్లో పనులు దాదాపు పూర్తయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆ పనుల్లో ఎన్ని ప్రజల అత్యవసర అవసరాలను తీర్చాయి? ఎన్ని భవిష్యత్ వాణిజ్య, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఉపయోగపడే ప్రాంతాల్లో ఉన్నాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిధులు ఖర్చు చేయడం ఒక్కటే లక్ష్యమా.. లేక ప్రజలకు అత్యవసరమైన చోటే ఖర్చు చేయడమే అసలు లక్ష్యమా? అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
104 సాక్షిగా... రంగుల రాజకీయం..!
విజయనగరం ఫోర్ట్: చేసినది తక్కువైనా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబుకు మించిన రాజకీయ నాయకుడు మరొకరు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేశారు. అమరావతి పనుల పేరుతో కమీషన్ల రూపంలో ప్రజాధనం లూటీ చేస్తూ... ఇప్పుడు 104 సాక్షిగా ప్రచార యావకు తెరతీశారు. రంగులు బాగున్న వాహనాలకు పసుపురంగు పులుముతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్రెడ్డి బొమ్మకనిపిస్తేనే శివాలెత్తిపోయే చంద్రబాబునాయుడు... ఇప్పుడు ఆరోగ్యసేవలను పక్కనపెట్టి ప్రచారానికి తెరతీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవల ను నిర్లక్ష్యం చేస్తూ... ప్రజల కళ్లుగప్పేందుకు రంగు లు పులుముతున్నారంటూ పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున భృతి చెల్లించేందుకు లేని డబ్బులు రంగులతో రాజకీయం చేసుందుకు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. రీఫ్యాబ్రికేషన్ పేరుతో 104 వాహనాలకు రంగులు పులిమేబదులు రోగులకు పూర్తిస్థాయిలో మందులు సమకూర్చితే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. వీటిలో మొదటి విడతగా 6 వాహనాలను రీఫాబ్రికేషన్ (రంగులు వేయించడం) కోసం విజయవాడకు వెళ్లాయి. వాటికి పూర్తయిన తర్వాత విడతలు వారీగా అన్ని వాహనాలకు పసుపురంగు వేయనున్నారు. ఇప్పటికే 108 అంబులెన్సులకు పూర్తి స్థాయిలో చంద్రబాబు సర్కారు రంగులను మార్చేసింది. ఇప్పుడు 104 వాహనాలకు మార్చుతోంది. రోగుల ఇబ్బందులు పట్టించుకోకుండా... 104 వాహనాలకు రంగులు మార్చడంపై చంద్రబాబు సర్కారు చూపుతున్న శ్రద్ధ రోగుల ఇబ్బందులను పరిష్కరించడంలో చూపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా 104 వాహనాల్లో మందులు పూర్తి స్థాయిలో లేక రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. రంగులు వేస్తున్నారు... రీఫ్యాబ్రికేషన్లో భాగంగా జిల్లాలోని ఆరు 104 వాహనాలకు విజయవాడలో రంగులు వేస్తున్నారు. వాటికి పూర్తయిన తర్వాత మిగతా వాటికి వేస్తారు. మందులు కొరత ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. – కె.శ్రీకాంత్, 104 జిల్లా మేనేజర్ వాహనాల రంగులు బాగున్నా పసుపు రంగు పులుముతున్న చంద్రబాబు సర్కారు ప్రచార యావకు ప్రజాధనం దుర్వినియోగం మరోవైపు మందులు లేక అల్లాడుతున్న రోగులు -
నేడు చెరకు రైతుల సమావేశం
రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలు ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నదని చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. చక్కెర కర్మాగారం పరిరక్షణలో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై రైతులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. మూడుకొండల ఆవల.. 24 గంటలు సీతంపేట: కొండకోనల్లో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, సీతంపేట పోలీసులు, గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం కిండంగి పంచాయతీ గులుమూరు గ్రామానికి చెందిన సవర రామ్మూర్తి, మహేశ్వరి దంపతుల పెద్దకుమా రుడు నాలుగేళ్ల వయస్సున్న సిద్ధు మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. తండ్రి ఉపాధి పనులకు వెళ్లాడు. తల్లి ఇంటివద్ద వంట పనులు చేసుకుంటోంది. ఈ సమయంలో బాలుడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయా డు. గ్రామంలో ఎక్క డో ఓ దగ్గర ఆడుకుని వస్తాడులే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు. సాయంత్రం వరకు బాలు డు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులతో కలిసి చుట్టుపక్క న గ్రామాలతో పాటు బంధువుల ఇళ్లల్లో గాలించా నా బాలుడి ఆచూకీ దొరకలేదు. వెంటనే సీతంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్ఐ వై.అమ్మన్నరావు ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ, సీఐల ఆధ్వర్యంలో ఎస్ఐ, స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నా గాలించాయి. కొండమార్గాలు, లోయలు, దట్టమైన అడవిని జల్లెడ పడుతూ, గ్రామస్తులతో కలిపి గాలించారు. గంటలు గడుస్తు న్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో గులుమూరు గ్రామానికి ఆనుకుని కొండప్రాంతంలోని లోయ పక్కన బాలుడి ఆచూకీ కను గొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్లు దూరంగా విస్తరించి ఉన్న మూడు కొండలు దాటి బాలుడు వెళ్లిపోయాడు. రాత్రంతా వర్షంలో తడుస్తూ ఒంటరిగానే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించిపోయాడు. బాలుడిని వెంటనే తల్లిదండ్రుల సమక్షంలో ప్రాథమిక చికిత్స కోసం కుశిమి పీహెచ్‌సీకి తరలించారు. -
నేర నియంత్రణపై సమీక్ష
విజయనగరం టౌన్: నేర నియంత్రణ, దర్యాప్తులో పురోగతి, నేరస్తులపై చర్యలు, ప్రజా భద్రత, తదితర అంశాలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ విశాఖ పట్టణంలోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఐదు జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం ఎస్పీ మాధవ్‌రెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాలు పాల్గొని.. జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎన్డీపీఎస్ కేసులు, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, సోషల్ మీడియా క్రైమ్స్, పల్లెనిద్ర, డిజిటల్ అరెస్టులు, మెగా వెహికల్ చెకింగ్లు, వినాయక చవితి పండగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. -
పెన్షన్లకు ఎన్నో అడ్డంకులు..!
● ఎన్నో మెలికలతో ప్రకటన విడుదల ● అర్హులందరికీ పెన్షన్లు అనుమానమే ● బడ్జెట్, వాయిదా పద్ధతిన మంజూరు చేస్తామంటున్న ప్రభుత్వంబలిజిపేట: పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఎన్నో అడ్డంకులు కనిపిస్తున్నాయి. దీంతో అర్హులైన ప్రతివారికీ పింఛన్ వస్తుందనే నమ్మకం లేదనే చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కూటమి ప్రభుత్వం పింఛన్ల మంజూరుకు ప్రకటన జారీ చేసిందే తప్ప.. లబ్ధిదారులపై ఎటువంటి ప్రేమలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేశారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపు, దశలవారీగా మంజూరు అంటూ కొన్ని మెలికలు పెట్టారు. దీంతో పెన్షన్ల మంజూరులో పారదర్శకత కనిపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచే పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడు వారి నుంచి సెర్ఫ్‌కు, అక్కడ నుంచి ప్రభుత్వం వద్దకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేరుతాయి. ఎంపీడీఓను దాటిన తర్వాత సెర్ఫ్‌కు వెళ్లేటప్పుడు అంతా జంతర్,మంతర్ జరగవచ్చని.. ఈలెక్కన అర్హులకు మొండిచేయి మిగులుతుందని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గానికి ఇన్ని పింఛన్లు అని చెప్పి కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన వాటిని పచ్చ నాయకులు సర్దుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో మెలికలు.. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలనే నిబంధన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఈ పరిస్థితి లేదు. దీంతో వారు ఓటీపీ చెప్పే అవకాశం ఉండదు కనుక అలాంటి వారిని తప్పించే అవకాశం ఉంది. ఇక డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకోవాలంటే సాంఘిక సంక్షేమ శాఖ జారీచేసిన సర్టిఫికెట్‌ను పొందుపరచాల్సి ఉంది. అది ఇప్పుటికప్పుడు కష్టసాధ్యంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒంటరి మహిళలకు సంబంధించి వివాహితురాలైతే కోర్టు లేదా అదాలత్ నుంచి విడాకుల పత్రం.. అవివాహితురాలైతే తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. ఇవన్నీ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశాలే. ఎలా దరఖాస్తు చేసేది.. సమయం తక్కువుగా ఉంది. సచివాలయాల్లో సిబ్బంది కూడా పెద్దగా లేరు. సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. పైగా లేనిపోని నిబంధనలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దరఖాస్తు ఎలా చేసేది. – దయానంద్, దరఖాస్తుదారు, పెదపెంకి -
రహదారులా.. నరకకూపాలా..?
● పాలకులకు పట్టదు.. అధికారులకు చేతకాదు.. ● రాకపోకలకు ఇబ్బంది పడుతున్న గిరిజనంకురుపాం: మండలంలోని రహదారులకు మోక్షమెప్పుడని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రాళ్లు తేలి గోతులమయంగా మారిన రహదారులతో గిరిజనులు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రహదారులు తప్పనిసరిగా ఉండాలి.కాని మండల పరిధిలోని చాలా గ్రామాలకు రహదారులు లేకపోవడంతో కనీసం 104, 108 వాహనాలు కూడా రావడం లేదు. తమ గ్రామాలకు రహదారులు మంజూరు చేయాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు గతంలో వినతిపత్రాలు అందజేసినా, అదుగో.. ఇదుగో.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పరిష్కార మార్గం చూపడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీలకంఠాపురం పంచాయతీలోని గంగన్నదొరవలస గ్రామ రహదారి రాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో పాటు వర్షం పడితే బురదమయంగా మారి రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జరడ గ్రామ రహదారి కోసం గ్రామస్తులు ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసనలు తెలియజేసినా అధికారుల్లో గాని పాలకుల్లో గాని చలనం రాకపోవడం విశేషం. ఉదయపురం పంచాయతీలోని రెల్లిగూడ గ్రామస్తులు అధికారులు, నాయకులు స్పందించక పోవడంతో శ్రమదానంతో గ్రామానికి రోడ్డు వేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. అదే పంచాయతీలోని జాకరగూడ గ్రామానికి వెళ్లే రహదారి కూడా బురదమయంగా ఉండడంతో గతంలో నాట్లు వేసి గిరిజనులు నిరసన తెలిపారు. ఇన్ని రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో గాని పాలకుల్లో గాని స్పందన రాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించకుంటే పోరాటం ఉధృతం చేయకతప్పదని ఆయా గ్రామాల గిరిజనులు స్పష్టం చేశారు. -
ఓవరాల్ చాంపియన్‌గా విశాఖ రేంజ్
● క్రీడాకారులను అభినందించిన ఐజీ గోపీనాథ్ జెట్టీవిజయనగరం టౌన్: మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగు వరకు నిర్వహించిన తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో విశాఖ రేంజ్ పోలీసులు అద్వితీయ ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 విభాగాల నుంచి సుమారు 1900 మంది పోలీసు అధికారు లు, క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విశాఖ రేంజ్ పరిధిలోని జిల్లాలు, కమిషనరేట్ మొత్తం 338 పతకాలు ( 197 స్వర్ణాలు, 82 రజతాలు, 59 కాంస్యాలు) సాధించి రాష్ట్రస్ధాయిలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ మేరకు ఐజీ విజేతలను బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. విజయనగరం జిల్లా పోలీసులు 39 స్వర్ణాలు, 21 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 74 పతకాలు సాధించారని చెప్పా రు. విశాఖ సిబ్బంది 70 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలు.. అనకాపల్లి జిల్లా సిబ్బంది 44 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలు.. శ్రీకాకుళం జిల్లా సిబ్బంది 18 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు.. పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులు 14 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా సిబ్బంది 12 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించారన్నారు. -
మున్సిపాలిటీ నుంచి తొలగించండి..
● గ్రామసభలో అధికారులకు తేల్చి చెప్పిన కొత్తవలస గ్రామస్తులురాజాం: రాజాం మున్సిపాలిటీలో రోజుకొక వివాదం తెరమీదకు వస్తోంది. 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి ఎలాకై నా ఎన్నికలు జరిపించేందుకు అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన కొత్తవలస గ్రామస్తులు.. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండురోజుల కిందట తమకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించారు. దీంతో కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి స్పందిస్తూ కొత్తవలస గ్రామంలో గ్రామసభ నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాజాం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, తహసీల్దార్ ఎం.రాజశేఖరం, ఎంపీడీఓ ఆనందరావు, పట్టణ సీఐ నవీన్‌కుమార్, తదితరులు గ్రామంలో బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ వేదికకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు. పంచాయతీగా ఉంటాం.. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ గ్రామం 2005కు ముందు ఏ మాదిరిగా పంచాయతీగా ఉందో అదేవిధంగా ఉంచాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు అధికంగా ఉన్నాయని తెలిపారు. పంచాయతీగా ఉంటే తమకు నచ్చిన వ్యక్తిని సర్పంచ్‌గా చేసుకుని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీలో ఉన్నప్పటి నుంచి సక్రమంగా పారిశుధ్య పనులు కూడా చేపట్టడం లేదని వాపోయారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉంగటి శంకర్, తవిటినాయుడు, వాన అసిరినాయుడు, బట్న మురళీకృష్ణ, హరి, వాన అలివేలమ్మ, ఉంగటి సూరీడు, పసుపురెడ్డి సత్యవతి, నక్క గౌరి, వాన రమణమ్మ, తదితరులు మాట్లాడారు. టీడీపీ నేతల కొత్త డ్రామా.. ఇదిలా ఉండగా గ్రామసభ జరుగుతుండగా ఈ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అధికారులను కలిశారు. గోపాలపురం, అమ్మవారికాలనీ, ఆదర్శనగర్, తదితర ప్రాంతాలను మున్సిపాలిటీలోనే ఉంచాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఇంతపెద్ద ఎత్తున కొత్తవలసలో ప్రజలు మున్సిపాలిటీని వ్యతిరేకిస్తుంటే, ఆ గ్రామసభకు టీడీపీ నేతలు నేరుగా వచ్చి పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలోనే ఉంచాలనే వినతిపత్రం ఇవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. -
సేంద్రియ పంటల పరిశీలన
కురుపాం: మండలంలో జట్టు సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న పంటలను ఆఫీస్ ఆఫ్ ఇంటర్నల్ ఓవర్ సైట్ సర్వీసెస్ (ఓఐఓఎస్) చెందిన సభ్యులు కరోలిన్ కురియా, జోసెఫిన్ బుధవారం పరిశీలించారు. ఆగంగూడ, తిత్తిరి, బొడ్డమానుగూడ, దూళికుప్ప గ్రామాల్లో పర్యటించి, జట్టు సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనసాగుతున్న జీవనోపాధి కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా నాటుకోళ్ల ఫారం, ఔషధ మొక్కల సాగు, సేంద్రియ పంటల సాగు విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయని వారు అభిప్రాయపడ్డారు. 12న ఉరుసు ఉత్సవం విజయనగరం క్రైమ్: స్థానిక కుముందన్ వీధిలో ఈ నెల 12వ తేదీన హజ్రత్ సయ్యద్ బాబా ఉరుసు ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్ దాదా, షేక్ జాన్‌లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు దర్గా వద్ద విశాఖపట్నానికి చెందిన హఫీజ్ ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందన్నారు. తొలుత దర్గా నుంచి చందనోత్సవం ఊరేగింపు అట్టహాసంగా జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధిపై అవగాహన ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ప్రతి గ్రామంలో కుష్టువ్యాధిపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ఎస్. జీవనరాణి తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కుష్టువ్యాధి కేసుల గుర్తింపుపై పీహెచ్సీ వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుష్టువ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా అంగవైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. మేల్ వలంటీర్, ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఇంటింటి చేపట్టి, అనుమానితులను గుర్తించి, వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. అంతకుముందు వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణధికారి కె. రాణి, తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి నెల్లిమర్ల రూరల్: విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్సీలకు కేటాయించాలని జైభీమ్‌రావ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య కోరారు. ఇదే విషయమై ఆయన మండలంలోని సతివాడ గ్రామంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించలేదని, దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా ఎస్సీలకు జెడ్పీ చైర్మన్ సీటు కేటాయించాలన్నారు. ఎస్సీ యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ముగిసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విజయనగరం క్రైమ్: స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక, విజయనగరం కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్ సీపీ నాయకురాలు కోలగట్ల శ్రావణి హాజరై కాసేపు ప్రసంగించారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలని, రోజులో ఎంతో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. శ్రీకృష్ణుడు బోధనలు అనుసరణీయమని, ఆయన అనుసరించిన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అనంతరం పురవీధుల్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగించారు. రాజీవ్‌నగర్ కాలనీ, దాసన్నపేట, రింగురోడ్డు, కోట జంక్షన్ మీదుగా సాగిన ఈ ఊరేగింపులో పలువురు చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో అలరించారు. -
విద్య భవిష్యత్‌కు పునాది
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరంలీగల్: విద్య భవిష్యత్‌కు పునాది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ బబిత అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మాట్లాడుతూ అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి తన హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణ గురించి తెలుసుకోవాలన్నారు. చిన్నారుల భవిష్యత్‌కు విద్య పునాది అని పాఠశాల విద్యను మధ్యలోనే నిలిపివేయకుండా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. డ్రాపౌట్ పిల్లల కుటుంబాలకు విద్య ప్రాముఖ్యత, పిల్లల హక్కులు, బాల కార్మికత్వం, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వ విద్యా పథకాలు, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం గురించి వివరించారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత ప్రభుత్వ విభాగాలను, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి అవసరమైన ఉచిత న్యాయ సహాయం, మార్గదర్శకత్వం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ అధికార సంస్థ సెక్రటరీ డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం మండల విద్యాశాఖాధికారి ఆనందమూర్తి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్టుమెంటు హెడ్ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
గడువులోగా సౌర లక్ష్యాలు పూర్తి కావాలి
● ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పార్వతీపురం రూరల్: ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లకు ఉద్దేశించిన రూఫ్‌టాప్ సోలార్ పనులను శరవేగంగా సాగించి, నిర్దేశించిన గడువులోపు వంద శాతం పూర్తి చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. స్థానిక పార్వతీపురం మన్యం సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది, సోలార్ వెండార్లతో సౌర విద్యుదీకరణ (యూఎల్ఏ) ప్రగతిపై ఆయన మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ ఉద్యోగులు, వెండార్లు ఎదుర్కొంటున్న సాంకేతిక ఆటంకాలు, సందేహాలను అడిగి తెలుసుకున్న ఆయన.. వాటికి తక్షణ పరిష్కార మార్గాలు సూచించారు. పనుల్లో అలసత్వం వీడి, సమన్వయంతో అడుగులు వేస్తూ సౌర విద్యుత్ ప్రక్రియను లక్ష్యానికి అనుగుణంగా పరుగులు పెట్టించాలని దిశానిర్దేశం చేశారు. సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) పి.త్రినాథరావు, జనరల్ మేనేజర్ (నోడల్ ఆఫీసర్) కె.సత్యనారాయణ, సాంకేతిక ఈఈ డి.పురుషోత్తం, పాలకొండ ఈఈ కె.విష్ణుమూర్తితో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
నగరంలో పోలీసుల మెగా డ్రైవ్
● 150 ప్రాంతాలు.. 800 మంది పోలీసులు ● స్వీయపర్యవేక్షణ చేసిన ఎస్పీవిజయనగరం టౌన్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ ఎఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ముందుగా గుర్తించిన 150 ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రహదారి భద్రత, హెల్మెట్ ధారణ పట్ల అవగాహనే లక్ష్యంగా పట్టణంలో ఆకస్మికంగా వాహన తనిఖీలను చేపట్టి, స్వీయపర్యవేక్షణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వాహన తనిఖీలను చేపట్టేందుకు 150 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. తనిఖీల్లో 800 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వినియోగించామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలను వాహనదారులకు వివరించి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు సరైన ఇన్సూరెన్స్ లేకుంటే కలిగే అనర్ధాలను వాహనదారులకు వివరించి, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని సూచించామన్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఈ చలానా విధించేందుకు బదులుగా వెంటనే ఆయా వాహనాలకు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చేయించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. తనిఖీల్లో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు పలువురు జిల్లా క్రీడాకారులకు అవకాశం లభించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలు అర్హత సాధించారు. జావిలిన్ త్రోలో ఉదయ్, 400 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్.సందీప్, త్రిపుల్ జంప్‌లో పి.పవన్‌కళ్యాణ్, 400/800 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్.యశోద జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్కిషోర్లు అభినందించారు. -
పదాల సవ్వడి.. పుర్రేయవలస బడి...
చీపురుపల్లి: ఆ పాఠశాలకు వెళ్తే తరగతి గదుల్లో గోడలు ఖాళీగా కనిపించవు. విద్యార్థులు నుంచి తెలుగు, ఆంగ్ల పదాలు తప్ప మరో మాట వినిపించదు. తరగతి గది గోడలపై ఎటు చూసినా ఏదో ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. విద్యార్థులకు ఆ రోజంతా ఏదో ఒక యాక్టివిటీతోనే గడిచిపోతుంది. అందుకనే ఆ పాఠశాలకు ఎవరు వెళ్లినా పదాల సవ్వడితో సందడిగా ఆహ్వానం పలుకుతుంది. అదే మండలంలోని పుర్రేయవలస బడి. ఇక్కడి పాఠశాలలో ఏదో ఆదరా బాదరగా పాఠ్యాంశాలు బోధన ఉండదు. ప్రతీ సబ్జెక్టులోనూ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం) వినియోగిస్తూనే బోధన సాగిస్తుండడంతో విద్యార్థుల్లో ఆ పాఠ్యాంశం ఆకట్టుకుంటుంది. ఉపాధ్యాయుల్లో ప్రత్యేక శ్రద్ధ ఉండాలిగాని ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుందని చెప్పడానికి పుర్రేయవలస ప్రాధమిక పాఠశాల తరగతి గదుల్లో అనుసరిస్తున్న విద్యాబోధన నిదర్శనంగా నిలుస్తోంది. తరగతి గదిలో ఎటు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలే పుర్రేయవలస ప్రాధమిక పాఠశాలలో తరగతి గోడలు ఖాళీగా ఉండవు. ఎటు వైపు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలతో కూడిన చార్టులు, చిత్రాలు దర్శనమిస్తాయి. తెలుగు, ఇంగ్లిష్‌లో కఠిన పదాలు నుంచి ఇంగ్లిష్ గ్రామర్‌కు సంబంధించిన చార్టులు, కాన్సెప్ట్ వంటి ఎన్నో చార్టులు పాఠశాల హెచ్ఎం ఎంవి.భారతి, సహాయ ఉపాధ్యాయుడు అప్పలనాయుడులు తమ ఇళ్ల వద్ద స్వంతంగా తయారు చేసి పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు బోధిస్తుంటారు. విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడం కోసం ప్రతీ పాఠ్యాంశాన్ని టీఎల్ంఎ ద్వారానే బోధిస్తుంటారు. టీఎల్ఎం, చార్టులు, చిత్రాలు తయారీకు ఎలాంటి నిధులు ఉండకపోయినప్పటికీ స్వంత నిధులతోనే సిద్ధం చేస్తుంటారు. ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్ బోధన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రెండు, మూడు తరగతుల నుంచి ఇంగ్లిష్ గ్రామర్ బోధన వింటుంటాం. అయితే వారికి ధీటుగా పుర్రేయవలస ప్రాధమిక పాఠశాలలో కూడా ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్ బోధిస్తున్నారు. గ్రామర్‌కు సంబంధించి టెన్సెస్, వెర్బ్, యాడ్జెక్టివ్, నౌన్, ప్రౌనౌన్ వంటి గ్రామర్ అంశాలు అక్కడ విద్యార్థులకు చిన్న వయస్సులోనే పరిచయం చేస్తున్నారు. తెలుగులో సైతం గుణింతాలు, ద్విత్తక్షరాలు, గణితంలో టేబుల్స్ తదితర చార్టులు ప్రదర్శించి నిరంతరం విద్యార్థులతో సాధన చేయిస్తుంటారు. ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్‌లో తర్ఫీదు తరగతి గదిలో ఎటు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలే.. ప్రతీ పాఠ్యాంశాన్ని టీఎల్ఎం ద్వారా బోధనప్రాధమిక స్థాయిలోనే మంచి పునాది ఉండాలి పాఠశాలకు వచ్చే పిల్లలకు ప్రాధమిక స్థాయిలోనే మంచి పునాది ఉండాలి. ప్రభుత్వ పాఠశాలకు పేద వర్గాలకు చెందిన పిల్లలే వస్తారు. అలాంటి వారిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యం. అందుకనే ఇంగ్లిష్, తెలుగులో ప్రతీ పాఠానికి టీఎల్ఎం ద్వారా బోధిస్తాం. ఇంగ్లిష్ గ్రామర్‌లో నౌన్స్, టెన్సెస్, స్పెల్లింగ్స్, కాన్సెప్ట్ మ్యాపింగ్, పిక్చర్ డిస్క్రిప్షన్ వంటి బోధన సాగిస్తున్నాం. తరగతి గది మోడల్‌గా ఉంటే విద్యార్థులు కూడా అంతే ఆదర్శంగా తయారవుతారు. – ఎంవి.భారతి, హెచ్ఎం, పుర్రేయవలస ప్రాధమిక పాఠశాల, చీపురుపల్లి -
గడువులోగా పింఛన్ల ప్రక్రియ పూర్తి కావాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన నమోదు, క్షేత్ర స్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ పక్రియలను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కొత్త పింఛన్లు దరఖాస్తులను స్వీకరించి ప్రాధమిక వివరాలను పరిశీలించి ఎస్జీఎస్డబ్ల్యూ న్యూ పెన్షన్ సర్వీసులో ఆన్లైన్లో నమెదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తు విజయవంతంగా నమోదు చేసిన వెంటనే దరఖాస్తుదారునికి సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అకనాలెడ్జ్మెంట్ అందజేయాలన్నారు. ెఈ నెల 17 నుంచి 21 వరకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు వార్డు వేల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శులు అర్హత కల్గిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి అర్హత ప్రమాణాలు, సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించి, భౌతిక పరిశీలన నివేదికను నమోదు చేయాలన్నారు. దరఖాస్తు ఈకేవైసీ పూర్తి కాని వారి నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన సమయంలో ఈకేవైసీ తీసుకోవాలన్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తులను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఒంటరి మహిళల దరఖాస్తులను తహసీల్దార్లకు, నేత కార్మికులు, మత్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీ దారులు, తాటి చెట్టు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్ల వర్గాలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా స్థాయి అధికారులకు పంపించాలన్నారు. ఎంపీడీఓలు పింఛన్లను నేరుగా మంజూరు చేయరాదని, అర్హులైన దరఖాస్తులను సంబంధిత రాష్ట్ర స్థాయి లేదా సెర్ప్ అధికారులకు సిఫార్సు చేయాలన్నారు. పింఛను మంజూరు అయిన నెల నుంచే పింఛను చెల్లింపు ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...
● వైఎస్సార్సీపీ నాయకునిపై ఓ వ్యక్తి దౌర్జన్యంగజపతినగరం రూరల్ (జామి): ‘అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...అమ్మ తోడు...’ ఇది ఓ సినిమాలో ఓ ప్రముఖ కథనాయకుడు చెప్పిన డైలాగ్. ఇది అప్పట్లో బాగానే వర్కవుట్ అయ్యింది. సినిమా కూడా హిట్ అయ్యింది. మరి ఈ సినిమా చూశాడో ఏమోగాని... ప్రస్తుతం ఓ వ్యక్తి వైఎస్సార్సీపీ నాయకుడిని ఇలాగే... బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...జామి మండలం భీమసింగి గ్రామంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పాండ్రంగి సంజీవిపై అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు దౌర్జన్యానికి దిగిన సంఘటన ఇది. దీనిపై పాండ్రంకి సంజీవి జామి పోలీసులకు సోమవారం ఫిర్యాదు కూడా చేశాడు. ఇదే విషయమై సంజీవి స్థానిక విలేకరులకు మంగళవారం వివరాలు వెల్లడించారు. భీమసింగి గ్రామకంఠం సర్వే నంబరు 120లో సంజీవికి 19 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలానికి అడ్డంగా అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు సోమవారం ట్రాక్టర్ లోడ్ రాయి తీసుకువచ్చి వేయించాడు. దీంతో సంజీవికి తన స్థలంలోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన సంజీవిపై శంకరరావు దౌర్జన్యానికి దిగాడు. ఈ స్థలం నాది.. అడ్డొస్తే నరికి చంపుతానని.. బెదిరిస్తూ దుర్భాషలాడాడు. దీంతో గత్యంతరం లేక సంజీవి జామి పోలీసులను ఆశ్రయించాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వీర జనార్దన్ మంగళవారం తెలిపారు. దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అడ్డొచ్చిన వ్యక్తిపై హత్యాయత్నం
గంట్యాడ: డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను వేధిస్తూ వారిపై దాడికి యత్నించిన యువకుడిని అడ్డుకున్న వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని మధుపాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మధుపాడ గ్రామానికి చెందిన సీహెచ్ విజయ్‌కుమార్ తన తల్లిదండ్రులు సన్యాసిప్పుడు, ఈశ్వరమ్మను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాడికి యత్నించాడు. అదే సమయంలో సమీపంలో ఉన్న ద్వారపురెడ్డి కృష్ణ అడ్డుకోవడంతో విజయ్‌కుమార్ ఆయుధంతో అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణ చెవికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి రలించారు. ఘటనపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సాయికృష్ణ తెలిపారు. కారు షెడ్లో అగ్ని ప్రమాదం కొత్తవలస: మండలంలోని అరుకు–విశాఖ జాతీయ రహదారిని ఆనుకొని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల ఎస్ఎల్జీ కార్ కేర్ కార్ మెకానిక్ షెడ్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో షెడ్లో గల మూడు కార్లు, రెండు పాత కార్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద వార్త తెలుసుకొని కొత్తవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు షెడ్ యజమాని కె.గౌరీపతి తెలిపారు. 10 నుంచి జేవీవీ ఆధ్వర్యంలో వక్తృత్వ, కథల పోటీలు విజయనగరం అర్బన్: విద్యార్థులను మంచి ఉపన్యాసకులుగా, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి వక్తృత్వ, కథల పోటీలను నిర్వహించనున్నట్టు జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరుకొండ ఆనంద్, డాక్టర్ మిరియాల కృష్ణారావు తెలిపారు. కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను వారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. జేవీవీ జాతీయ నాయకుడు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, జిల్లా కోశాధికారి శివాజీ, తిరుపతిరావు, చిరంజీవి, సత్యనారాయణ, ఈశ్వర్ పాల్గొన్నారు.


