రెవెన్యూ లీలలు..!
అలా ఎలా మార్చేస్తారు..?
చీపురుపల్లి:
జిల్లాలో కొందరు రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల తప్పిదాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. ఒకరి ఆధీనంలో ఉన్న భూమి వేరొకరిపేరుపై మారిపోతున్న తీరు ఆవేద నకు గురిచేస్తోంది. లంచాల ముసుగులో ఇష్టారాజ్యంగా రికార్డులు తారుమారు చేస్తుండడంతో అమాయకులైన రైతులు బలైపోతున్నారు. లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి కొత్తతరహా రెవెన్యూ అక్రమాలు ఎన్నడూ చూడలే దంటూ చీపురుపల్లి మండలం కర్లాం గ్రామ రైతులు గగ్గోలుపెడుతున్నారు. 1980 నుంచి భూములు సాగు చేసుకుంటున్న రైతులకు తెలియకుండానే పక్క జిల్లాలోని సంబంధం లేని వ్యక్తుల పేరున భూములు మార్చేయడం, ఒన్‌బీలు మంజూరు చేసిన ఘటన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండి, భూములు తమ సాగులోనే ఉన్నప్పటికీ రికార్డులు ఎలా మార్చేస్తారన్న కర్లాం రైతుల ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం కరువవుతోంది. 46 సంవత్సరాల కిందట రిజిస్టర్ కాబడిన ఆ భూములు ఇప్పుడు సంబంధంలేని వ్యక్తుల పేర్లుతో మార్చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
కర్లాం గ్రామంలో సర్వే నంబర్ 76లో 21 ఎకరాల భూములు ఉండేవి. ఆ భూములు అప్పటి వరకు రాజుల ఆధీనంలో ఉండేవి. అయితే, తరువాత కాలంలో వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన రాజులు.. 1980లోనే చాలా మంది రైతులకు రిజిస్ట్రేషన్లు చేసి మరీ భూములు ఇచ్చేశారు. ఆ భూములను తాజాగా సంబంధం లేని వారసులను పుట్టించి గెడ్డకంచరాం గ్రామానికి చెందిన శిరువూరు సూరీడమ్మ పేరున 3.11 ఎకరాలకు వన్‌బీలను చీపురుపల్లి రెవెన్యూ కార్యాలయం నుంచి మంజూరు చేశారు. ఆమె భూమిని తన కుమార్తె గొట్టిముక్కల నాగమ
ణికు రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో నాగమణి కర్లాం సహకార బ్యాంకులో రూ.15 లక్షల రుణం కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు మా భూములను సూరీడమ్మ పేరున ఎలా ఒన్‌బీలు ఇస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఒకరి భూమి వేరొకరికి బదలాయింపు
భూములతో సంబంధం లేని వారికి కొత్తగా ఒన్‌బీల మంజూరు
వాటితోనే రిజిస్ట్రేషన్లు
ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్టు సమాచారం
ఆవేదనలో కర్లాం గ్రామ రైతులు


