క్విజ్‌బోర్డు ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: ఏపీ మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం రూపొందించిన ఇంటరాక్టివ్ క్విజ్ బోర్డును జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. నాలుగువేల బిట్స్‌తో రూ పొందించిన ఈ క్విజ్ బోర్డును నెల్లిమర్ల మండలం చిమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్ రూపొందించారు. 4, 5వ తరగతుల అన్ని సబ్జెక్టుల పాఠాలపై సీబీఏ మోడల్‌లో ప్రాక్టీస్ బిట్స్ అందుబాటు లో ఉండేలా డిజైన్ చేశారు. విద్యార్థులు ఉచితంగా వినియోగించుకునే విధంగా ఈ డాస్‌బోర్డను ‘రాజ్‌క్లాస్‌రూం.కాం’ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ క్విజ్‌బోర్డ్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రాజేష్ ప్రయత్నాన్ని డీసీఈబీ చైర్మన్ టి.సన్యాసిరాజు, ఎంఈఓ–1, 2 మూర్తి, త్రినాథ్, మర్రాపు శ్రీనివాసరావు, ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివాస్ అభినందించారు.
నైట్ డ్యూటీలపై నిలదీత
వంగర: మండలంలోని సంగాం వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయం వద్ద ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల విధులకు వివిధ గ్రామాలకు చెందిన సచివాలయ ఉద్యోగులను, మహిళా పోలీసులను నియమించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎటువంటి సమాచారం లేకుండా రాత్రిషిప్ట్‌లో డ్యూటీలు వేయడం సరికాదంటూ వంగర మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం భోజన విరామం సమయంలో నిరసన తెలిపారు. ఎంపీడీఓ రాజారావును ప్రశ్నించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. శివరాత్రి ఉత్సవాల్లో సచివాలయాల ఉద్యోగులకు రాత్రి పూటీ డ్యూటీవేస్తూ ఆర్డీవో ఆదేశాల మేరకు ఎంపీడీఓ జారీ చేసిన ఆదేశాలపై ఈ నెల 12వ తేదీన సాక్షిలో ‘శివ..శివా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసినట్లు ఎంపీడీవో ప్రకటించగా, మహిళా ఉద్యోగులకు మహాశివరాత్రి డ్యూటీలను పూర్తిగా రద్దుచేస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రబాబు సర్కారుపై మండిపాటు
చంద్రబాబు సర్కారుపై ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులకు నైట్ డ్యూటీ లు, అదనపు డ్యూటీలు వేశారన్న విషయం తెలుసుకొని ఉద్యోగులకు అండగా నిలిచారు. ఇప్పటికే వివిధ రకాల సర్వేల పేరుతో సచివాలయాల ఉద్యోగులు ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఇదే సమయంలో మహాశిరాత్రి ఉత్సవాలు పేరుతో నైట్ షిఫ్టుల్లో డ్యూటీలు వేయడం తగదన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీని కలిసిన సచివాలయాల ఉద్యోగులకు ఆయన భరోసా కల్పించారు.
ఉపాధి పనిదినాలు పెరగాలి
విజయనగరం కల్టెరేట్: ఉపాధి హామీ వేతనదారుల కుటుంబాలకు 100 రోజులు పనికల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం సంబంధిత అధికారులతో పాటు పలు శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో శుక్రవారం మాట్లాడారు. మార్చినెల లోపు ఉపాధి లక్ష్యాలు చేరుకోవాలన్నారు. వాట్సాప్, ఈ సర్వీసు సేవలపై అవగహన కలిగించాలన్నారు. శివరాత్రి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో సీపీఓ సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు, డ్వామా పీడీ శారదాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జంతు సంక్షేమానికి కృషిచేయాలి
విజయనగరం టౌన్: జంతు సంక్షేమంలోనే మానవ సంక్షేమం ఉందని, జంతు సంక్షేమానికి పౌరులందరూ కృషిచేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ గో సంరక్షణ సమాఖ్య రూపొందించిన గోమాత చిత్ర పటంతో కూడిన క్యాలెండర్‌ను శుక్రవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో గోసంరక్షణ సమాఖ్య అధ్యక్ష్యుడు లోగిశ రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కేదారిశెట్టి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి బి.సంధ్యారాణి పాల్గొన్నారు.
క్విజ్‌బోర్డు ఆవిష్కరణ
క్విజ్‌బోర్డు ఆవిష్కరణ


