హైదరాబాద్ : అమీర్‌పేట ప్రబంధక్ కమిటీ గురుద్వారలో మంగళవారం ఖాల్సా సాజనా దివస్ (ఖాల్సా పంథ్ స్థాపన దినోత్సవం వైశాఖీ)ని ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లో ప్రధాన ఘట్టమైన విశాల్ దివస్ కార్యక్రమాన్ని గురుగోవింద్‌సింగ్‌జీ క్రీడా మైదానంలో భక్తిశ్రద్ధలతో జరిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన సిక్కుల ర్యాలీ ఆకట్టుకుంది.


