హైదరాబాద్ : నెహ్రూ జూ పార్కులోని మూగజీవులను వేసవి తాపం నుంచి రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పులులు, ఏనుగులు, ఇతర జంతువుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. చల్లదనాన్ని అందించేందుకు నీటి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు.
జింకలు, పక్షులు నీడను కల్పించేందుకు తాటాకు పందిళ్లు ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో పిల్లలతో పాటు పెద్దలు కుటుంబ సమేతంగా జూ పార్కును సందర్శిస్తున్నారు.
–సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్


