ఆ గాయం ఆమె లైఫ్‌నే టర్న్‌ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా.. | Doctrs said will never walk But this woman reversed health with Indian food | Sakshi
Sakshi News home page

ఆ గాయం ఆమె లైఫ్‌నే టర్న్‌ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..

Apr 14 2026 4:06 PM | Updated on Apr 14 2026 6:09 PM

Doctrs said will never walk But this woman reversed health with Indian food

ఏదైనా అనారోగ్యం లేదా గాయల పాలైతే భయపడిపోకుండా ధైర్యం కూడగట్టుకుని చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్నేహితులు, సన్నిహితుల మద్దతు తీసుకోవాలి. కానీ కొన్ని గాయాలు మనల్ని ఎంతగా కుంగదీస్తాయంటే..ఇక అయిపోయింది లైఫ్‌ అన్నట్లుగా ఉంటాయి. డాక్టర్లు కూడా చేతులెత్తేస్తారు. అలాంటి సమయంలో కూడా తెగువతో బతికిచూపడమే గాక..విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుంటోంది ఈ ధీర వనిత.

ఆ ధైర్యవంతురాలే పల్లవి కుమార్‌ అగర్వాల్‌గా పిలిచే మీరా. ఆమె జీవితం ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు చవిచూసింది. మీరా పాట్నాకి చెందిన మహిళ. ఆమె ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ సమయంలో పూర్తి స్థాయి మాంసాహారి. ఫిట్‌నెస్‌, వ్యాయామాలపై విపరీతమై ఆసక్తి కూడా. 

ఆమె పెద్ద కార్పొరేషన్‌ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌గా డిజైన్‌ అండ్‌ ప్రొడక్ట్‌ హెడ్‌గా అత్యంత ఒత్తిడితో కూడిన షెడ్యూల్‌ని నిర్వహిస్తూనే మారథాన్‌లలో పరిగెత్తేవారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించేవారు. కానీ ఆ రోజు ఆమె మోకాలికి అయిన గాయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఓ మలుపు తిప్పింది. ఆ మోకాలి గాయం ఆమెను మళ్లీ జీవితంలో నడవనివ్వకుండా చేసింది. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కొన్ని రకాల వ్యాయామాలు, మందులతో రెండు అడుగులు వేయొచ్చు అంతే తప్ప సరిగ్గా నడవడం గానీ పరిగెత్తడం వంటివి చేయలేవని తేల్చేశారు. 

దాంతో మీరా ఆ గాయం క్యూర్‌ అయ్యేలా పలు రకాల చికిత్సల కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టింది, లెక్కలేనన్ని మందుల మింగింది. అప్పడు మీరా తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురయ్యింది. జీవితమంతా వ్యాయామాలు చేసి ఎంతో హెల్దీగా ఉండే మీరాకి నడవలేవని చెబుతున్న మాటలను జీర్ణించుకోలేకపోయింది. అప్పుడే ఆమె తనలా తీవ్రమైన గాయాల బారినపడి తిరిగి అథ్లెట్లుగా దూసుకొచ్చిన మహిళల ఉదంతాలు చదవడం ప్రారంభించింది. 

అంతేగాదు ఆ మహిళల జీవితాలు, వారి లైఫ్‌స్టైల్‌ గురించి క్షణ్ణంగా చదివేది. 'ది గేమ్ ఛేంజర్స్' అనే నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మీరాని ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో మీరా ఇదివరికటిలా యాక్టివ్‌గా మారింది. అంతేగాదు పాలు, మాంస ఉత్పత్తులను పూర్తిగా మానేసి..పూర్తిగా సాంప్రదాయ భారతీయ ఆహారానికి మారింది. తన భోజనంలో రాగి, కొబ్బరి, చిరుధాన్యాలు, పప్పులను చేర్చుకోవడం ప్రారంభించిది. చెప్పాలంటే పూర్తి శాకాహారిగా మారిపోయింది. 

అలాగే రకరకాల వంటకాలప ‍ప్రయోగాలు ప్రారంభించి సొంతంగా రాగిపాలు, కొబ్బరి మజ్జిగను తయారు చేయడం ప్రారంభించింది. ఈ కొబ్బరి పానీయాన్ని తన కుటుంబసభ్యులు కూడా ఇష్టపడతారని అంటోంది. అంతేగాదు ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త పరీక్ష ఫలితాల్లో అద్భుతాన్నే చూడొచ్చని అంటోంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటోంది. వీటితోపాటు ఆహారంలో హలీమ్‌ లడ్డూలు, నట్స్‌, వివిధ సీడ్స్‌ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంది. అయితే బేకరీ స్వీట్లు, కేక్‌లు, కుకీలకు దూరమైపోయింది. ఆమెకు కాఫీ తోపాటు వాటిని తినే అలవాటు ఉండటంతో..మళ్లీ బేకరీ ఉత్పత్తులను హెల్దీగా చేయడంపై దృష్టి సారించి పలు రకాల వంటకాలు చేసింది. 

అవన్నీ పాలు, వెన్నకు బదులు, నట్‌ బటర్లు, కోల్డ్‌ప్రెస్‌ నూనెలు, శాకాహార పాలతోనే చేసేది. పైగా ఆమె వంటకాల రుచికి ఫిదా అవ్వతూ స్నేహితులు, బంధువులు బేకరీని ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా 'ఇడున్‌' అనే బేకరీని ప్రారంభించింది. అయితే ఆమె ఏమి చెఫ్‌ స్పెషలిస్ట్‌ కాదు. అయినప్పటికీ కుకీలను ఎంతో రుచికరంగా, పోషకమైనవిగా తయారు చేయడం ఆమె స్పెషాల్టీ. అలాగే ఆయుర్వేదం చక్కెరను చెడ్డదిగా చెప్పదని, తీసుకోవాల్సిన విధంగా మితంగా తీసుకుంటే మంచిదేనని అంటోంది మీరా. 

ఆమె ఆయుర్వేద సూత్రాలు పాటిస్తూ..తిరిగి హెల్దీగా ఉండేలా కేర్‌ తీసుంటోంది కూడా. అంతేగాదు అక్కడితో మీరా ప్రస్థానం ఆగిపోలేదు. తిరిగి నడవలేవు అన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా లడఖ్ మారథాన్‌లో పాల్గొని నిర్దేశించిన సమయాని కంటే ముందుగానే పూర్తి చేసి శెభాష్‌ అనిపించుకుంది. తన అవరోధాన్ని, పరిమితులను ధిక్కరించేలా ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌లకు ట్రెక్కింగ్‌ చేయడం, ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న యూనం పర్వతాన్ని అధిరోహించడం, ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్రెండ్‌షిప్ పీక్‌ను జయించడం వంటివి చేసింది. కష్టాలు, గాయాలు మనల్ని కోలుకోనీయకుండా చేయొచ్చేమో గానీ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు, తిరిగి విధికే ఛాలెంజ్‌ విసిరేలా నిలదొక్కుకోవాలనే సారాంశం మీరా స్టోరీ చెబుతోంది కదూ..!.

(చదవండి: అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్‌..! ఆ శారీ ప్రత్యేకతలివే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement