టాలీవుడ్ హీరో మహేశ్ బాబు తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి టైమ్ కేటాయించేవారు.
అలానే ప్రిన్స్ సైతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తుంటారు.
ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లో ట్రిప్ అంటే చాలా ఇష్టమని మహేశ్ బాబు అన్నారు.
అలా తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


