పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్‌ | wedding car decoration with fruits and snack goes viral | Sakshi
Sakshi News home page

పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్‌

Apr 14 2026 3:55 PM | Updated on Apr 14 2026 4:30 PM

wedding car decoration with fruits and snack goes viral

వివాహ  వేడుక అనగానే పూలపందిరి, పట్టుబట్టలు, బాజీ భజంత్రీలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీచాలా కామన్‌.అలాగే  పెళ్ళి పెళ్లి కారును రకరకాల పూలతో అందంగా అలంకరించుకోవడం కూడా సాధారణం. కానీ  ఒక పెళ్లి కారును వెరైటీగా అలంకరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.  

అందరిలాగా మనమూ చేస్తే, మన స్పెషల్‌ ఏమిటి అనుకున్నారో ఏమోగానీ సాంప్రదాయ పూల అలంకరణలకు భిన్నంగా, ఒడిశాకు చెందిన ఒక వరుడు తమ పెళ్లి కారు అలంకరణలో ఒక కొత్త ట్రెండ్  సృష్టించారు. పూలతో పాటు తన కారును రంగురంగుల ద్రాక్ష గుత్తులు, ఆరెంజ్, పైనాపిల్‌, ఆపిల్స్‌ ఇలా రకరకాల పండ్లతో రంగు రంగులతో అదిరిపోయేలా ఎంతో శ్రద్ధగా అలంకరించారు. కారు విండ్‌షీల్డ్, బాడీ అంతా పండ్లతో నింపేశారు.  రొటీన్‌గా పూలతో కాకుండా పళ్లతో అలంకరించిన పెళ్లి కారు  ముస్తాబు చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వినూత్న ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 ఒక మేరకు పళ్లు  వరకు ఒకే.. కానీ ఏకంగా స్నాక్స్‌ ప్యాకెట్లతో  డెకరేట్‌ చేసిన వైనం కూడా మళ్లీ నెట్టింట  సందడి చేస్తోంది.   2019లో ఒడిశాకు చెందిన వరుడు తన కారును వందలాది చిప్స్, కుర్కురే ప్యాకెట్లతో అలంకరించాడు.  ఏదో పచారీ షాపులో వేలాడదీసినట్లుగా ఈ ప్యాకెట్లను వరుసగా అతికించారు. ఈ వీడియోలపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ఫన్నీ కామెంట్స్‌ చేయగా, వెర్రి వేయిరకాలు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement