ఊపందుకున్న పోస్టుకార్డు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న పోస్టుకార్డు ఉద్యమం

Feb 14 2026 10:14 AM | Updated on Feb 14 2026 10:14 AM

 ఊపందుకున్న పోస్టుకార్డు ఉద్యమం

ఊపందుకున్న పోస్టుకార్డు ఉద్యమం

తమ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు తలపెట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఊపందుకుంది. తక్షణమే పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించాలని, 29 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, ఓపీఎస్‌ అమలుచేయాలని, బకాయిలు రూ.30వేల కోట్లను చెల్లించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు పోస్టుకార్డులు పంపించారు. వాటిని ముందుగా నెల్లిమర్ల ఎమ్మార్సీ వద్ద ప్రదర్శించారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి పతివాడ త్రినాథ్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్ధిక సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 17 తేదీన యూటీఎఫ్‌ తలపెట్టిన చలో విజయవాడను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ మండలాధ్యక్షుడు మద్దిల సత్యనారాయణ, కోశాధికారి సుంకర చలపతిరావు పాల్గొన్నారు. – నెల్లిమర్ల

Advertisement
 
Advertisement
Advertisement