లారీ ఢీకొని ఆటోడ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఆటోడ్రైవర్‌ దుర్మరణం

Feb 14 2026 10:14 AM | Updated on Feb 14 2026 10:14 AM

లారీ ఢీకొని ఆటోడ్రైవర్‌ దుర్మరణం

లారీ ఢీకొని ఆటోడ్రైవర్‌ దుర్మరణం

లారీ ఢీకొని ఆటోడ్రైవర్‌ దుర్మరణం

తగరపువలస: చెరకుపల్లి అవంతి కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం దల్లిపేటకు చెందిన కొండపు నరసింహ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భీమిలి మండలం మూలకుద్దులో బంధువుల ఇంట జరిగిన పెద్దకర్మకు వేరే ఆటోలో హాజరయ్యాడు. తిరిగి వెళ్తూ అవంతి కళాశాల వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇంటర్మీడియట్‌ చదువుతున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన భార్య దల్లిపేటలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement