ముమ్మరంగా వాహన తనిఖీలు
లక్కవరపుకోట : మండలంలోని అరుకు – విశాఖపట్నం జాతీయ రహదారిలో ఎస్‌ఐ నవీన్‌పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు గడిచిన రెండు రోజులుగా ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ‘ప్రమాదం గురూ..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రమాదకరంగా వెళ్తున్న గడ్డి ట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకొని తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముమ్మరంగా వాహన తనిఖీలు


