● నివేదిక పంపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు ● ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ● రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

● నివేదిక పంపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు ● ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ● రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్‌

Feb 9 2026 8:19 AM | Updated on Feb 9 2026 8:19 AM

● నివ

● నివేదిక పంపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు ● ఇద్దరు, ముగ్

● నివేదిక పంపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు ● ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ● రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్‌ ‘రెవెన్యూ లీలల’పై కలెక్టర్‌ సీరియస్‌ కనీస వేతనం సాధించే వరకు పోరాటం ● అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ

చీపురుపల్లి: తహసీల్దార్‌ కార్యాలయంలో ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా రికార్డు లు తారుమారు చేయడం, ఒకరి భూములు మరొకరికి కట్టబెట్టడంపై కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలో రైతులు భూములు వేరొకరికి మార్చి, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయిన ఉదంతంపై ఆదివారం సాక్షి దినపత్రిక లో ‘రెవెన్యూ లీలలు’ అనే శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. కర్లాంలోని సర్వే నంబర్‌ 76 లో భూములు రికార్డులు తా రుమారుకు సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ డి.ధర్మరాజును ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ నివేదిక తయారు చేసే పనిలో ఉన్నారు. అయితే ఆదివారం కావడంతో తాత్కాలిక నివేదిక పంపించి సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరిపి తుది నివేదిక కలెక్టర్‌కు సమర్పించనున్నట్టు తహసీల్దార్‌ తెలిపారు.

రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్‌

ఇదిలా ఉండగా కర్లాం భూములు రికార్డులు తారుమారు అంశంపై సాక్షి పత్రికలో కథనం వెలువడడంతో రెవెన్యూ ఉద్యోగుల్లో టెన్షన్‌ మొదలైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగులు వారికి తెలిసిన రాజకీయ నాయకులు వద్దకు పరుగులు తీసి తమకేం కా కుండా చూడాలని కోరుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ సీరియస్‌ కావడం, నివేదిక కోరడంతో చీపురుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కార్యాలయంలో చర్చ జరుగుతోంది.

విజయనగరం ఫోర్ట్‌: కనీస వేతనం సాధించే వరకు పోరాటం ఆగదని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన ఆ యూనియన్‌ రాష్ట్ర మహాసభలకు ఆమె హాజరై మాట్లాడారు. ఐసీడీఎస్‌ ఏర్పాటై 50 ఏళ్లు గడిచినా కేంద్ర బడ్జెట్‌లో సరిపడ నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 26 లక్షల మంది అంగన్‌వాడీలు 10 కోట్ల మందికి సేవలందిస్తున్నారని అయితే రూ.23 వేల కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారని విమర్శించారు. ఒక్కొక్కరికి రూ.38 పైసలు మాత్రమే పెంచారని, పెరుగుతున్న ధరలతో ఎలా బతకాలన్నారు. గతంలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ కూడా ఇచ్చి మినిట్స్‌ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో అయినా వేతనాలు పెంచేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. జీవో ఇచ్చినా నేటికీ గ్రాట్యుటీ అమలు చేయడం లేదన్నారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలందరినీ మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలుగా మార్చాలన్నారు. అనంతరం కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షులుగా ప్రభావతి, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.అనసూయ, కోశాధికారిగా ఎం.కృష్ణమ్మ, జిల్లా గౌరవాధ్యక్షులుగా టి.మాలతి, ఉపాధ్యక్షులుగా పి.జ్యోతి, పి.కుమారి, బి.పైడిరాజు, టి.తులసి సహాయ కార్యదర్శులుగా సరళ, రూప, నిర్మల తదితరులు ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని వెల్లడించారు.

● నివేదిక పంపాలని తహసీల్దార్‌కు  ఆదేశాలు ● ఇద్దరు, ముగ్1
1/1

● నివేదిక పంపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు ● ఇద్దరు, ముగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement