వేంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు
కల్తీ నెయ్యి ఆరోపణలపై లెంపలేసుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలి ఏకసభ్య కమిషన్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిన ప్రభుత్వం తెల్లారితే కల్తీ నెయ్యి ఆరోపణలు... రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే ప్రాధాన్యత విజయనగరం జెడ్పీ ఛైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
మంత్రి కొండపల్లివి అవగాహనలేని మాటలు
తెల్లారితే కల్తీ నెయ్యి ఆరోపణలు... రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
విజయనగరం:
కోట్లాది మంది భక్తులు కోలిచే తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్టకు భంగం కలిగించటంతో పాటు ఆయన భక్తుల మనోభావాలను దెబ్బతీసే లా నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు ఆ స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏ ఆధారం లేకుండానే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ చేసిన ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసి న ఛార్జీషీట్ కూటమికి చెంపపెట్టని పేర్కొన్నారు. చంద్రబాబు, కూటమి నేతలు విష బీజాలు ప్రజలు నమ్మరని, లడ్డూ ప్రసాదం ఆరోపణలపై లెంప లేసుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుమల లడ్డూ కల్తీ ప్రచారం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి పదవుల్లో ఉన్న వ్యక్తులు పవిత్రమైన తిరుప తి లడ్డూలో గత ప్రభుత్వ హయాంలో జంతు కొవ్వు, పంది కొవ్వు వినియోగించారంటూ ఆరోప ణలు చేయటంతో పాటు అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేశారన్నారు. తమ స్వార్ధ రాజకీయా ల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై సీబీఐ నేరుగా స్పందించి ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీబీ ల్యాబ్‌లలో పరీక్షలు జరిపి ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని తేటతెల్లం చేసిందన్నారు. సీబీఐ నివేదికతో వేంకటేశ్వరస్వామి భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
సనాతన ధర్మమంటూ గొప్పలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నాడు లడ్డూపై అబద్దపు ప్రచా రం చేసి నేడు మాటలు మార్చటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2024 ఎన్నికలకు ముందు పవన్‌కళ్యాణ్ అదే తరహాలో జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణ లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం నిజం కాదా అని ప్రశ్నించారు. దేవుడిపై తనకు నమ్మకం లేదని, తన కమ్యూనిస్టునంటూ పూటకో స్టేట్‌మెంట్ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.
కల్తీ నెయ్యి వ్యవహారంపై దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తన ఛార్జిషీట్‌లో ఎటువంటి కల్తీ జరగలేదంటూ నివేదిక ఇవ్వటంతో చంద్రబా బు, కూటమి నేతలు మళ్లీ ఏకమై కొత్త నాటకానికి తెరలేపటం సిగ్గుచేటన్నారు. ప్రజల నుంచి వ్యతిరేఖత పెరిగిందన్న భయంతోనే సీబీఐ సంస్థను కాద ని ఏకసభ్య కమిషన్ వేస్తామంటూ ప్రకటించారన్నా రు. వచ్చే ఎన్నికల వరకు పాలనను పక్కనపెట్టి ఇదే అంశంపై ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త డ్రామాలు ఆడుతుండటం దారుణమని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన రూ.3వేల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తమ హయాంలో అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు ప్రతి గ్రామంలో ఆలయాలు నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. రుషికొండలో భారీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం విశాఖలో ఖరీదైన భూములను తమ తాబేదారులకు, ఎన్నికలకు ముందు ధన సహాయం చేసిన వారికి ఉచితంగా ధారాదత్తం చేస్తుందన్నారు.
రాష్ట్రంలో కూటమి హయాంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నూతన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టడం ఖాయమన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పీహెచ్‌సీలో వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.
జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అవగాహన లేని ప్రకటనలు చేస్తున్నారని మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంపై భోగాపురం ఎయిర్‌పోర్టు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బేరీజు వేయటాన్ని తప్పుపట్టారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ఏ స్థాయిలో ఉంటారో... ప్రభు త్వ ఆస్పత్రికి వచ్చే వారు ఏ స్థాయిలో ఉంటారో అర్ధం చేసుకోవాలని హితవు పలికారు. పీపీపీ విధానం పెడితే ఎయిర్‌పోర్టుకు వెళ్లి రూ.వేలు చెల్లించి ప్రయాణించే వారిలా.... ఆస్పత్రికి వచ్చిన వారు డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించుకోవాలా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పాలన సాగటం లేదని తెల్లారితే కల్తీ నెయ్యి అంటూ ఆరోపణలు చేయటం, ప్రశ్నించే వారిపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయటమే వారి ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలు, ప్రకటించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు కల్తీ నెయ్యి వ్యవహరాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క కొత్త పింఛ ను మంజూరు చేయలేదని, ఆడబిడ్డ నిధి అమ లు కాలేదని, యువతకు నిరుద్యోగ భృతి ఏమైందని, సూపర్‌సిక్స్ హమీలు అమలు ఎప్పుడు చేస్తారని నిలదీశారు. ఇక అభివృద్ధి, సంక్షేమం అనే పదాలు ఈ ప్రభుత్వానికి పట్టకుండా పోయాయన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తే రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట పెట్రోల్ బాంబులు, మారణాయుధాలుతో దాడులు చేయి స్తూ కొత్త సంస్కృతికి తెరలేపుతుండటం భాధాకరమన్నారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ధ్వజమెత్తారు.
వేంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు
వేంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు
వేంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు
వేంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు


