ఈ చిత్రాలు చూశారా... కుళాయి వద్ద తాగునీటిని పడుతున్నది రామభద్రపురం మండలం కారేడువలస గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చిన్నారులు. పాఠశాలలో బోరునీరు అందుబాటులో లేక దాహంవేస్తే వీధి కుళాయిలను ఆశ్రయిస్తున్నారు. అలాగే, పాఠశాలలో భోజనం వండే సదుపాయం లేక నిర్వాహకురాలు ఇదిగో ఇలా పిల్లలకు ఇంటివద్దనే వంట చేస్తోంది. మరోవైపు పాఠశాలలోని మరుగుదొడ్లు మూలకు చేరినా పట్టించుకునేవారే కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడికి సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం చూపుతోందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. – రామభద్రపురం
ఇంటి వద్ద
మధ్యాహ్న
భోజనం
వండుతున్న నిర్వాహకురాలు ఆదిలక్ష్మి


