గజపతినగరం:
విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి హెచ్చరించారు. గజపతినగరం–2 గ్రామ సచివాలయాన్ని, పురిటి పెంట–1 అంగన్‌వాడీ సెంటర్‌ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. సేవలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్త పి.సత్యవతి విధుల్లో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులుగా సీడీపీఓ, సూపర్ వైజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్ పీడీను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ఆయన వెంట గజపతినగరం ఇన్‌చార్జి తహసీల్దార్ శోభారాణి ఉన్నారు.


