గాయకుడిగా మారిన దర్శకుడు | - | Sakshi
Sakshi News home page

గాయకుడిగా మారిన దర్శకుడు

Feb 12 2026 7:01 AM | Updated on Feb 12 2026 7:01 AM

గాయకుడిగా మారిన దర్శకుడు

గాయకుడిగా మారిన దర్శకుడు

గాయకుడిగా మారిన దర్శకుడు

వేపాడ: 30 సంవత్సరాలుగా సినీరంగంలో పలు ప్రయోగాలు చేసి జాతీయ, అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుని అందరి మన్ననలు పొందిన సినీ దర్శకుడు పీసీ ఆదిత్య నేడు గాయకుడిగా కొత్త అవతారమెత్తారు. వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన పీసీ ఆదిత్య సినీరంగంలో అడుగుపెట్టి సొంత ఊరికి దూరంగా ఉన్నా ఉత్తరాంధ్రపై అభిమానంతో గాయకుడిగా మారి శ్రీకాకుళం, కొత్తవలస పేర్లతో పాడిన పాట పలువురిని ఆకట్టుకుంటోంది. దర్శకుడు ఆదిత్య గాయకుడిగా సాంకేతిక విప్లవంలో భాగంగా ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) విధానంలో నాలుగు నిమిషాల నిడివితో ఓ ప్రేమగీతాన్ని రచించి గానం చేశారు. రాయే నా లచ్చి అంటూ జానపద శైలిలో ఉత్తరాంధ్ర యాసలో సాగిన ఈ గీతం టీజర్‌లో ప్రజాదరణ పొందడంతో 11తేదీ 11 గంటల 11 నిమిషాలకు యూట్యూబ్‌లో విడుదల చేసినట్లు ఆదిత్య చెప్పారు.భవిష్యత్‌లో ఏఐ విధానంలో మరిన్ని ఆడియో వీడియో గీతాలను రూపొదించనున్నట్లు తెలిపారు.

పీసీ ఆదిత్యది కుమ్మపల్లి గ్రామం

30 సంవత్సరాలుగా దర్శక, రచయితగా గుర్తింపు

ఉత్తరాంధ్ర యాసతో పాడిన పాట యూట్యూబ్‌లో విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement