ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

Feb 13 2026 5:32 AM | Updated on Feb 13 2026 5:32 AM

ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

గజపతినగరం రూరల్‌: స్థానిక శ్రీ భవిష్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న బొత్సరాజేష్‌ (16) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థిది మెరకముడిదాం మండలం ఊటపల్లి గ్రామం. సాయంత్రం కళాశాలలో స్టడీ అవర్స్‌ అయిన వెంటనే తన గదిలోకి వెళ్లిన రాజేష్‌ అపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితుల్లో కాలేజీ సిబ్బంది గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాజేష్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టడీ అవర్స్‌ సమయంలో కాలేజీ సిబ్బంది విద్యార్థిని దండించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యచేసుకున్నాడన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ భాస్కర్‌నాయుడు వద్ద ప్రస్తావించగా కాలేజీలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement