పగబట్టిన ప్రమాదాలు.. | - | Sakshi
Sakshi News home page

పగబట్టిన ప్రమాదాలు..

Feb 14 2026 10:14 AM | Updated on Feb 14 2026 10:14 AM

పగబట్టిన ప్రమాదాలు..

పగబట్టిన ప్రమాదాలు..

మృతుడు శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీష్‌ భోగాపురం పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా డ్రైవర్‌ వృత్తి చేస్తున్నాడు. చిన్న కుమారుడు పురుషోత్తం కూడా తండ్రివలే డ్రైవర్‌ వృత్తి చేస్తూ భక్తులను సుదూర ప్రాంతాల్లో తీర్ధ యాత్రలకు తీసుకువెళ్లేవాడు. సుమారు ఎనిమిది నెలల కిందట భక్తులను కాశీ యాత్రకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోకముందే తండ్రి కూడా ఇదే విధంగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మరో రెండు రోజుల్లో యాత్ర ముగించుకుని వస్తాడనే లోపే పెనువిషాదం జరగడంతో స్వగ్రామమైన సారిపల్లిలో విషాదం అలుముకుంది. ఓ వైపు గుండె సంబంధిత సమస్య, మరోవైపు కొద్ది నెలల వ్యవధిలోనే కుమారుడు, భర్త మృతితో నడిపేన కాసులమ్మ కన్నీరు మున్నీరుగా విలపించడం.. అక్కడి వారిని కంటతడి తెప్పించింది.

డివైడర్‌ను

ఢీకొట్టిన బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement