న్యాయవాదుల నిరసన | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల నిరసన

Feb 10 2026 8:12 AM | Updated on Feb 10 2026 8:12 AM

న్యాయ

న్యాయవాదుల నిరసన

నేడు పోలమాంబ అమ్మవారి మూడో జాతర

విజయనగరం లీగల్‌: తెలంగాణాకు చెందిన మహిళా న్యాయవాది హత్యకు నిరసనగా విజయనగరంలోని న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి కోర్టు ప్రాంగణంలో ఆందోళన చేశారు. ఈ సందర్బంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిశెట్టి రవిబాబు, ప్రధాన కార్యదర్శి నళితం సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో సంఘ సంయుక్త కార్యదర్శి బార్నాల సీతారామరాజు, కోశాధి కారి కళ్లెంపూడి వెంకటరావు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మేలుచేసేలా ఈఎస్‌డీపీ

విజయనగరం కలెక్టరేట్‌: విద్యార్థుల్లోని కొత్త తరహా ఆలోచనలను వాస్తవికతవైపు తీసుకెళ్లడమే ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఈఎస్‌డీపీ) ఉద్దేశమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలోని కళాశాలల్లో కార్యక్రమం ప్రారంభంపై హర్షం వ్యక్తంచేశారు. స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థను పెంపొందించేందుకు గుర్తించిన శిక్షణ బ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్టప్‌లను ప్రతిష్టాత్మకమైన రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో అనుసంధానించనున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడి కీచక పనులపై హెచ్‌ఎంకు ఫిర్యాదు

రామభద్రపురం: విద్యాబుద్ధులతో పాటు గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయుడే బాలికలను బ్యాడ్‌టచ్‌ చేస్తూ ఇబ్బందిపెట్టాడు. వీడియోలు తీస్తూ ఆందోళనకు గురిచేశాడు. ఉపాధ్యాయుడి చేష్టలతో విసుగెత్తిన రామభద్రపురం ఉన్నతపాఠశాల బాలికలు పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌, మరో పేరెంట్‌తో కలిసి ఈ నెల 8న పాఠశాల హెచ్‌ఎం వి.గోపాలనాయుడుకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. దీనిపై హెచ్‌ఎం వెంటనే స్పందించి సంబంధిత ఉపాధ్యాయుడిని ఆఫీస్‌ రూంలోకి పిలిపించి మందలించారు. ఇదే విషయాన్ని ఎంఈఓ తిరుమలప్రసాద్‌, హెచ్‌ఎం గోపాలనాయుడు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ అప్పారావు వద్ద ప్రస్తావించగా ఉపాధ్యాయుడి తీరుపై బాలికలు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనన్నారు. చదవాలని మందలిస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం లేదని, తరగతి గదిలో గోలచేస్తే హెచ్‌ఎంకు చూపిస్తానంటూ వీడియో తీస్తున్నట్టు ఆ ఉపాధ్యాయుడు సమాధానం ఇచ్చా రని తెలిపారు. మరోసారి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని, సంబంధిత ఉపాధ్యాయుడితో లిఖితపూర్వక వివరణ తీసుకున్నామని హెచ్‌ఎం వివరించారు.

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మూడోజాతర నేడు జరగనుంది. జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఈవో బి.శ్రీనివాస్‌, ట్రస్ట్‌బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పా ట్లు పూర్తి చేశారు. జాతరలో భక్తుల అవసరా ర్థం 10వేల లడ్డూప్రసాదాన్ని దేవాదాయశాఖ తయారు చేయించింది. క్యూల వద్ద చిన్న పిల్లలకు పాలు, తాగునీరు సరఫరా చేయనున్నట్లు ఈవో తెలిపారు. అవసరమైన మేరకు పులిహో ర భక్తులకు అందించనున్నట్లు ఈవో తెలిపా రు. జాతరకొచ్చే భక్తులకు సేవలందించేందు కు 30మంది దేవాదాయశాఖ సిబ్బంది శంబర గ్రామానికి చేరుకున్నారు. జాతరలో 140మంది పోలీస్‌ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

న్యాయవాదుల నిరసన 1
1/1

న్యాయవాదుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement