నిరసన హోరు
విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వివిధ సమస్యల పరిష్కారంలో జాప్యంపై పలు వర్గాల ప్రజలు ఆందోళనలు చేశారు. కలెక్టరేట్ సాక్షిగా సోమవారం నిరసన గళం వినిపించారు. కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు.
● తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యం చేయడంపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేశారు. తక్షణమే రూ.7వేల కోట్ల ఫీజు బకాయిల విడుదలకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల చదువుతో రాజకీయం చేయొద్దని హితవుపలికారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వి.చిన్నబాబు, జిల్లా కార్యదర్మి డి.రాము, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకీ, జగదీష్, రమేష్, సహాయ కార్యదర్ములు రమేష్, రమణ, నాయకులు మధు,సూరిబాబు, నాని, శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు.
● సర్వేనంబర్ 43–ఎలోని 0.47సెంట్ల విస్తీర్ణంలో ఉన్న శ్మశాన వాటికను ఆక్రమిస్తున్నారని, శ్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని మూసివేశారని, తక్షణమే హద్దులు నిర్ణయించి రుద్రభూమిని కాపాడాలంటూ రాజాం మండలం బొద్దాం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కలెక్టర్ రాంప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
● మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన రెల్లి, మాల కులస్తులకు భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు 200 నిరుపేద కుటుంబాలకు ఒక్క సెంటు భూమికూడా లేకుండా, వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తునామని తెలిపారు. సర్వే నంబర్ 126లోని ప్రభుత్వ భూములను మహిళల పేరుమీద పట్టాలుగా పంపిణీ చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించకుంటే ఈనెల 16 నుంచి కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని అంబేడ్కర్ పోరాడ సమితి అధ్యక్షుడు సోరు సాంబయ్య హెచ్చరించారు.
ఫీజురీయింబర్స్‌మెంట్ పెండింగ్ నిధులు
విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నిరాహార దీక్ష
శ్మశానవాటిక కోసం బొద్దాం గ్రామస్తుల కన్నీటి పోరాటం
పోరాం గ్రామ భూముల పంపిణీకి
అంబేడ్కర్ పోరాట సమితి డిమాండ్
నిరసన హోరు
నిరసన హోరు


