చాలా మంది రైతుల భూములు 22–ఏలో చేరడం, అస్సైన్డ్‌ భూములుగా నమోదుకావడంతో క్రయవిక్రయాలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నుంచి అందిన అర్జీల మేరకు సరిచేయాలని ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఓ సర్క్యులర్‌ను జారీచేసింది. దీనినే అదునుగా చేసుకుని కొందరు రాజకీయనాయకుల అండదండ | - | Sakshi
Sakshi News home page

చాలా మంది రైతుల భూములు 22–ఏలో చేరడం, అస్సైన్డ్‌ భూములుగా నమోదుకావడంతో క్రయవిక్రయాలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నుంచి అందిన అర్జీల మేరకు సరిచేయాలని ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఓ సర్క్యులర్‌ను జారీచేసింది. దీనినే అదునుగా చేసుకుని కొందరు రాజకీయనాయకుల అండదండ

Feb 12 2026 7:05 AM | Updated on Feb 12 2026 7:05 AM

చాలా మంది రైతుల భూములు 22–ఏలో చేరడం, అస్సైన్డ్‌ భూములుగ

చాలా మంది రైతుల భూములు 22–ఏలో చేరడం, అస్సైన్డ్‌ భూములుగ

22ఏ భూముల క్రమబద్ధీకరణ పేరుతో దోపిడీ !

ప్రతిఫైలుకు ఓ రేటు

నచ్చిన అధికారులతో ప్రత్యేక బృందం

చకచకా అస్సైన్డ్‌ భూముల ఫైళ్ల

క్లియరెన్స్‌కు ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

చిన్న గడ్డిపరక ఆదరువు దొరికితే చాలు.. దానిని పట్టుకుని సముద్రాన్ని ఈదేసేవాళ్లున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న జీవో కాపీ చాలు.. దానిని అడ్డం పెట్టుకుని మొత్తం రెవెన్యూ వ్యవస్థను చాపలా చుట్టబెట్టి చంకలో పెట్టుకుని వెళ్లిపోయేవాళ్లకూ కొదవలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవో కాపీని ఆధారం చేసుకుని అధికారపార్టీ నేతల అండదండలతో కొందరు రెవెన్యూ ఉద్యోగులు సిండికేటుగా మారి మొత్తం కథను మార్చేసి.. రెవెన్యూలో రూ.కోట్ల కథ రాసుకునేందుకు పథకం వేశారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

వాస్తవానికి కొన్నేళ్లుగా వివాదాల్లో ఉన్న భూములు, పొరపాటున 22–ఏలో చేర్చబడిన ప్రైవేటు భూము లు, రాజకీయ కక్షల నేపథ్యంలో ఇలాంటి చిక్కుల్లో పడినవారి భూములు, మాజీ సైనికులకు చెందిన భూముల మ్యుటేషన్‌లకు సంబంధించి పూర్తి హక్కు లు దఖలుపర్చే అంశంలో ఉన్న చిక్కుముడులు విప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2న ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా తహసీల్దార్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారులకు కొన్ని అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కో విధమైన వివాదం.. చిక్కుముడులు సంబంధించి వాటిని ఎలా పరిష్కరించాలి.. దానికి ఎలాంటి డాక్యుమెంట్లు ఉండాలి అనేది కూడా ఆ సర్క్యులర్‌లో పొందుపర్చింది. సేవలన్నీ ఉచితంగా అందజేయాలి. ఉన్నఫళంగా అన్ని ఫైళ్లు చదవడం.. వివాదాలు.. దాని ఇబ్బందులు పరిష్కరించడం ఉన్న కొద్దిమందితో కుదరదని, కొందరు సిబ్బంది అదనంగా కావాలని కోరిన సంబంధిత అధికారులు... నలుగురు డిప్యూటీ తహసీల్దార్‌ స్థాయి అధికారులను తమకు సహాయకులుగా తెచ్చుకున్నట్లు సమాచారం. ఆ నలుగురిలో ఇద్దరు తనకు అనుకూలమైనవాళ్లను చేర్చి మొత్తం టీమ్‌ తనకనుసన్నల్లో ఉండేలా చేసుకున్నారన్నది రెవెన్యూ వర్గాల బోగట్టా. ఈ బృందానికి అస్సైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రూ.కోట్ల కొల్లగొట్టేందుకు ‘అస్సైన్‌’మెంట్‌ ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద భూములకు సంబంధించిన ఫైళ్లను చకచకా చదివేసి.. ఆ భూ యజమానులతో బేరం మాట్లాడుకుని వాటిని పై స్థాయి అధికారి లాగిన్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం దందా విలువ రూ.కోట్లలోనే ఉంటుందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా వివాదాల్లో ఉంటున్న భూములకు సంబంధించి వివాదం క్లియర్‌ చేయడానికి ఎంతైనా సమర్పించుకునేందుకు సంబంధిత భూ యజమానులు సిద్ధంగా ఉండడంతో ఆ బలహీనతను క్యాష్‌ చేసుకునేందుకు రెవెన్యూ మాఫియా కౌంటర్‌ తెరిచిందని తెలుస్తోంది. తక్షణం పరిష్కరించగలిగే ఫైళ్లను ఎంపిక చేసుకుని గమ్మున తేల్చేసి అందినకాడికి దండుకునేందుకు రంగం సిద్ధమైందని.. ఈ మేరకు ఫైలు స్థాయి.. ఆ భూమి విలువను బట్టి కోట్లలో చేతులు మారేందుకు రూట్‌ క్లియర్‌ అయిందని అంటున్నారు. మేం క్లియర్‌ చేయడమే కాదు.. డివిజన్‌ .. జిల్లా స్థాయి అధికారులతోనూ బేరం తామే మాట్లాడి అక్కడ కూడా క్లియర్‌ చేసేందుకు పూర్తి బాధ్యత వహిస్తామని సంబంధిత సెక్షన్‌ అధికారులు చెప్పడంతో ఇక భూ యజమానులకు నమ్మకం కలిగి.. డబ్బులు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. దీనివెనుక కొందరు రాజకీయ నాయకుల మంత్రాంగం గట్టిగా పనిచేస్తున్నట్టు సమాచారం.

కాసులిచ్చే ఫైళ్లకే కదలిక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement