హామీల అమలుకు డిమాండ్
నిరుద్యోగ యువత, వలంటీర్లకు ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షుడు బూర వాసు విమర్శించారు. ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు వెంటనే అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చ జరిపి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి వి.రాజేష్ నరేంద్రతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.


