చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా..!
నోటీసులు ఇచ్చాం
రాజాం: వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న రాజాంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఇదే అదునుగా ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. అధికార బలంతో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఆక్రమించేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ మురుగుకాలువలను సైతం మూసేసిన ఆక్రమణదారులు... ఇప్పుడు ఏకంగా దేవదాయశాఖ భూములను కబ్జాచేస్తున్నారు. అనధికారికంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
● 20 ఎకరాల మేర ఆక్రమణ..
రాజాంలోని పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని డోలపేట పరిధిలో రూ.కోట్ల విలువచేసే దేవదాయశాఖ భూములు ఉన్నాయి. డోలపేటలోని ఉమామహేశ్వర లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 8లో 20.56 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు మొత్తం ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. కొంతమంది ఈ భూములు జీవితకాలపు లీజుకు తీసుకున్నామంటూ హైకోర్టులో కేసులు వేయడం గమనార్హం. మరికొంత మంది ఎమ్మెల్యే చెప్పారని, ఎంపీ చెప్పారని చిన్నచిన్న షెడ్లువేసి రాత్రికిరాత్రే శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ సెంటు భూమి ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షలు పలుకుతుండడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు.
● మమ్మల్ని అడగొద్దు..
రాజాం పట్టణంలో ఇళ్లు, భవంతుల నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ అప్రూవుల్ ఉండాలి. పక్కా జిరాయితీ స్థలాలైతేనే వీటికి పర్మిషన్ ఇస్తారు. అవి కూడా జీ ప్లస్ నిర్మాణాలు చేయాల్సి ఉంది. లేకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలను అడ్డుకోవాలి. రాజాంలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. మామ్మూళ్లు ఇస్తే చాలు... కొందరు అధికారులు, ఉద్యోగులు అక్రమ మార్గంలో అనుమతులు ఇచ్చే దారి చూపుతారట. విద్యుత్ మీటర్లు కూడా మంజూరు చేయిస్తారు. ఇక్కడి మున్సిపల్ కార్యాలయంలో దీనికోసం ప్రత్యేక దళారీ వ్యవస్థే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు దేవదాయశాఖ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల అడ్డంకులు లేకపోవడంతో రాత్రికి రాత్రే భూములు మాయమవుతున్నాయి.
రాజాంలో ఆక్రమణల జోరు
దేవదాయశాఖ భూముల
దురాక్రమణ
అధికార బలంతో నిర్మాణాలు
నోటీసులు ఇచ్చినా ఫలితం సున్నా
ఆక్రమణల గుప్పిట్లో విలువైన ఆస్తులు
Æ>gê…ÌZ §ólÐ]l§é-Ķæ$Ô>Q ¿¶æ*Ñ$° GMýSP-yìlMýS-MýSPyól B{MýS-Ð]l$-׿Ë$ ^ólçÜ$¢-¯é²Æý‡$. ´ëÌSMö…yýl Æøyýl$zÌZ §ólÐ]l-§é-Ķæ$Ô>Q ¿¶æ*Ñ$ B{MýS-Ð]l$-׿-ÌSOò³ ¯øsîæ-çÜ$Ë$ C^éa…. Æð‡Ððl¯]l*Å A«¨-M>-Æý‡$-ÌSMýS$ íœÆ>ŧýl$^ólÔ>…. ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$¯ól…§ýl$MýS$ GÐ]lÆý‡* Ð]l¬…§ýl$MýS$-Æ>-Ìôæ§ýl$. B{MýS-Ð]l$׿Ë$ BVýSyýl… Ìôæ§ýl$. E¯]l²-™é«¨-M>-Æý‡$ÌSMýS$ ™ðlÍ-Ķæ$-gôæ-Ô>…. B{MýS-Ð]l$׿-§éÆý‡$-ÌSOò³ MøÆý‡$tÌZÏ MóSçÜ$Ë$ ÐólçÜ$¢-¯é²…. MýSv¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$-Mø-ÐéÌS° hÌêÏ A«¨M>-Æý‡$-ÌS¯]l$ MøÆ>…. ˘
– బి.వి.మాధవరావు, దేవదాయశాఖ ఈఓ, రాజాం
చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా..!


