వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేయాలి
● కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ప్రసాదరావు
విజయనగరం ఫోర్ట్: వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్‌డీవీ ప్రసాదరావు కోరారు. వియనగరం యూత్ హాస్టల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం (1976లో) వచ్చాక వెట్టి చాకిరీ తగ్గిందన్నారు. సమావేశంలో నేచర్ సంస్థ ప్రతినిధులు దుర్గ, చైతన్య, బంగారుబాబు, గౌరీ శంకర్, సీహెచ్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
● ఆర్‌జేడీ విజయ్‌భాస్కర్
బొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాప్రణాళిక అమలుచేస్తున్నామని ఆర్‌జేడీ విజయ్ భాస్కర్ తెలిపారు. బొండపల్లి ఎంఈఓ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రిజియన్ పరిధిలోని ఆరుజిల్లాల్లోని విద్యార్థులకు గతేడాది డిసెంబర్ 6 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పదోతరగతి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లా నుంచి 14,744 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5,117 మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి 19,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.
పోలమాంబ హుండీల ఆదాయం రూ.25.47 లక్షలు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని దేవదాయశాఖ ఆధ్వర్యంలో చదురుగుడిలో శుక్రవారం లెక్కించారు. చదురుగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.18,47,354లు, వనంగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.7,00,065లు కలిపి రూ.25,47,419లు ఆదాయం వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. 27 గ్రాముల 520 మిల్లీ గ్రాముల బంగారం, 243 గ్రాముల వెండి లభించిందన్నారు. హుండీల ఆదాయం లెక్కింపులో పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, ఆలయ చైర్మన్ నైదాన చిన్నతిరుపతి, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఎంపీటీసీ సభ్యుడు టి.పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, సేవకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
స్పందించిన సర్వజన ఆస్పత్రి అధికారులు
విజయనగరం ఫోర్ట్: సర్వజన ఆస్పత్రిలో వసతులు చాలక రోగులు ఇబ్బంది పడుతున్నారనే అంశంపై ‘అమాత్యా కాస్త ఇటు చూడండి..!’ అనే శీర్షికన ఈనెల 2వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు స్పందించారు. మూలనపడిన వీల్‌చైర్లు, స్ట్రెచర్స్‌ను శుక్రవారం బాగుచేయించారు.
వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేయాలి
వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేయాలి
వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేయాలి


