ప్రజలు ప్రశ్నిస్తేచాలు... ఇదిగో పనులు పూర్తి చేసేస్తామం
గత ప్రభుత్వం బలసల రేవు వంతెన కోసం నిర్మించిన పిల్లర్లు
పునఃప్రారంభిస్తాం
వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం పనులు తాత్కాలికంగా నిలిచాయి. కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడి వంతెన ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వంతెన నిర్మాణం వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– బీవీ నాయక్, ఆర్‌అండ్‌బీ ఏఈ,
బలసలరేవు వంతెన విభాగం
రాజాం/సంతకవిటి:
సంతకవిటి మండలంలోని వాల్తేరు గ్రామం వద్ద నాగావళి నదిపై తలపెట్టిన బలసలరేవు వంతెన... 50 గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలను తీర్చే వారధి. వంతెన నిర్మాణం ఆవశ్యకత, దశాబ్దాలుగా ప్రజల పోరాటాన్ని గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఆర్‌అండ్‌బీ నుంచి రూ.87 కోట్లు మంజూరు చేయించి వంతెన పనులను ప్రారంభించింది. పిల్లర్ల స్థాయి వరకు నిర్మాణం పూర్తిచేసింది. ఇంతలో ఎన్నికలు రావడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వంతనె నిర్మాణం ‘ఎక్కడవేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా మారింది. ఏడాదిన్నరగా వంతెనవైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. పనులు ఒక్కడుగు కూడా ముందుకు కదలలేదు. చిన్న ఇసుకరేణువు పనికూడా చేపట్టలేదు. ఇప్పటికే అందుబాటులోకి రావాల్సిన వంతెన పనులు నిలిచిపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రయాణ కష్టాలు యథాతథంగా మారిపోయాయంటూ వాపోతున్నారు.
● బాబు చేతిలో మోసపోతున్న ప్రజలు
సంతకవిటి మండలం వాల్తేరు వద్ద 1998లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే వంతెన నిర్మా ణానికి నిధులు మంజూరు చేసినట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. అప్పటి నుంచి వాల్తేరు గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు వంతెన కోసం పోరుబాట సాగించారు. అధికారులు, పాలకులకు వినతులు అందజేశారు. 2014లో రెండేళ్ల పాటు నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగించారు. అయినా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల వంతెన సమస్యను గుర్తించింది. నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించింది. 560 మీటర్ల పొడవున నిర్మించే వంతెనకు 16 పిల్లర్లకు తొలుత నాగావళి నదీ గర్భంలోని 8 పిల్లర్లను స్లాబ్ స్థాయివరకు పూర్తిచేసింది. రెండు వైపులా వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి 14 ఎకరాల భూమిని సేకరించింది. వంతెన పూర్తవుతుందని, కొద్దినెలల్లో ప్రయాణ కష్టాలు తొలగుతాయని ప్రజలు సంతోషించిన వేళ.. ఎన్నికలు రావడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పనులు పూర్తిచేసేందుకు శ్రద్ధచూపే నాథుడే కరువయ్యారు.
పూర్తయితే ప్రయోజనం
వంతెన నిర్మాణం పూర్తయితే సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలుగుతుంది. వాల్తేరు, పనసపేట, గారన్నాయుడపేట, చిత్తారిపురం, కావలి, గోకర్ణపల్లి, సిరిపురం, జీఎన్‌పురం, జానకీపురం, శేషాద్రిపురం, అప్పలఅగ్రహారం, బూరాడపేట, మంతిన, మల్లయ్యపేట, రామారాయపురం, మల్లయ్యపేట, చింతలపేట, మందరాడ, మండాకురిటి తదితర గ్రామాలతో పాటు ఆమదాలవలసలో పలు మండలాలుకు రహదారి సౌలభ్యం కలుగుతుంది. దూరం తగ్గుతుంది. నాటుపడవలపై నదిని దాటాల్సిన అవసరం ఉండదు.
పనులు సాగువు.. కష్టాలు తీరవు..!
వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా ప్రజల పోరాటం
అధికారంలోకి రాగానే రూ.87 కోట్లతో పనులు ప్రారంభించిన గత
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం
పిల్లర్ల స్థాయి వరకు నిర్మాణం
అప్పట్లో చకచకా సాగిన పనులు
ఏడాదిన్నరగా పనులను పట్టించుకోని చంద్రబాబు సర్కారు
నీరుగారిన డిప్యూటీ సీఎం
పవన్‌కల్యాణ్ హామీ
ఆవేదనలో 50 గ్రామాల ప్రజలు
ప్రజలు ప్రశ్నిస్తేచాలు... ఇదిగో పనులు పూర్తి చేసేస్తామం
ప్రజలు ప్రశ్నిస్తేచాలు... ఇదిగో పనులు పూర్తి చేసేస్తామం
ప్రజలు ప్రశ్నిస్తేచాలు... ఇదిగో పనులు పూర్తి చేసేస్తామం
ప్రజలు ప్రశ్నిస్తేచాలు... ఇదిగో పనులు పూర్తి చేసేస్తామం


