షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

షార్ట

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

పార్వతిపురం రూరల్‌: పట్టణంలోని 29వ వార్డు రామాపురం కాలనీలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఇల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. స్థానిక నివాసి చింతల రమణమ్మ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్రిడ్జ్‌, బీరువా, దుస్తులతో పాటు రూ.10 వేల నగదు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది.

గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

వంగర: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడిపిల్లి సత్యనారాయణ(55) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఎని మిది నెలలుగా ఆయన వంగర పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్య రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. గురువారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. విజయనగరానికి చెందిన ఆయనకు భార్య క్రాంతిసౌజన్య ఉన్నారు. ఆయన మృతి పట్ల సీఐ హెచ్‌ ఉపేంద్రరావు, ఎస్సై షేక్‌ శంకర్‌, పోలీస్‌ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

పొట్టేళ్ల పందాలపై పోలీసుల దాడులు

వీరఘట్టం: మండలంలోని కడకెల్ల గ్రామ శివారులో జరుగుతున్న పొట్టేళ్ల పందాలపై ఎస్సై ఎస్‌.షణ్ముఖరావు తన సిబ్బందితో గురువారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. అలాగే పందెంలో ఉపయోగించిన రెండు పొట్టేళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

విజయనగరం క్రైమ్‌ : విజయనగరం రైల్వే స్టేషన్‌ సమీపంలోని పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని వన్‌టౌన్‌ పోలీసులు గురువారం కనుగొన్నారు. మృతుడి వయస్సు 55 ఉంటుందని చామన ఛాయ రంగుతో నీలం రంగు షార్ట్‌, వైట్‌ కలర్‌ ఫుల్‌హ్యాండ్స్‌ బనియన్‌ వేసుకున్నాడని ఏఎస్సై, రైటర్‌ జగన్మోహన్‌ తెలిపారు. హెచ్‌సీ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.

ఇద్దరికి గాయాలు

గజపతినగరం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన వెంకటరమణ జాతీయ రహదారి దాటుతుండగా కొరాపుట్‌కు చెందిన సిద్దూరాత్‌ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై కిరణ్‌ కుమార్‌ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చేపల చెరువు వ్యాపారి ఆత్మహత్య

బలిజిపేట: చేపల చెరువు వ్యాపారంలో నష్టం రావడంతో మండలంలోని గౌరీపురం గ్రామానికి చెందిన ఎస్‌.సత్యనారాయణ(48) తట్టుకోలేక గుళికలు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ వృత్తిరీత్యా చేపల చెరువు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. దీనిలో రూ.5లక్షలు నష్టం రావడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుమేర కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం 
1
1/4

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం 
2
2/4

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం 
3
3/4

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం 
4
4/4

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement