మైనింగ్ భూముల సర్వే
మెరకముడిదాం: మండలంలోని కొత్తకర్ర, బుదరాయవలస, చినరవ్యాం, చినబంటుపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో ఐరన్‌ఓర్ మైనింగ్ తవ్వకాలకు సంబంధించిన భూములను ఆర్‌ఐ డి.రామ్‌కుమార్, సర్వేయర్ రామకృష్ణలు గురువారం సర్వే చేశారు. అయితే ఆయా గ్రామాల్లో మైనింగ్ తవ్వకాలను జరుపుకునేందుకు గతంలో తమ సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తూ అనుమతులను ఇచ్చిందని, అందులో కొంత భూమిలో మాత్రమే మైనింగ్ తవ్వకాలు జరిపామని, అప్పట్లో తవ్వకుండా వదిలేసిన మిగులు భూముల్లో ఇప్పుడు తవ్వకాలకు అనుమతులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని సంబంధిత యాజమాన్యాలు కోరాయి. దీంతో ఈ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి తనకు నివేదికను అందజేయాలని కలెక్టర్ రామసుందరరెడ్డి స్థానిక తహసీల్దార్ సులోచనారాణిని అదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు ఆర్‌ఐ డి.రామ్‌కుమార్, సర్వేయరు రామకృష్ణలు గురువారం ఆయా గ్రామాల రెవెన్యూపరిధిలో గతంలో మైనింగ్‌తవ్వకాలకు అనమతులు ఇచ్చిన భూములను సర్వే చేశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను త్వరలో జిల్లా అదికారులకు అందజేయనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.


