ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు

Feb 12 2026 7:05 AM | Updated on Feb 12 2026 7:05 AM

ఆయుష్

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో 70 ఏళ్లు దాటిని ప్రతిఒక్కరూ ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై), ప్రధానమంత్రి వయోవందన యోజన (పీఎంవీవీవై) కార్డులు పొందాలని డీఎంహెచ్‌ఓ ఎస్‌.జీవనరాణి తెలిపారు. కార్డుల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ఆదాయంతో సంబంధం లేకుండా కార్డులు పొందవచ్చన్నారు. సమీపంలోని పీహెచ్‌సీ వైద్యులు, గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకుని కార్డు పొందాలన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు.

పార్సిల్‌ సేవల్లో తెర్లాం ముందంజ

తెర్లాం: ఏపీఎస్‌ ఆర్టీసీ సంస్థ తెర్లాంలో నిర్వహిస్తున్న పార్సిల్‌ సర్వీస్‌ కౌంటర్‌ వినియోగదారుల సేవల్లో జిల్లా స్థాయిలో ముందంజలో నిలిచింది. మెరుగైన సేవలతో ఆర్టీసీకి ఆదా యం రాబట్టడంలో ఇక్కడి కౌంటర్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కౌంటర్‌ నిర్వాహకుడు వెలగాడ రమేష్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు బుధవారం అభినందించారు.

నేడు ఎన్‌జీఓల నిరసన

విజయనగరం కలెక్టరేట్‌: కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపుమేరకు ఏపీ ఎన్‌జీఓ సంఘం జిల్లా శాఖ కలెక్టరేట్‌ వద్ద గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేయనున్నట్టు ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు ఎ.సురేష్‌ తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకోవాలి

విజయనగరం కలెక్టరేట్‌: కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరు చేసిన రూ.40 నిధులను మార్చి నెలాఖరులోగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సమీక్షిస్తూ నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీ హుడ్‌, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ మిషన్‌ పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో మురళి, సీపీఓ మురళి, డీఈఓ మాణిక్యంనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పైడితల్లి చదురుగుడి హుండీల ఆదాయం లెక్కింపు

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి చదురుగుడి హుండీల ఆదాయాన్ని అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో బుధవారం లెక్కించారు. 90 రోజులకు రూ.32లక్షల39వేల788ల నగదు, 39 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, 285 గ్రాముల వెండి వచ్చినట్టు దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌, ఆలయ ఈఓ కె.శిరీష తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రమేష్‌, పద్మావతి, స్వాతికుమారి, పర్యవేక్షణ అధికారి జి.శ్రీనివాస్‌, సేవా సంఘం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ పరీక్షలు

విజయనగరం అర్బన్‌: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు డీఈఓ మాణిక్యంనాయుడు బుధవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌ ‘బీఎస్‌ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్‌’లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. హాల్‌టికెట్‌, ఐడీకార్డుతో అభ్యర్థులు నిర్దేశిత సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరుకావావాలని సూచించారు.

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు 1
1/1

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement