జేఎన్‌టీయూలో ఉచిత శిక్షణ ప్రారంభం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్‌టీయూ–జీవీలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్‌టీయూ జీవీ వీసీ వి.వి.సుబ్బారావు ప్రారంభించారు. ప్రపంచబ్యాంక్ మద్దతుతో అమలవుతున్న ర్యాంపు కార్యక్రమం, ఏపీఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో ఈఎస్‌డీపీ, కిక్‌స్టార్ట్ సిరీస్‌లో భాగంగా జెన్ ఏఐ, అమెజాన్ వెబ్ సిరీస్ అంశాలపై 20 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతికరంగంలో జెన్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఇవి స్టార్టప్‌లు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ తరహా శిక్షణతో విద్యార్థుల్లో ఆవిష్కరణ దృక్పథం, స్వయం ఉపాధి, వ్యాపార సంస్కృతి మరింత బలోపేతమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఎఫ్‌ఐపీఎల్ డైరెక్టర్ ఎస్.వైభవ్, ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ కె.వెంకటేష్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, ఆచార్యులు జీజే నాగరాజు, పలువురు ఆచార్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భారత కోకిల జయంతి
భారతకోకిల సరోజినినాయుడు జయంతిని జేఎన్‌టీయూ జీవీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి వి.వి.కులపతి వి.వి.సుబ్బారావు సరోజినినాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ జీవీ అధికారులు, వివిధ విభాగాల అధిపతులు, ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూలో ఉచిత శిక్షణ ప్రారంభం


