ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు
● ‘పది’ పరీక్షలపై ఉపాధ్యాయుల సూచన
తెలుగు తెలుసుకుంటే సులువు
ప్రశ్నపత్రం సరళిపై అవగాహనతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. పద్యం,గద్యం, ఉపవాచకం నుంచి ప్రశ్నలు ఉంటాయి. కరపత్రం, లేఖ, సంభాషణలో ఏదో ఒక అంశంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు.అలాగే అలంకారాలు, ఛందస్సు, అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి–వికృతులు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, జాతీయాలు 22 నుంచి 32 వరకు ప్రశ్నలు భాషాంశాలపై ఉంటాయి. ఇప్పటి నుంచి ప్రతిరోజూ క్లాస్ రూంలో బోధించే అంశాలను అదే రోజు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరిస్తుంది.చేతి రాత ఆకట్టుకునేలా ఉండాలి.
– పి.గంగ ,తెలుగు పండిట్, ఉన్నత పాఠశాల, రామభద్రపురం
సాధన చేస్తే భౌతిక శాస్త్రం సులభం..
సాధన చేస్తే విద్యార్థులకు బౌతిక శాస్త్రం సులభమవుతుంది.ప్రశ్నపత్రం మొత్తం మీద విషయ అవగాహన అంశాలను వివరించడం, కృత్యాలను రాయడం, ప్రశ్నించడం, కారణాలు తెలపడం,ఉపయోగాలు రాయడం, ప్రమాణాలు రాయడం, పటాలు గీయడం తదితర విద్యాప్రమాణాలను సాధన చేస్తే విద్యార్థులందరూ దాదాపు 70 శాతం మార్కులు తెచ్చుకోవచ్చు. రసాయనిక చర్యల సమీకరణాలు, ఆమ్లాలు, క్షారాలు, కార్బన్, దాని సమ్మేళనాలు, మానవుని కన్ను రంగుల ప్రపంచం,కాంతి పరివర్తనం చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.
– ఎం.శ్రీనివాసరావు, భౌతికశాస్త్రం స్కుల్ అసిస్టెంట్
రామభద్రపురం: పదో తరగతి ప్రతి విద్యార్ధి జీవితంలో కీలకం. పదిలో సాధించిన మార్కులే ఉన్నత విద్య,ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. విద్యార్ధులకు మార్చి 16 నుంచి పది పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక అమలుచేస్తోంది. విద్యార్థులు అత్యధిక మార్కుల సాధన కోసం ఆయా సబ్జెకుకు సంబందించిన సిలబస్‌ను,పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకుని పటిష్ట ప్రిపరేషన్‌కు ప్రణాళిక రూపొందించుకుంటే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్ పూర్తిచేసి ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు రోజూ టెస్టులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలన్నా..అత్యధిక మార్కులు పొందాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సూచనలను పలువురు సబ్జెక్టు నిపుణులు ఇలా వివరించారు.
ప్రాక్టీస్‌తోనే ఉత్తమ మార్కులు..
గణితంలో వందకు వంద మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి చాప్టర్‌ను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతో పాటు వాటికి సంబంధించిన ప్రశ్నలు(ప్రాబ్లమ్స్) ప్రాక్టీస్ చేయాలి. విద్యార్థులు ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.టెక్స్ట్‌బుక్‌లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
– ఆర్ రామారావు, గణితశాస్త్రం
ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాల
హిందీలో సాధనతోనే..
భాగం–1లో 5 పాసేజ్ ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి, భాగం–2లో 4 మార్కుల ప్రశ్నలు నాలుగు రాయాలి. 16 మార్కులు, లేఖ, కవి పరిచయాలు 10 మార్కులు ఉంటాయి. పద్యభాగం, గద్య బాగాలకు సంబంఽధించి 2 పేరాగ్రాఫ్‌లు ఉంటాయి. ఒక్కోదానికి 8 మార్కులు, లెటర్ రైటింగ్ 8 మార్కులకు ఉంటుంది.జనరల్ ఎస్సే 10 మార్కులకు, గ్రామర్ బిట్స్ 15 మార్కులకు ఉంటాయి.
– జి.సుజాత, హిందీ టీచర్, కొట్టక్కి
ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు


