రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

డెంకాడ: మండలంలోని గుణపూరుపేట గ్రామం సమీపంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ లే అవుట్‌ వద్ద మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో పూసపాటిరేగ మండలంలోని రెల్లివలస గ్రామానికి చెందిన ముసినేని మురళి(41) దుర్మరణం చెందాడు. మృతుడి భార్య సరోజిని ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి గుణుపూరుపేట మీదుగా స్వగ్రామం రెల్లివలస వస్తుండగా ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి 10:30 గంటల వరకూ తనతో ఫోన్‌ మాట్లాడారని, అనంతరం ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చిందని భార్య సరోజిని తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున తన భర్త మురళి గుణుపూరుపేట వద్ద స్తంభాన్ని మోటార్‌ సైకిల్‌తో ఢీకొట్టడం వల్ల తీవ్ర గాయాలై మరణించినట్లు తనకు సమాచారం రావడంతో వెళ్లి చూసే సరికి తీవ్రగాయాలతో మరణించి ఉన్నాడని సరోజిని ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement