గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
రాజాం సిటీ: మండల పరిధి అంతకాపల్లి గ్రామానికి చెందిన వాకముళ్ల శంకరరావు (34) గడ్డిమందుతాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఉమావెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న శంకరరావు కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 7న ఉదయం తన భార్య అశ్విని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగేశాడు. భర్త వాంతులు చేసుకుంటుండడాన్ని ఇంటికి వచ్చిన భార్య గమనించి ఆరా తీసింది. గడ్డిమందు తాగినట్లు తెలపడంతో వెంటనే కుటుంబసభ్యుల సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


