దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Feb 8 2026 3:52 AM | Updated on Feb 8 2026 3:52 AM

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

గజపతినగరం : గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాయామ అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రావాడ సత్యనారాయణ శనివారం తెలిపారు. వ్యాయామ సబ్జెక్టుకు సంబంధించిన అభ్యర్థులు తమ విద్యార్హతలతో కూడిన దరఖాస్తును కళాశాలకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపుగా పంపాల్సిందిగా ఆయన సూచించారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో కనీసం 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. నెట్‌, స్లెట్‌, సెట్‌, పీహెచ్‌డీ వంటి అదనపు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో వాసు సత్తా

గుర్ల: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో గుర్లకు చెందిన మంత్రి వాసు రాణించి వెండి పతకాన్ని కై వసం చేసుకున్నాడు. చిత్తూరులోని 75 కేజీల విభాగంలో జరిగిన కుస్తీ పోటీలలో ఉత్తమ ప్రదర్శన చేసి వెండి పతకాన్ని గెలిచినట్టు కుస్తీ కోచ్‌ కర్రోతు జగదీశ్‌ శనివారం తెలిపారు. మంత్రి వాసు ప్రస్తుతం గరివిడిలోని ఎస్‌డీఎస్‌ కాలేజీలో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు. వెండి పతకాన్ని గెలిచిన వాసుకు గ్రామస్తులు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement