కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..! | - | Sakshi
Sakshi News home page

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!

Feb 8 2026 3:52 AM | Updated on Feb 8 2026 3:52 AM

కార్మ

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!

18–45 ఏళ్లలో పథకాల్లో చేరితే..

60 ఏళ్ల తర్వాత రూ.3వేలు

జిల్లాలో 10,234 మంది కార్మికుల నమోదు

విజయనగరం గంటస్తంభం: రోజూ కష్టపడి పని చేసే అసంఘటిత రంగ కార్మికుడికి వృద్ధాప్యంలో ఆర్ధిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్‌ ధన్‌, లఘువ్యాపారి మాన్‌ ధన్‌ పెన్షన్‌ పథకాలను అమలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్లలోపు అర్హులైన వారు ఈ పథకాల్లో చేరితే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల రూ.3 వేల పెన్షన్‌ నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది.

తక్కువ చందాతో జీవిత భరోసా..

నెలకు కేవలం రూ.55 నుంచే చందా చెల్లించి భవిష్యత్తుకు భద్రత పొందవచ్చు. లబ్ధిదారుడు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 10,234 మంది కార్మికులు ఈ పథకాలలో నమోదు అయ్యారు.

అర్హులు ఎవరంటే...

శ్రమ యోగి మాన్‌ ధన్‌ పథకానికి వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు అర్హులు. నెలసరి ఆదాయం రూ.15వేల లోపు ఉండి, ఈఎస్‌ఐ, ఈసీఎఫ్‌ లేని వారు ఈ పథకంలో చేరవచ్చు. లఘువ్యాపారి మాన్‌ ధన్‌ పథకానికి చిన్న దుకాణ యజమానులు, స్వయం ఉపాధిదారులు, రిటైల్‌ వ్యాపారులు, హోటల్‌ యజమానులు అర్హులు.

కుటుంబానికీ రక్షణ

ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేలు పెన్షన్‌ లభిస్తుంది. పెన్షనుదారు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్‌ జీవితకాలం అందుతుంది.

నమోదు విధానం

సమీపంలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (మీ–సేవ) ద్వారా ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ ఆధార్‌తో నమోదు చేసుకోవచ్చు.

వృద్ధాప్య భద్రత కార్మికుడి చేతుల్లోనే..

కార్మికుడు తన వృద్ధాప్యాన్ని తానే భద్రపరుచుకునే అవకాశం ఇది. నెలకు కొద్ది మొత్తం చందాతో జీవితాంతం పెన్షన్‌ భరోసా లభించే ఈ పథకాలను నిర్లక్ష్యం చేయకూడదు. అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారస్తులు అర్హత ఉన్నప్పుడు చేరితేనే రేపటి భద్రత సాధ్యమవుతుంది. జిల్లాలో ఇప్పటికే వేల మంది ముందడుగు వేశారు. ఇంకా మిగిలిన ప్రతి అర్హుడు తప్పకుండా ఈ పథకాలలో చేరాలి.

& G‹ÜyîlÒ {ç³Ýë§ýl-Æ>Ð]l#, hÌêÏ M>ÇÃMýS Ô>Q ˘

ఉప కమిషనర్‌, విజయనగరం

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!1
1/3

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!2
2/3

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!3
3/3

కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement