గోల్డ్‌ మెడల్‌ విజేతలకు ఎస్పీ అభినందన | - | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ మెడల్‌ విజేతలకు ఎస్పీ అభినందన

Feb 8 2026 3:52 AM | Updated on Feb 8 2026 3:52 AM

గోల్డ్‌ మెడల్‌ విజేతలకు ఎస్పీ అభినందన

గోల్డ్‌ మెడల్‌ విజేతలకు ఎస్పీ అభినందన

గోల్డ్‌ మెడల్‌ విజేతలకు ఎస్పీ అభినందన

విజయనగరం క్రైమ్‌ : అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన విజయనగరం వన్‌ టౌన్‌ లేఎస్‌ఐ ఆల్తి త్రినాధరావు, రిటైర్డ్‌ ఏఆర్‌ హెచ్‌సీ మజ్జి శంకరరావును ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ శనివారం తన చాంబర్లో అభినందించారు. ఇటీవల నేపాల్లోని పోకరాలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో వీరు రాణించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి యువతకు, ఔత్సాహిక క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ పోటీల్లో 60+ విభాగంలో వన్‌ టౌన్‌ ఏఎస్‌ఐ ఆల్తి త్రినాధరావు పాల్గొనగా, 70+ విభాగంలో రిటైర్డ్‌ ఏఆర్‌ హెచ్‌సీ మజ్జి శంకరరావు పాల్గొన్నారన్నారు. ఐదు దేశాలకు చెందిన క్రీడాకారులతో పోటీపడి, అన్ని విభాగాల్లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం వన్‌ టౌన్‌ సీఐ ఆర్‌.వి.ఆర్‌.కె.చౌదరి, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement