అగ్ని ప్రమాదం
సంతకవిటి: మండలంలోని గోవిందపురం గ్రామంలో కరెంట్ వైర్లు తెగి పడిన కారణంగా శనివారం రాగోలు గణనాధకు చెందిన 10 ధాన్యం బస్తాలు, 2 ఎకరాలు మినప చేను, 3 ఎకరాలు గడ్డి వాములు దగ్ధమైనట్టు రాజాం ఫైర్ సిబ్బంది తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.60 వేలు ఉంటుందని తెలిపారు. రాజాం ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
గరికిపాడులో..
మండలంలోని గరికిపాడు గ్రామానికి చెందిన వావిలపల్లి రమణకు చెందిన ఎకరం చెరకు తోట అగ్నికి ఆహుతైంది. ఫైర్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నప్పటికీ చెరకు తోట దగ్గరకు వెళ్లే మార్గం లేక పోవడంతో వెనుదిరిగింది. గ్రామస్తులు స్పందించి మంటలను అదుపుచేశారు. లేదంటే చుట్టూ ఉన్న దాదాపు నాలుగు ఎకరాల చెరకు తోట దగ్ధమయ్యేదని గ్రామస్తులు తెలిపారు.


