ఇటలీలో ఉద్యోగ అవకాశాలు
● జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రశాంత్‌కుమార్
రామభద్రపురం: ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఇటలీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని.. అర్హత ఉన్న యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రశాంత్‌కుమార్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంక్రీట్ పంపు డ్రైవర్, కన్‌స్ట్రక్సన్ కార్పెంటర్, కన్‌స్ట్రక్సన్ ఫోర్‌మెన్, ఐరన్ వర్కర్, ట్రక్ డ్రైవర్ తదితర ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. ఆయా ఉద్యోగాలకు ఇంటర్, ఐటీఐ, డిప్లమా విద్యార్హతతో పాటు మూడేళ్ల పాటు ఆయా వృత్తులలో పూర్తి అనుభవం ఉండాలన్నారు. నెలకు జీతం రూ.2.30 లక్షలు ఇస్తారన్నారు. ఇటలీ వెళ్లడానికి ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలన్నారు. అలాగే వెళ్లే అభ్యర్థులు రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1లక్ష, రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీలు కింద రూ.35 వేలు చెల్లించాలన్నారు. ఈ డబ్బులు ఇటలీలో సెలక్ట్ అయి ఆరు నెలలు పని చేసిన తర్వాత మొత్తం రూ.1.35 లక్షలు తిరిగి ఇచ్చేస్తారని చెప్పారు. ఎంపికై న అభ్యర్టులకు న్యూఢిల్లీలోని ఇటాలియన్ ఎంబసీలో శిక్షణ ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్ఠులకు సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. ఇంట్రస్ట్ ఉన్న అభ్యర్థులు నైపుణ్య.ఏపీ.గోవ్,ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీటీ గిరిధర్ పాల్గొన్నారు.


