ప్రియుడి కోసం భర్తపై హత్యాయత్నం
చికెన్
● తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
● నిందితులకు 14 రోజులు రిమాండ్
పాచిపెంట: తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించి తమ్ముడితో కలిసి భర్తను హతమార్చేందుకు ఓ భార్య యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పాచిపెంట మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన కిర్ల కుమార్ అనే వ్యక్తికి 23 ఏళ్ల క్రితం కొట్టక్కి గ్రామానికి చెందిన ఇష్టం ఈశ్వరమ్మతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు చైన్నెలో ఉద్యోగం చేయగా, పాప ప్రస్తుతం చదువుకుంటోంది. అయితే ఈశ్వరమ్మ అదే గ్రామానికి చెందిన సారిక తవిటినాయుడు అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం నుంచి వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ విషయంపై భర్తతోపాటు గ్రామస్తులు పలుమార్లు ఆమె హెచ్చరించినప్పటికీ ఈశ్వరమ్మలో మార్పు రాలేదు. ఈనెల 4వ తేదీన ఈశ్వరమ్మ తన ఇంట్లో తవిటినాయుడుతో కలిసి మరోసారి భర్త కుమార్‌కు పట్టుబడింది. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తామని భర్త కుమార్‌ను ఈశ్వరమ్మ బెదిరించడంతో కుమార్ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం కుమార్ పొలానికి వెళ్లి పని చేసుకుంటుండగా, ఈశ్వరమ్మ,ఆమె తమ్ముడు పాపారావుతో కలిసి పొలం వద్దకు వెళ్లి అటుగా ఎవరూ రాకుండా తవిటినాయుడిని కాపలా ఉంచి కుమార్‌ను హతమార్చేందుకు కొడవలితో దాడికి పాల్పడింది. ఈ దాడిలో కుమార్ మెడపైన ముక్కు పైన పెద్ద గాయాలయ్యాయి, ఆ సమయంలో కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి గ్రామస్తుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాచిపెంట ఎస్సై లాలా అర్జున్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ను కోర్టు విధించింది.
ప్రియుడి కోసం భర్తపై హత్యాయత్నం


