డిప్యూటీ సీఎం ఎక్కడ?
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ వంతెన నిర్మాణం నిమిత్తం ప్రజలు పోరాటాన్ని చూసి సంఘీభావం తెలిపారు. వంతెన పోరాట కమిటీ ఏర్పాటుచేసిన నిరవధిక దీక్షల్లో భాగంగా 2018 అక్టోబర్ 20న పవన్ వాల్తేరుకు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. తమకు అధికారం వచ్చిన తరువాత ఇక్కడ వంతెన ఎందుకు నిర్మాణం జరగదో చూస్తామంటూ ప్రగల్బాలు పలికారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలను వంచించడం సబబుకాదని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా బలసలరేవు వంతెన పరిస్థితిని కనీసం పట్టించుకోవడంలేదు. ఈయన కూడా చంద్రబాబు బడిలో చేరడంతో వంతెన నిర్మాణంపై నమ్మకం సన్న గిల్లుతోందన్న వ్యాఖ్యలు ఈ ప్రాంత ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.


