పూరిల్లు దగ్ధం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లెంక కసవయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించి పూరిల్లు కాలిబూడిదైంది. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. బీరువాలో ఉన్న సుమారు రూ.30వేల నగదు, తులం బంగారం, దుస్తులు అగ్నికి ఆహుతై బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆకట్టుకున్న అశ్వాల దౌడు
లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామంలో శ్రీనందీశ్వరస్వామి తీర్ధం మహోత్సవం సందర్భంగా గుర్రాల పరుగు పందెం పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనరగం జిల్లాల నుంచి 13 గుర్రాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అలమండ శ్రీనురాజుకు చెందిన గుర్రం మొదటి స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన అశ్వాల యజమానులకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు.
బొబ్బిలి: స్థానిక రైల్వే స్టేషన్‌ను అనుసరించి ఉన్న రైలుపట్టాలపై అనుమానాస్పదంగా సంచరిస్తూ ఆత్మహత్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిని పట్టుకుని కౌన్సెలింగ్ చేసి బంధువులకు అప్పగించిన ఆర్‌పీఎఫ్ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొదిలాపు రాంబాబు(32) అనే వ్యక్తి బొబ్బిలి శివారులో సీతానగరం స్టేషన్ మధ్యలో ప్లాట్‌ఫాం నంబర్ 1 లైన్‌లో ఉన్న పట్టాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. ఆ వ్యక్తిని గమనించిన రైల్వే ఏఎస్సై హెచ్‌కే పాణిగ్రహి, హెచ్‌సీ బి.ఈశ్వర రావు, సిబ్బంది వెంటనే వెళ్లి పట్టుకుని రైల్వేపోస్టుకు తీసుకువచ్చారు. అతనిని విచారణ చేయగా కుటుంబ, వైవాహిక పరయిన సమస్యలతో తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడంతో కుటుంబసభ్యులు, బంధువుల నంబర్లకు సమాచారమందించి రప్పించి ఆ వ్యక్తిని అప్పగించారు.
8న రా.ర.వే సమావేశం
రాజాం సిటీ: ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజాం రచయితల వేదిక సమావేశం నిర్వహించనున్నామని వేదిక నిర్వాహకు ఛిజీ గార రంగనాథం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లా రవికుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ‘మనుషులు మాయమయే కాలం’ అనే నవలపై పొదిలాపు శ్రీనివాస్ ముఖ్య ప్రసంగం చేయనున్నారని పేర్కొన్నారు. సమావేశానికి భాషాభిమానులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కవులు హాజరుకావాలని కోరారు.
భక్తిశ్రద్ధలతో లలితాదేవి పారాయణం
రాజాం సిటీ: స్థానిక సంతమార్కెట్ ఆవరణలో వెలిసిన మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం లలితా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుడు ధూపం యశ్వంత్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పూరిల్లు దగ్ధం
పూరిల్లు దగ్ధం
పూరిల్లు దగ్ధం


