11 బార్లకు లైసెన్సుల మంజూరు | - | Sakshi
Sakshi News home page

11 బార్లకు లైసెన్సుల మంజూరు

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

11 బార్లకు లైసెన్సుల మంజూరు

11 బార్లకు లైసెన్సుల మంజూరు

కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి చేతుల

మీదుగా లాటరీ ప్రక్రియ

ప్రభుత్వానికి రూ.3.10 కోట్ల ఆదాయం

విజయనగరం రూరల్‌: జిల్లాలో మిగిలిపోయిన 11 బార్లకు లైసెన్స్‌లు మంజూరయ్యాయి. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి లాటరీతీసి బార్లు కేటాయించారు. జిల్లాలోని 31 బార్లకు గతంలోనే 20 బార్లకు లైసెన్సులు మంజూరు చేయగా మిగిలిన 11 బార్లకు ఎకై ్సశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. బార్ల లైసెన్సులకు 62 మంది దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.3.10 కోట్లు ఆదాయం లభించింది. లాటరీ ప్రక్రియ నిర్వహణకు ఆడిటోరియంలో 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌ వద్ద తహసీల్దార్‌, ఒక సీఐను నియమించారు. రిజర్వ్‌ 1, రిజర్వ్‌ 2 దరఖాస్తుదార్ల పేర్లను సైతం లాటరీలో ఎంపిక చేశారు. రెండు రౌండ్లలో లాటరీ ప్రక్రియ ముగించారు. కార్యక్రమంలో అబ్కారీశాఖ డీసీ వై.శ్రీనివాసచౌదరి, ఈఎస్‌ బి.శ్రీనాథుడు, ఏఈఎస్‌ ఎ.శ్రీరంగందొర, ఎకై ్సజ్‌ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement