పీజీఆర్‌ఎస్‌కు 260 వినతులు
విజయనగరం కలెక్టరేట్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 260 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ.మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, బి.శాంతి,నూకరాజు, కళావతి తదితరులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వారి సమస్యల పరిష్కారం కోరుతూ 260 మంది తమ సమస్యలు వినతుల రూపంలో చెప్పుకున్నారు. వాటిలో పీజీఆర్‌ఎస్‌కు 186 వినతులు రాగా, రెవెన్యూక్లినిక్‌కు 74 ఆర్జీలు వచ్చాయి. వాటిని సంబంఽధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని కోరారు. నిర్ణీత గడువు లోగా వాటికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా నెల్లిమర్ల సామాజిక ఆరోగ్యకేంద్రంలో సరైన పరిష్కారం చూపారని గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన కర్రోతు పైడిరాజు తెలియజేయడం విశేషం. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.


