ఖాళీ పేపర్లే విద్యుత్ బిల్లులు
● అయోమయంలో వినియోగదారులు
భోగాపురం: విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వినియోగదారులను ఆవేదనకు గురిచేస్తోంది. భోగాపురంలో మీటర్లను స్కాన్‌చేసి ఇచ్చిన బిల్లులపై వినియోదారుని పేరు, వినియోగించిన యూనిట్లు, చెల్లించాల్సిన మొత్తం వివరాలేవీ లేకుండా ఖాళీ కాగితం పేపర్లు ఇవ్వడంతో వినియోగదారులు భగ్గుమంటున్నారు. ఎంత బిల్లు చెల్లించాలో ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. యంత్రాల్లోని సాంకేతిక లోపానికి తాము మూల్యం చెల్లించాలా అని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే వినియోగదారులకు సరైన బిల్లులు అందజేసి ఆలస్య రుసుము లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.


