12న జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

12న జాబ్‌ మేళా

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

12న జాబ్‌ మేళా

12న జాబ్‌ మేళా

● జేఎన్‌టీయూ జీవీ వీసీ వీవీ సుబ్బారావు

● జేఎన్‌టీయూ జీవీ వీసీ వీవీ సుబ్బారావు

విజయనగరం రూరల్‌: స్థానిక జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12న జాబ్‌ ఫెయిర్‌–2026 నిర్వహించనున్నట్లు ఉపకులపతి వీవీ సుబ్బారావు తెలిపారు. జాబ్‌ ఫెయిర్‌ను పురస్కరించుకుని వాల్‌పోస్టర్‌ను విశ్వవిద్యాలయం డైరెక్టర్లతో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జేఎన్‌టీయూ జీవీ, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌–ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఈ జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహించనున్నామన్నారు. బీటెక్‌, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ చదివిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌ ఫెయిర్‌లో మేధా సర్వో, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌, వోల్టాస్‌, కియా మోటార్స్‌, హ్యుండయ్‌, యోకోహామా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొని ట్రైనీ, అసెంబ్లీ ఆపరేటర్‌, ఆపరేటర్‌, ఎన్‌ఏపీఎస్‌ ట్రైనీ ఉద్యోగాలు అందిస్తున్నాయన్నారు. ఉద్యోగ స్థానాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉంటాయని పేర్కొన్నారు. జీతభత్యాలు నెలకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలు ఉంటాయని తెలిపారు.

జేఎన్‌టీయూలో ఓరియంటేషన్‌

అభ్యర్థులను ఇంటర్యూలు, ఎంపిక ప్రక్రియలకు సిద్ధం చేయడానికి ఈ నెల 9 నుంచి 11 వరకు జేఎన్‌టీయూలో ఓరియంటేషన్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు బయోడెటాతో జతచేసి అందించాలని, విజయనగరం, సమీప జిల్లాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలరని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement