భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు
● గర్జించిన భోగాపురం, సుందరపేట రైతులు
భోగాపురం: తరతరాలుగా సాగు చేసుకుంటున్న జీవనాధారమైన భూములను అభివృద్ధి పేరుతో లాక్కుంటే ఊరుకునేది లేదని భోగాపురం, సుందరపేట గ్రామాల రైతులు స్పష్టం చేశారు. తమ పొలాల వద్ద శనివారం ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్‌లు అంటూ రహస్యంగా భూముల సర్వే చేయడంపై మండిపడ్డారు. రైతుల పోరాటానికి స్థానిక ప్రజా ప్రతినిధులు పడాల శ్రీనివాసరావు, కొమ్మూరు సుభోషణరావు, సుందర హరీష్, పడాల భానుప్రకాష్, పల్లంట్ల జగదీష్ తదితరులు మద్దతు ప్రకటించారు.


