అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం
● డిప్యూటీ ఈఓ మోహనరావు
రామభద్రపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలపై ఉపాధ్యాయులతో పాటు వేరెవరైనా తరగతి గదిలో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని డిప్యూటీ ఈఓ కె.మోహనరావు హెచ్చరించారు. రామభద్రపురం ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతులకు బోధించే ఓ ఉపాధ్యాయుడి వికృత చేష్టలపై హెచ్‌ఎంకు ఈ నెల 8న ఏఎంసీ చైర్మన్‌తో కలిసి బాలికలు ఫిర్యాదు చేయడం, ఆయన మందలించిన అంశం తెలిసిందే. దీనిపై డీఈఓ మాణిక్యంనాయుడు స్పందించారు. పాఠశాలకు వెళ్లి విచారణ జరపాలని డిప్యూటీ ఈఓ మోహనరావు, ఎంఈఓ తిరుమల ప్రసాద్‌ను ఆదేశించారు. ఈ మేరకు వారు పాఠశాలను మంగళవారం సందర్శించారు. హెచ్‌ఎం వి.గోపాలనాయుడుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలికలతో మాట్లాడి ఉపాధ్యాయుడి చేష్టలపై ఆరా తీశారు. నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు.
పుణ్యగిరిని పరిశీలించిన ఎస్పీ
శృంగవరపుకోట: శివరాత్రి జాతరకు సిద్ధమవుతున్న పుణ్యగిరి క్షేత్రాన్ని ఎీస్పీ ఏ.ఆర్.దామోదర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగ్ పాయింట్లు, భద్రత ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. కొండపైన, దిగువన ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, బారికేడింగ్, క్యూలతో పాటు జాతరకు వచ్చే భక్తుల రద్దీ విషయాలను స్థానిక పోలీసులు, దేవదాయశాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అనంతరం ఉమాకోటిలింగేశ్వరుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ నారాయణమూర్తి, ఎస్‌బీ సీఐ ఎ.వి.లీలారావు, ఎస్.కోట ఎస్‌ఐ చంద్రశేఖర్ ఉన్నారు.
ఫైలేరియాను అరికడదాం
గుర్ల: ౖఫైలేరియా వ్యాధిని అరికడదామని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గుర్ల మండలం పాలవలస హైస్కూల్ విద్యార్థులతో ౖఫైలేరియా నివారణ మాత్రలను మంగళవారం మింగించారు. ఫైలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ జీవనరాణి, ఎంపీపీ పొట్నూరు ప్రమీల, ఎంపీడీఓ రవికుమార్, ఎంఈఓ ఎస్.భానుప్రకాష్, వైద్యాధికారి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం
అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం


